వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విష్ణు సహస్రనామ స్తోత్రం: ఫలితమెలా ఉంటుంది?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవము భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు.వాల్మీకి మహర్షి ప్రణీతమైన రామాయణము. శ్రీవేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్భారతము. శ్రీమద్భారతానికి రెండింటి వల్లనే గౌరవం అని పెద్దల యొక్క సూక్తి. అందులో మొదటిది శ్రీ కృష్ణ భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత రెండవది.

భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన విష్ణు సహస్రనామ స్తోత్రము.

ఈ రెండింటిలో మొదటి దానిని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించాండు.రెండవ దానిని భారత సంగ్రామానంతరం అంపశయ్యపై పడియుండిన భీష్మపితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేసాడు.

the story about vishnu sahasranamam stotram

ఈ రెండింటిలో భగవద్గీత కంటే విష్ణు సహస్ర నామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చని కృష్ణుని అభిమతం.

ఇందులో 108 శ్లోకాలున్నాయి.భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకు ఉన్న నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.అంటే 27 నక్షత్రాలు 4 చే భాగిస్తే వచ్చేది 108 ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే 108 పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి.

ఏ నక్షత్రంలో ఏ పాదానికి చెందినవారు ఆయా పాదసంఖ్య శ్లోకాన్ని తెలుసుకుని 11,21,41,54,108 సార్లు మీ వీలును బట్టి చదువుకోవాలి.మీ జన్మ నక్షత్రము ప్రకారము గానీ లేదా వ్యవహార నామం ప్రకారం గానీ చదువుకోవచ్చు.మన నక్షత్ర పాదమునకు సంబంధించిన మత్రం చదువుకుంటే మన నక్షత్ర పాద దోషం నివారణ జరుగుతుంది.అదే విష్ణ సహస్ర నామాలు మొత్తం చదువుకుంటే అన్ని విషయాలలో అన్ని నక్షత్ర పాదాల వారితో అనుకూలంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ.

English summary
The Astrologer told the story about vishnu sahasranamam stotram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X