వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బురపరుస్తోన్న బృహదీశ్వరాలయం .. ఏళ్లు గడుస్తోన్న చెక్కుచెదరని నిర్మాణం

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151


భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఈ దేవాలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. తంజావూరులోని ఈ ఆలయం పేరు బృహదీశ్వరాలయం.

13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. భారతదేశంలో 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇదే.

The largest Shivling in India is in Thanjavur

ఇక్కడి శివలింగం ఎత్తు 3.7 మీటర్లు కాగా నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ ఆలయ విశేషం. మనం మాట్లాడుకునే శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

మిట్ట మధ్యాహ్నము సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీ మీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. అసలు అవి అలా ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీనే.

వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి, అయితే ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. మన పూర్వికుల మేధా శక్తి ఎంత గోప్పదో సైన్స్ కు అంతుచిక్కని కట్టడాలను కట్టి అబ్బుర పరిచారు. చూడదగిన ముఖ్యమైన దేవాలయంలో ఈ బృహదీశ్వరాలయం ఒకటి .

English summary
The largest Shivling in India is in Thanjavur, Tamil Nadu. The temple has a history of about a thousand years. There are many dark secrets and wonders in the temple. The temple in Thanjavur is the name of the Jyotirlingar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X