వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా దినోత్సవం: వేదకాలం నుండే స్త్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిధిదేవోభవ అని "స్త్రీ"ని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు.స్త్రీ అను పదములో 'స'కార, 'త'కార, 'ర'కారములున్నాయి.
' స' కారము సత్వగుణానికి,
'త' కారము తమోగుణాని,
'ర' కారము రజోగుణానికి ప్రతీకలు.

అంటే త్రిగునాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా స్త్రీని పేర్కోనవచ్చు. సమాజంలో స్త్రీకి ఉన్న స్థానాన్ని నిర్ణయించడానికి మానవ జాతికే తొలి విజ్ఞానమైన ఋగ్వేదం తొలి ఆధారం ఐతరేయ భ్రాహ్మణంలో "తజ్జాయా జాయ భవతి యుద్దస్వాం జాయతే పున:" అంటూ పురుషుడు స్వయంగా స్త్రీ గర్భం నుండి పుత్ర రూపంలో జన్మిస్తాడని.ఈ స్త్రీ వలన పురుషునికి విశ్రామస్థానం,సుఖస్థానం అని చెప్పి స్వయంగా స్త్రీ గృహరూపం అంటూ సంభాషించింది.అస్మదాచార్యుల కాలం నుండి సమాజంలో పురుషులకు స్త్రీ పట్ల పూజ్యభావం అమితంగా వేదకాలంలో ఉన్నది.

 The woman in Vedas as described

నాటి కాలంలో కూడ స్త్రీలు పురుషులతో సమానంగా విజ్ఞాన మార్గంలో, బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించే వారు కాబట్టే నాటి కాలమే స్త్రీని పురుషుడు అమితంగా గౌరవించేవారు. వైదిక విద్య అందరికీ విస్తరించింది.విద్య అనేది పరమాత్మ దత్తం.ఉపనిషత్కాలలో స్త్రీ,పురుషు లిరువురు బహ్మజ్ఞాన తత్వం కలిగి ఉండే వారు.ఆకాలంలో బాలురతో సమానంగా బాలికలకు ఉపనయనాలు చేసేవారు.కొంతమంది బ్రహ్మచర్యం పాటిస్తూ వారి జీవితాలను తపోజీవనంతో దైవానికి అంకితం చేసేవారు,గృహస్త జీవనం కావాలనుకునేవారు తమ గుణ కర్మ స్వభావాలకు అనుగుణంగా యువకులను స్వయం వరంగా పొందేవారు.

ఋగ్వేదంలో ప్రధమ మండలంలో 48,49 సూక్తులు ప్రత్యేకంగా స్త్రీల కోసమే ఉపదేశించాయి.వేదార్ధం ఏమిటంటే స్త్రీ అనేది పురుషునికి మరియి ఈ సభ్యసమాజానికి సూర్యకాంతి(ఉషస్సు) వంటిది అని స్త్రీలు తమ విద్యాశోభతో గృహాన్ని అనుకూలంగా తీర్చి దిద్దే శక్తి కేవలం స్త్రీకే సాద్యపడుతుందని,స్త్రీలవలన భావితరాలకు శిక్షణ,రక్షణగా నిలుస్తుందని తెలియజేసింది.వేదాల తర్వాత అంతంటి మహోన్నతమైనది"మనుస్మృతి"దీనితోనే ఆర్ష వాజ్ఞ్మయం మొదలైంది.

మనుమహర్షికి స్త్రీల పట్ల ఉన్నంత భక్తి శ్రద్ధలు ప్రపంచంలో మరేవ్వరికి లేవు.మనుస్మృతిలో న్యాయస్వరూపమే స్త్రీ అని పేర్కోన్నారు.ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో అక్కడ ఉత్తమ సంతానం కలుగుతుంది.స్రీకి కలిగే ఉత్తమ సంతానం వలననే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది.పుత్రునికి,పుత్రికకు ఆస్తిలో సమాన హక్కులున్నాయన్నాడు మనువు.

వైదిక సంస్కారాలన్ని విశేషంగా స్త్రీ గౌరవాన్ని చాటుతాయి.కొంత మంది స్త్రీలంటే గౌరవంలేని స్త్రీ జాతిని వ్యతిరేకించే వారు స్త్రీలు వేదమంత్ర పఠనానికి అర్హులు కాదని స్త్రీ అంటే వంటింటి కుందేలని లేని పోని ఆంక్షలు విధించే ప్రక్రియ పురుషాదిక్య పాలనలో పెట్రేగి పోయాయి,క్రమేపి అది స్త్రీ జాతికి అనేక రకములైన ఆంక్షలతో కూడిన బంది జీవితానికి స్త్రీ బలిఅవుతూ వస్తున్నది.వేదం ప్రమాణంగా స్వీకరించిన మనువే "స్త్రీహి బ్రహ్మ బభూవిధ" స్త్రీ బ్రహ్మ జ్ఞాని కావలని,స్త్రీ విద్యావతి అయితేనే లోక శ్రేయస్సు కలుగుతుందని చాటి చెప్పారు.

"నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి" అన్నది కేవలం స్త్రీ రక్షణను దృష్టిలో పెట్టుకుని అన్నదే కాని ఇందులో స్త్రీని కించ పరచటం కాదు.

"స్త్రీయశ్చా-పురుషా మార్గాం
సర్వాలంకార భూషితా:
నిర్భయా ప్రతిదద్యన్తే
యధారక్షిత భూమిపా:

ఏ దేశంలో అయితే మహిళలు సర్వాంగ సుందరంగా ఆభరణాలతో అలంకరించుకుని పురుషుని సహయం,తోడు లేకుండా రహదారులలో,వీధులలో దైర్యంగా ఏ భయ బ్రాంతులు లేకుండా తిరగగలదో ఆదేశం సుపరిపాలన కలది అని పంచమ వేదమైన మహాభారతం చెప్పింది.చతుర్వేద సారాంశం మహాభారతం అందుకే మానవాలికి పంచమ వేదం అయ్యింది.

వేదకాలం నుండి స్త్రీని అత్యధికంగా గౌరవిస్తూనే స్త్రీ రక్షణ కొరకు అనుక్షణం ఆరాటపడుతూనే ఉంది.యవత్ సమాజంలో నేటికి కొనసాగుతూనే ఉంది.గాంధి మహాత్ముడు కూడా ఈ మాటే అన్నాడు స్త్రీకి రక్షణ ఉంటే లోకానికే రక్షణ కలుగుతుందని చెప్పాడు.స్త్రీ తాను మరణయాతనను పొంది మరోజన్మనెత్తి జాతి మొత్తాన్ని కని పాలిచ్చి పెంచి,సకల సేవలనందిస్తూ,సృష్టిని సుస్థిరం చేస్తున్న మహోన్నత మూర్తి స్త్రీ.

ఈ సృష్టిలోని స్త్రీని కేవలం మామూలు స్త్రీగా భావించక ఒక పురుషుడి విజయం,కుటుంబ విజయం వెనక స్త్రీ సహకారం లేనిదే పురుషుడికి మనుగడే లేదు,జీవితమే లేదు అన్న సత్యాన్ని గ్రహించి అంతటి మహోన్నతమైన స్త్రీ మూర్తిని గౌరవిద్దాం గౌరవిద్దాం గౌరవిద్దాం యత్రనార్యన్తు పూజ్యంతే-రమంతే తత్ర దేవతా: ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరి ఉంటారు.స్త్రీ మూర్తులందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

English summary
The astrologer explained the importance given to the women by Vedas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X