వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్తవ్యమే కర్మ సిద్దాంతం: అదే మానవధర్మం..

|
Google Oneindia TeluguNews

శ్లో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోsస్త్య కర్మణి

ఓ అర్జునా నీకు కర్మాధికారమేగాని ఫలితాధికారం లేదు. కర్మఫలానికి నీవే కారణమణి భావించరాదు. కర్మను విడచిపెట్టే మనసు నీకు రాకూడదు అన్నాడు గీతాచార్యుడు.కర్మ అంటే మన కర్తవ్యం.నీ భాద్యాత కర్తవ్యం ఏదైతే ఉందో అది నీవు తప్పక చేయాలి కాని ఆ చేసే పనిపై జయాపజయముల విశ్లేషణ హితాహితముల వివరణ మనస్సులోనికి రానివ్వకూడదు.

The Significance Of Karma archives

కర్తవ్య నిర్వహణ ఒకటే గురిగా గుర్తుండాలి సుమా అంటాడు.జగద్రక్షకుడైన శ్రీ మన్నారాయణుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో అర్జుడికి హితభోద చేసిన విషయం

పూర్వజన్మలోని పాప పుణ్య ఫలితంగా మానవుడిగా ,ఒక వ్యక్తిగా నీకు ఈ జన్మలో ఏర్పడిన బంధాలకు భాద్యతగా విధి నిర్వహాణలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పక నీవు బాధ్యతగా ఆచరించి తీరాలి. ఫలాన పని చేస్తే నాకేమి లాభం.వీరికి,వారికి నేనే ఎందుకు పనిచేసి పెట్టాలి.ఈ పనిని నేనే ఏందుకు చేయాలి. స్వార్ధం,స్వలాభం కొరకు భాద్యతలేకుండా ఆలోచిస్తే దాని ఫలితంగా పాపం ఒడిగట్టుకోవలసి వస్తుంది.

కుటుంబం,సామాజిక బంధాలతో ముడిపడి ఉండి మన జీవితాలు కొన సాగుతుంటాయి.నీకు ఎదుటి వారి సహాయ,సహకారం లేనిదే,పొందనిదే జీవనం,జీవితం ముందుకు సాగదు.అలాంటప్పుడు నీవు భాద్యతగా నీకున్న,ఏర్పడిన బంధాలకు జన్మనిచ్చిన తలిదండ్రులను,జీవిత భాగస్వామిని,సంతానాన్ని,సోదరి,సోదరులను,తాత ,అమ్మమ,నానమ్మ ,పెదనాన్న,పెద్దమ్మ,బాబాయిలు,పిన్నులు మొదలగు అనేక భవ బంధాలను నీ భాద్యతగా తప్పక వారికి సహాయపడితీరాలి.

నీవు చేసే పనికి వారు నిన్ను గుర్తిస్తున్నారా ? ,గౌరవిస్తున్నారా ? లేదా అనే విషయం గురించి అసలు ఆలోచించనే కూడదు. మనం చేసిన పనికి తిరిగి వారి నుండి ఏ ప్రయోజనాన్ని, ఫలితాన్ని ఆశించకూడదు.అలాగే ఇతరుతో నీ అవసరార్ధం వారి శ్రమ దోపిడి చేయకూడదు.ఎదుటి వారి సహాయాన్ని ఉచితంగా తీసుకోవద్దు.తామరాకుపై నీటి చుక్క ఏ విధంగా ఉంటుందో నీవు ఏవ్వరికి ఋణ పడక,స్వార్ధబుద్ధిని రానివ్వక వ్యవహరించ గలిగితే ఏ పాపభీతి అంటదు, ఉండదు.నీ కర్తవ్య బాధ్యతను అశ్రద్ధ చేసినా, విస్మరించి తప్పించుకు తిరిగినా దాని ప్రతి ఫలం తప్పక అనుభవించక తప్పదు.

కర్మసిద్ధాంతం అంటేనే కర్తవ్య సిద్ధాంతం.జ్యోతిష శాస్త్ర ప్రకారం వ్యకి యొక్క జాతక చక్రంలోని "నవమభావం" పూర్వ జన్మ గురించి తెలియజేస్తుంది. మనం పూర్వజన్మలో చేసిన మంచి,చెడు పనులకు వాటి ఆధార ఫలితంగా ప్రస్తుత జన్మలోని కుటుంబ బంధాలు,మిత్రులు,ఇరుగు,పొరుగు,హోదా,జీవన విధానం మొదలగునవి ఏర్పడుతాయి.ప్రస్తుత కాలం నీకు అంతా సవ్యంగా సాగుతుంది అంటే పూర్వ జన్మపుణ్యఫలం తాలుకూ ఫలితం అనుభవిస్తున్నావు అని అర్ధం.పూర్వ జన్మవిషయ వాసన ఏటుపోదు అని పెద్దలు ఊరికే అనలేదు.

ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అయినవాళ్ళు, దగ్గర వాళ్ళు, బంధు మిత్రులు అందరూ ఇబ్బంది పెడుతూ ఏ ఒక్కరు నిన్ను అర్ధం చేసుకోవడం లేదు అంటే దానికి గల కారణం గత జన్మలో నీవు ఎవరికి ఏ ఆశలు కలిగించి తీర్చలేదో,ఏ నమ్మక ద్రోహం చేసావో,లేదా నీ కుటుంబ భాద్యతలను విధిగా నిర్వహించ కుండా తప్పించుకున్నావో,ఏ ప్రాణికో నీ వలన ఏ ఇబ్బంది జరిగిందో దాని ఫలితమే ప్రస్తుత కాలంలో జాతక గోచార గ్రహాస్థితుల ఫలిత ఆధారంగా కష్టాలు,నష్టాలు అనుభవించడం జరుగుతుంది.

ఈ సూక్ష్మ విషయాన్ని గ్రహించక ఎన్ని పూజలు చేస్తున్నాము ఎన్ని ధాన ధర్మాలు చేస్తున్నాము అయినా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి అని కొంత మంది వాపోతుంటుంటారు.గత జన్మలోని కర్మఫలితాన్ని పూర్తిగా తొలగించు కున్నాకే ప్రస్తుత జన్మయొక్క శుభఫలితాలు ప్రారంభమౌతాయి.ఇన్ని తెలుసుకున్నాక కూడా తప్పులు చేసినా,భాద్యతలను విస్మరించిన దాని ఫలితం ప్రస్తుత జన్మలో,వచ్చేజన్మలో అనుభవంలోకి వస్తూనే ఉంటాయి.

కొంత మందికి సందేహం రావోచ్చు ఈ మానవ జీవితంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు,కష్టనష్టాలు,ఎత్తుపల్లాలను అధిగమించే మార్గం లేదా అని ,ఎందుకు ఉండదు తప్పక ఆ భాదల నుండి గట్టేక్కాలి అంటే మొదట ఫలాపేక్ష రహితమైన భగవత్భక్తిని అలవాటు చేసుకోవాలి.కన్న తలిదండ్రులను ప్రత్యేక్ష దైవాలుగా భావించాలి,ఇతర బంధాలను గౌరవిస్తూ నీ భాద్యత ఏదైతే ఉందో వాటిని నిస్వార్ధంతో నిర్వహించాలి,నీకు ఇబ్బంది కలిగినను ఎవరి మనస్సును ఇబ్బంది కలిగించక,దూషించకుండా ఉండ గలగాలి.

మన వలన ఈ ప్రకృతిలో దేనికి ఏ హని జరగకుండా జాగ్రత్త పడాలి.ఎవరికి ఎలాంటి ఆశలు,ప్రలోభాలు పెట్ట కూడదు. సాధ్యమైనంత వరకు సాటి వారితో ప్రేమ స్వభావంతో వ్యవహరిస్తూ శక్తి కొలది నీ సంపాదనలో,నీకున్నదానిలో కొంత ధాన ధర్మాలు చేస్తూ, చేసే ప్రతి పనిని ఇష్టంగా చేయగలుగుతూ,ఏది నాది కాదు అంతా భగవతార్పితం మానవ సేవే మాధవ సేవ అనే భావనకు రాగలిగితే ఎలాంటి పాపం అంటక ఈ జన్మలోను,మరి రాబోయే జన్మలోను అంతా మంచే జరుగుతుంది.

మనషిని మహనీయుడిగా మార్చే మహత్తరమైనశక్తి మనస్సుకుంటుంది,ఆ మనస్సును ఆధీనపరచుట కేవలం మనిషికే ( మనకే ) ఉంటుంది.నీకు ఆకలి,దప్పిక,అవసరాలు ఎంత ముఖ్యమో ఎదుటి వారికి కూడా అంతే అనే భావనకు రాగలగాలి. "ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్టా" - "ధర్మే సర్వం ప్రతిష్టితమ్" కర్మచార పరాయణునికి జయాపజయాల యందు భయం ఉండదు జై శ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
In Bhagvad Gita Lord Krishna has preached a lot about significance of Karma. “Karma” (कर्म) is a Sanskrit word which is closely related with action, in-action,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X