వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరదిష్టికి గుమ్మడికాయ: ఎందుకు? ప్రభావం ఎలా ఉంటుంది?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతుంటారు.మీ ఇంటి ముందు దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టారా ?

ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే ఒక భూడిద గుమ్మడికాయ తీసుకొని దానికి అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోకంగా కూశ్మండ పూజ చేయించుకుని ఇంటి ప్రధాన ద్వారం పైన ఉట్టిలో వేలాడదీయండి.

ప్రతీ రోజు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించండి.

ప్రతీ రోజు ఇంట్లో పూజ చేసుకున్నపుడు రెండు అగరబత్తిలను వెలిగించి గుమ్మడి కాయదగ్గర పెట్టండి.

ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని రాకుండా కాపాడుతుంది.మన ఇంటికి చూపించేటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది.

The story about Nara Drishti

మీరు ఎక్కువగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి.మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.

వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి.

ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి.

గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష,నరపీడ,నరదృష్టి,నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.

మన ఇంటికి కాని వ్యాపార సంస్థలకు కాని కట్టిన గుమ్మడికాయ పాడవకున్న ఎప్పుడేప్పుడు తోలగించి కొత్తది కట్టాలి అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది.శాస్త్ర సూచన ప్రకారం మన ఇంటికి గాని వ్యాపార సంస్థలలో కాని పూజించికట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి.

ఇంకా మద్యలో గ్రహణములు వచ్చిన,ఇంట్లో పురుడు మైల వచ్చిన,చావునకు సంబంధించి సూతకం వచ్చిన,ఇంట్లో అమ్మయిలు పుష్పవతి అయిన ఇలాంటి ఏ సూతకం మన ఇంటిదే కాని మన పాలివారిది కాని వస్తే ఆ పూజచేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి.

పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.మనమే ఇంట్లో కాస్త పసుపు పూసేసి కుంకుమ బొట్టు పెట్టి కడుతే ఫలితం అంతాలా ఉండదు.ప్రత్యేకించి కూష్మండ పూజావిధానం అంటు శాస్త్రసూచింగా ఉంది కాబట్టి అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోకంగా కూశ్మండ పూజ చేయించుకుని వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి వారు సూచించిన రోజు వారిచ్చిన మూహూర్థానికి కట్టండి శుభం కలుగుతుంది.

English summary
The Astrologer told about Nara drishti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X