వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దీపావళి' నాడు లోక ప్రఖ్యాతి చెందినవి: వైకుంఠం నుంచి భూలోకానికి లక్ష్మీ ..

మామూలుగా అమావాస్య రోజులలో ఎవరూ సంతోషంగా పండుగ జరపడం ఉండదు. కానీ,హిందూమతంలో ప్రత్యేకంగా భారత దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగల్లో దసరా దీపావళి రెండు పండుగలో విశేషము. దీప + ఆవళీ దీపముల యొక్క వరుస

|
Google Oneindia TeluguNews

మామూలుగా అమావాస్య రోజులలో ఎవరూ సంతోషంగా పండుగ జరపడం ఉండదు. కానీ,
హిందూమతంలో ప్రత్యేకంగా భారత దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగల్లో దసరా దీపావళి రెండు పండుగలో విశేషము.

దీప + ఆవళీ దీపముల యొక్క వరుస అని అర్థం. కొన్ని శుభసూచకము లకు ప్రతీకగా ఈ దీపముల యొక్క ఆవలి ఏర్పరచడం జరిగింది.

అందులో లోక ప్రఖ్యాతి చెందిన అంశాలు కొన్ని ఉన్నాయి.

The Spiritual Significance of Diwali

1. వామనుడు బలిని పాతాళానికి తొక్కిన రోజు ఇదే.
2. రాముని పట్టాభిషేకం దినము ఈరోజు.
3. విక్రమార్క శకానికి స్థాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం అయిన రోజు కూడా ఇదే.
4. నరకాసుర వధ అనంతరం జరిపే ఆనందకరమైన ఉత్సవము.

లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చి ఇళ్లల్లో తిరుగుతుందని ప్రజల విశ్వాసం. ఈరోజు ప్రతి ఇంటిని శుభ్రంగా కడిగి అలంకరించి ఉంచుతారు. అందరూ లక్ష్మీదేవిని పూజించడం ఈ పండుగలోని గొప్పతనం.

ఈ పండుగలో ముఖ్యమైన అంశాలు 4.
లక్ష్మీ పూజ,
టపాకాయలు కాల్చడం,
దీపాల అలంకారము,
ఉల్కా దర్శనము.

లక్ష్మీ పూజ ఎలా చేస్తారు?

ప్రార్థనా శ్లోకము
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
బోధన మస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి అనే ఎనిమిది రూపాలతో అమ్మవారిని పూజించడం ప్రతీతి. తమ దగ్గర ఉండే ధనాన్ని అమ్మవారి ముందు రాశిగా పోసి ఆరుపంలోనే అమ్మవారిని పూజిస్తారు.

ఈ దీపావళి పండుగను త్రేతాయుగంలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఐశ్వర్యము చేత గర్వితుడైన వంటి బలిని రసాతలానికి పంపడం కోసం గా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో నడయాడి వచ్చి మూడు అడుగుల నిదానంగా తీసుకుని, విరాట్ రూపం తో లోకాలన్నిటినీ కొలిచి బలి గర్వభంగం చేశాడు అది ఈ రోజుననే చెబుతారు.

రావణ వధ చేసిన శ్రీరామచంద్రుడు సపరి వారంగాఅయోధ్య చేరి అందరి సమక్షంలో ఆనందం గా మన్ననలు పొంది పట్టాభిషిక్తుడుగా రాజ్య పరిపాలన ప్రారంభం చేసిన రోజు ఇది.

తన అనుగ్రహం కోసం గా లక్ష్మీదేవిని పూజించే వారు ఎవరుంటారు వారందరినీ అనుగ్రహించడానికి లక్ష్మీదేవి వస్తుందని ప్రతీతి. రోజు శాస్త్రవిధిగా లక్ష్మీ దేవిని పూజించిన వారికి రుణ బాధలు ఉండవు.

శ్రీ సూక్త పారాయణం
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్....

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.... కాని ప్రారంభమయ్యే చేసి దాన్ని ఎక్కడ చదువుతారు అక్కడ దరిద్రం పోయి ఆరోగ్యము పుష్టి సంతోషం కలుగుతుందని లక్ష్మీదేవి శ్రీ సూక్త సరస్వతిగా అందజేసింది.

ఐశ్వర్యం సరిగ్గా లేని వాళ్ళు
లక్ష్మీదేవిని ఈరోజు తామెర గింజలతో వెనక పూజించినట్లయితే వారికి ఐశ్వర్యం శీఘ్రంగా వస్తుందని పురాణగాథ.

టపాకాయ లెందుకు కాలుస్తారు
పూర్వకాలంలో కొబ్బరి పీచుతో చేయబడినటువంటి ఒక యంత్ర సాధనంతో మెరుగులు వచ్చే విధంగా ఆడేవారు అది రానురానూ టపాకాయల రూపం దాల్చింది.

తెలంగాణలో దీపావళి:

తెలంగాణలో ప్రత్యేకం భాగ్యనగరంలో చాలామంది ఇళ్లలో లక్ష్మీ అమ్మవారి మూర్తిని పెట్టుకుని పూజిస్తారు. అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్లు పూజిస్తారు.

సాయంకాల వేళలో దీపాల కాంతులలో అమ్మ వారిని పూజించడం, కొత్తబట్టలు ధరించడం మామూలు విషయమైతే భాగ్యనగరానికి లేదా హైదరాబాదుకి అధిష్టాన దేవతగా చెప్పబడే చార్మినార్ భాగ్య లక్ష్మి మాత దర్శనం ఈ రోజు చేసుకున్న వాళ్ళకి ఏడాదంతా ధనానికి కొదవ వుండదని బారులు తీరి మరీ అమ్మవారిని దర్శించుకుంటారు.

English summary
Deepavali or Diwali means "a row of lights". It falls on the last two days of the dark half of the Hindu month of Kartik (October-November).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X