వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్పవతి: రజోదర్శనము అనగా..?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: ప్రధమ ఋతువు (రజస్వల) రజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అగుట.ప్రధమ రజోదర్శనమునకు వాడుకలో సమర్థ, పుష్పవతి, పెద్దమనిషి అయినదని కూడా వ్యవహారిక భాషలో అంటారు. నెల నెల రజోదర్శనమును బహిష్టు అంటారు.ఇలా మొదటి సారి అయిన దానికి పంచాంగరిత్య ఫలితం ఏలా ఉంటుందో గమనిద్దం.ప్రధమ రజస్వల ప్రాతః కాలము నుండి మధ్యాహ్నములోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము.

రజస్వలకు దుష్ట తిధులు :- అమావాస్య , ఉభయ పాడ్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిధుల యందును పరిఘ యోగముల పూర్వార్ధమునందును, వ్యతీపాత, వైధృతి యోగాములందును,సంధ్యా కాలమునందును, ఉప్పెన, భూకంప మొదలైన ఉపద్రవ కాలమందును, భద్ర కరణము నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.

 The story about rajaswala

వారఫలము :- సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము.

ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది.

శుభ నక్షత్రములు :- అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ , శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది.మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును.కావున శాంతి చేయాలి.

రజస్వల కాకుండానే వివాహాలు జరిపించే పూర్వపు రోజుల ప్రకారము భర్త యొక్క జన్మ నక్షత్రమునను హాని అని చెప్పబడినది. దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి దానాదులు నిర్వహించి తిరిగి శుభ నక్షత్రములో రజోదర్శనమైన తదుపరి శుభ ముహూర్త కాలమందు గర్భాదానము చేయాలి.

ఆ విధంగా చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుంది.జ్యేష్ట,ఆశాఢ,మార్గశిర మాసము లందు గండ పురుషుడు భూమి యందు సంచరించును కావున ఆ కాలంలో కన్యక పెద్దదైనను,మరియు గ్రహణ సమయములందు,సంక్రాంతి యందు,అశుభమైన నిద్ర సమయములందు,అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయిన తద్దోష శాంతి కోరకు జప,ధాన శాంతులు చేయీంచవలెను.శాంతి చేసిన రోజుననే గర్భాదానము చేయకూడదు.

శుభ తిధులు :- తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము.

లగ్న గ్రహ ఫలము :- ప్రధమ రజోదర్శన సమయమున కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుభ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు ఉండిన పతి నాశనము కలుగ జేస్తాడు. కాని చంద్ర,తారా బలములు సంపన్నమైనపుడు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి.

కుజుడైనను లేక చంద్రుడైనను లగ్నమునకు 3, 6,10 స్తానములందున్నచో సంపంన్నులగు కుమారులు కలుగుతారు.

నక్షత్ర గ్రహ ఫలము :- రజస్వల సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని ఉన్నను, యే గ్రహము లేకున్నను శుభము. రజస్వల సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ,శుక్రులు కలిసి ఉన్నను, రవి ఉన్నను రాహు,కేతువులున్నను అశుభము.

రజోదర్శన స్థాన ( స్థల ) ఫలితము :- తన ఇంటి యందును, గోడల చావిడియందును, స్వగ్రామ మధ్యమందు, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్య ప్రధమ రజస్వల అయిన శుభము.గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా ఉన్నపుడు ఇతరుల ఇండ్లలోను ప్రధమ రజస్వల అయిన అశుభము.

వేళా విశేష ఫలితములు :- ప్రాతః కాలం చిర సౌభాగ్యం, సూర్యోదయ కాలం సౌభాగ్య లోపం, పూర్వాహ్నం పుణ్య క్షేత్ర దర్శనం, మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగునం, సంధ్య సమయంలో చెడు ప్రవర్తన కలది, అర్ధరాత్రి బాల వైధవ్యం కలుగును.

రాత్రి వేళ నిర్ణయం :- రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్ర ఫలము :- తెల్లబట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, పట్టు వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించిన శుభ సంపన్నురాలగును, చిరిగిన బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

రజస్వల శుద్ధి :- రజోవతి అయిన స్త్రీ మొదటి దినమునండు చండాల స్త్రీ సమానురాలు,
రెండవ దినమందు పతితురాలితో సమానురాలు,
మూడవ దినమునండు మలిన స్త్రీతో సమానము,
నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు,
అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలు అన్నారు.

నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మల్లి పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి చాప / తాటి ఆకు వేసి కూర్చుండ బెట్టాలి.దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. ముత్తైదువలకు శ్రీ గంధము, పుష్పములను, తాంభూలములను , పెసలు మొదలగునవి ఇవ్వాలి. ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి , పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు , పులుపు , కారము లేకుండా ఇచ్చుట మంచిది , నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి.

అమ్మయి ప్రధమ పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగ ప్రకారం అమ్మయి అయిన ఘడియకు ఫలితం ఏవిధంగా ఉందో అని తెలుసుకుని వారిచ్చే శాస్త్ర సంబందమైన సూచనలను తప్పక పాటించాలి.మగవారి పుట్టినప్పటి సమయం తో జాతకం ద్వార భవిష్యత్ వివరాలు తెలుస్తాయి.అమ్మయిలకు పుట్టినప్పుడు తెలిసే విషయాలకంటే పుష్పవతి అయిన సమయంతో భవిష్యత్,జీవన విధానం అనేది సంపూర్ణంగా తెలుస్తుంది.

English summary
The Astrologer told the story about rajaswala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X