వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి పరిస్థితుల వలన వాస్తు దోషం ఏర్పడుతుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

వాస్తుదోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి.....?
ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గర నుండి అకారణ చికాకులూ, అనారోగ్యాలూ,లేనిపోని టెన్షన్లు, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చును. జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని గ్రహించాలి.

మన శరీరంలో అయస్కాంత శక్తి ఉంటుంది. మనకు సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే.ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

 There is a problem with these conditions

కొన్ని ఇళ్ళు చూడటానికి కళా విహీనంగా కనబడతాయి.అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మ హత్యలో, హత్యలో జరిగి ఉండవచ్చు అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు.అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు,అవి లేకపోయినా కొన్ని చికాకులు ఉంటాయి.

ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం ఉండదు.అయినా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశ పారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము.అందుకని పండితులకు చూపించి లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది.

కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన వాస్తు సూచనలను పాటించి ఇంటికినలు దిశలలో పంచలోహంతో చేయబడిన అత్యంత మహిమాన్వీత మత్స్యయంత్రాలు శాస్త్రోకంగా పూజింపజేసుకుని నలు మూలలో స్థాపించుకుంటే ఆ యంత్ర మహిమ వలన అన్నిదోషాలు తొలగింపబడి ఏ ఇబ్బందీ పడక్కరలేకుండా ప్రశాంతంగా ఉంచుతుంది.

అయితే మన గ్రహదశ బాగా లేనప్పుడు,అలాగే కుటుంబంలో జీవిత భాగస్వామి ,పిల్లల జాతకంలో గ్రహస్థితి బాగలేనప్పుడు వాటికి సంబంధించిన నివారణ తరునోపాయాలను పాటించనప్పుడు ఎంత మంచి ఇంట్లో ఉన్నను మన జాతక దోషాల వల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...అలాంటి సందర్భంలో వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు.
దీని అర్ధం కేవలం మన జాతకం బాగుంటే సరిపోదు మన కుటుంబ సభ్యుల జాతకాలు అనుకూలంగా ఉండాలి.మంచి చేడులో వాటి ప్రభవం కొంత ఎక్కువ తక్కువ స్థాయిలో ఫలిత ప్రభావమ్ మాత్రం తప్పక ఉంటుంది.

చాలా మంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు.అది సరికాదు.అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్తారు.

మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి.ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైనదికాదు.కట్టడానికి ఆస్థలం బలంగా ఉండదు కాబట్టి.చుట్టు ప్రక్కల స్మశానం ఉన్న,మురికి కాలువపైన,చెరువులు పూడ్చి ఇల్లు కట్టిన దోషప్రదమే అవుతుంది.

అలాగే భూమి క్రింది భాగంలో శల్యాలు (ఎముకలు, వెంట్రుకలు, పెంకులు, బొగ్గు ) మొదలగునవి శల్యాలు అంటారు ,దేవాలయాలు దగ్గరగా ఉన్నను, గుడి గోపురం నీడ మీ స్థలంపై పడినను, చుట్టు ప్రక్కల చింతచెట్లు, పాలు కారే చెట్లు, ముండ్లు గల చెట్లు ఉన్నను, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో కూడ ఇల్లు కడితే సుఖంగా ఉండలేరు. అలాగే చుట్టు పక్కలలో స్థలం ఎలా ఉంది,వీధి పోట్లు, ఇరుగూ, పొరుగు వారి ఇండ్ల ఆనుకుని ఉన్న ప్రభావం ఎలా ఉందో కూడా చూసుకోవాలి.

యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు (ప్రధాన ద్వారం) ఎక్కడ ఉండాలి, మొత్తం ఎన్ని గుమ్మాలు ఉండాలి,శుభ స్థాలలో ఎక్కడెక్కడ ఏ దిశలో ఉండాలి,కిటికీలు ఎక్కడ ఉండాలి వగైరాలన్నీ ముందే వాస్తు అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.కొన్ని సందర్భాలలో అన్ని రకాలుగా వాస్తు ఉన్న ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు.

దానికి కారణం ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం ఉంటుందని పెద్దలు ,శాస్త్రాలు చెబుతున్నాయి.జీవ హింస జరిగే ఇంట్లో, తల్లి దండ్రులు, వృధ్ధులు,బాధపడే ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే.అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉండవు.సర్ప,దేవతా,పిత్రు, ఋషి దోశాలు (శాపాలు ) ఉన్న ఇంట, పసి పిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం ఉన్నట్టే.

ఇలాంటివి అన్ని భూమి ఎంచుకునేప్పుడు,ఇల్లు కట్టుకునేప్పుడు మాత్రమే వచ్చిన దోషాలు కావు.కొన్నిదోషాలు మన ప్రవర్తన వలన వచ్చిన దోషాలు కూడ ఉంటాయి.అలాగే కొందరు ఇల్లు కట్టిన తర్వత స్వంత ఆలోచనలతో అదనపు వసతుల కోసమని కొంత భాగం పడగొట్టి,అదనంగా కట్టడం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు.అలా చేయడం వలన కూడా వాస్తు దోషమే అవుతుంది.

భూమిలోను,ఇంట్లోను దోషాలుంటే ఆ ఇంటిని మారిస్తే సరిపోతుంది.మన ప్రవర్తనలో దోషం ఉంటే మనం ఏ ఇంటికెళ్ళినా ఆ ప్రవర్తన మారకపోతే తిప్పలు తప్పవు.ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లయినా కలసిరాదు.అందుకే ముఖ్యంగా మన ప్రవర్తనని సరి చేసుకోవాలి.అప్పుడు ఏ ఇంట్లోనైనా సంతోషంగా ఉండవచ్చు.ఆనందానికి వాస్తు,జాతకమే కాదు గుణ సంబంధం కూడా ప్రభావం చూపుతుంది.ఇది గ్రహించి వ్యవహరిస్తే అంతా మేలే జరుగుతుంది జైశీమన్నారాయణ.

English summary
There is a problem with these conditions. With these you may face bad effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X