వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలాంటి పూజ వలన భగవంతుడిని సంతృప్తి చేయగలం?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: మనం రోజు చేసే పూజలో అలంకరణ కోసం మంచి అందమైన పూలను తెచ్చి అలంకరిస్తాం. అసలు భగవంతునికి ఇష్టమైన పూలేంటో తెలుసా !
అవి ఏమిటో చూడండి.....

అహింస ప్రథమం పుష్పం

పుష్పం ఇంద్రియ నిగ్రహః

సర్వ భూత దయా
పుష్పం క్షమా పుష్పం
విశేషతః
జ్ఞాన పుష్పం
తప: పుష్పం శాంతి పుష్పం
తథైవ చ
సత్యం
అష్ట విధం పుష్పో: విష్ణో హో ప్రీతి కరం భవేత్ !!

the story about worship of god

* అహింసా పుష్పం అనగా మనం

ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే మొదటి పుష్పం.

* ఇంద్రియ నిగ్రహం అనగా

చేతులు, కాళ్లు,ముఖ్యంగా మనస్సు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.

* దయ అనగా సాటివారు కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

the story about worship of god

* క్షమ అనగా

ఎవరైనా మనకు అపకారం చేసినా, వారిని ఓర్పుతో సహించి వారిని క్షమించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

* ధ్యానం అనగా మన ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ నమ్మిన దైవం మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

* తపస్సు అనగా మానసిక ( మనస్సు ),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

* జ్ఞానం అనగా పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

* సత్యం అనగా

ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.

ఈ పై తెలిపిన పువ్వులను చాలా అరుదైనవి. ఇవి తోటలో దోరికేవి కావు.మన ప్రవర్తన ,చిత్త శుద్ధి, పట్టుదలతో మాత్రమే ఈ పువ్వులను పూయించగలము. భగవంతుని పూజించాలి ఆయనను సంతృపి పరచాలి అంటే చెట్లకు పూసిన అందమైన సుగంధ పరిమళం వెదజల్లే పూల కంటే పై తెలిపిన పూలతో పూజ చేస్తే స్వామి సంతోష పడి మన కోరికలను నెరవేరుస్తాడు. తల్లి చుట్టూ పసిబిడ్డ తిరిగినట్టు ఎల్లప్పుడు నీవెంటనే ఉంటాడు. నీ పూజకొరకు ఎదిరి చూస్తుంటాడు స్వామి. దేవునికి కావలసింది భాహ్య ఆర్బాటం కాదు. అంతరంగిక ఆర్భాటం, ఆరాటాన్ని ఇష్టపడతాడు. మనం ఇలాంటి పూజనే చేద్దాం జై శ్రీమన్నారాయణ.

English summary
The Astrologer told the story about worship of god.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X