వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవునా పుట్టిన రోజు ఇలా జరుపు కోవాలా..?

By Pratap
|
Google Oneindia TeluguNews

పుట్టినరోజు అనేది మనం తిధుల ప్రకారం జరుపుకోవాలా లేక ఇంగ్లీష్ తేదీల ప్రకారం జరుపుకోవాలా అనే విషయంలో కొందరికి సందేహం వస్తూ ఉంటుంది. ప్రస్తుతకాలంలో చాలా మంది విదేశీ సాంప్రాదాయ మొజులోపడి ఆ పద్ధతులనే అలవాటు చేసుకుని స్వదేశీ సంప్రాదాయం సంస్కృతిని ముఖ్యంగా శాస్త్రాన్ని మరిచిపోతున్నారు.

వాస్తవానికి పుట్టిన రోజు అనేది తిధుల ప్రకారం చేసుకోవడమే సర్వత్ర శుభకరం.మన భారతీయ హిందు సాంప్రాదాయ ప్రకరం దీపాన్ని వెలిగించే సంస్కృతి మనది.దీపాన్ని ఆర్పే సంస్కృతి కాదు మనది.పద్దతిగా అంటే మనం తెలుగు నెలల ప్రకారం ఏనెలలో ఏపక్షంలో ఏ తిధి రోజున పుట్టమో గుర్తుపెట్టుకుని ఆరోజే పుట్టిన రోజు జరుపు కోవడమే నిజమైన పుట్టిన రోజు అవుతుంది.అందుకే అవతార పురుషులైన శ్రీకృష్ణుని,శ్రీరాముని పుట్టిన రోజులు మనం తిధుల ప్రకారమే జరుపుకుంటాము.

ప్రయోగాత్మకంగా కూడా చూస్తే మనకు తెలుస్తుంది.ఉదా 03-09-2016 దుర్ముఖి నామ సంవత్సర భాద్రపద శుద్ధ విదియ శనివారం ఉదయం 9:32 నిముషాలకు బాలుని జననం జరిగింది.అదే సమయమునకు ఆరు బయట ఒక అద్దమునకు మసిరాసి దాని మీద సూర్యుని కాంతి పడునట్లుగా చేసి అక్కడ సుద్దతో గీతను గీసి,తరువాత అద్దమును అక్కడ పదిలముగా ఉంచి, మళ్ళీ తిరిగి మరుసటి సంవత్సరము తెలుగు నెలల ప్రకారం అదే తిధి రోజు 23-08-2017 హేమలంబ నామ సంవత్సర భాద్రపద శుద్ధ విదియ బుధవారం ఉదయం పరిశీలిస్తే ఆశ్చర్యం కిరణములు గీత ఉన్న చోటనే ఉన్నాయి ఇది ప్రయోగాత్మకంగా నిర్ధారణ జరిగినది.తారీఖుల ప్రకారం కూడా చూడగా దరిదాపులలో కూడా లేదు.అద్దానికి ఐదు అడుగుల దూరములో పడటం గమనించడం జరిగినది.చూసారా మనం పుట్టిన రోజు అనేది సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుందో ఖగోళశాస్త్ర ఆధారంగా తెలియవస్తున్నది.

The process to celebrate birth day

భారతదేశ హిందు ధర్మము,సంస్కృతి,సాంప్రాదాయం ఎంత గొప్పదో గమనించ వచ్చు. తిథులను సూర్యుని గమనానికి ఎంత పక్కాగా సరిపోతున్నాయో గమనించవచ్చు.కాని తేదీల సంస్కృతిని ప్రకృతి సైతం తిరస్కరించడం గమనించాము.కాబట్టి పుట్టిన రోజులు అనేవి సూర్యుడు సైతం ఆమోదించిన తిథుల ప్రకారం జరుపుకోవాలి.

పుట్టినరోజు నాడు ఏంచేయాలి అంటే ఉదయన్నే నిద్రలేచి ముందుగా అరచేతులను చూసుకుని,తలిదండ్రులకు సాష్టాంగ నమస్కారములు చేయాలి. అందుబాటులో వారు లేకపోతే మీకు నచ్చిన దేవున్ని స్మరించుకుని నమస్కారం చేసి ఆ తర్వాత నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని ఒళ్ళంతా నువ్వుల నూనేతో మసాజ్ చేసుకుని కనీసం అరగంట ఆగి స్నానం చేసే నీళ్లలో చిటికేడు పసుపు వేసుకుని తలస్నానం చేసి ఇంట్లో దేవున్ని పూజించాలి,దధ్యోజనం (పెరుగన్నం) నైవేద్యం చూపించి.ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదాలు తీసుకొవాలి.శక్తి కలిగిన వారు ఆయుష్య హోమం చేయించుకుంటే చాలా మంచిది.

The process to celebrate birth day

ఆ తర్వాత నచ్చిన దేవాలయానికి వెళ్ళి మీ శక్తి కొలది పూజ చేయించుకుని దేవునుకి నివేదన చేసిన దధ్యోజన ప్రసాదాన్ని మొదట తను తిని శుభ్రంగా చేతులు కడుక్కొని ఇరుగు పొరుగు వారికి ముఖ్యంగా పేదవారికి,అనాధలకు,వృద్ధులకు,అవిటివారికి పంచిపెట్టాలి స్థోమత కలిగిన వారు అన్న,వస్త్ర,వస్తు ధానాలు చేస్తే మంచిది.ఈ విధంగా చేస్తే కొంతవరకు గ్రహభాదలు తొలగి ప్రశాంతతను ఇస్తాయి.ఈ ఆయుష్య హోమం మరియు పై తెలిపిన పద్దతిని పాటిస్తే మళ్ళి వచ్చే పుట్టిన రోజు వరకు దైవశక్తి రక్షణగా నిలిచి అన్నింటా శుభఫలితాలు కనబడతాయి,ముఖ్యవిషయం ఏమిటంటే చేసే పనిని శద్ధతో,మనస్సు పెట్టిచేయగలిగితే తప్పక శుభఫలితాలను చవి చూస్తారు.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Astrolger describes the process to perform birth day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X