వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జులై 14 నుండి ఆగస్టు11 వరకు ఆషాఢ మాస విశేషాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిస్తే ఏం జరుగుతుంది??

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఆషాఢ మాసంలో విశేషాలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం జులై 14 నుండి ఆగస్టు11 వ తేదీ వరకుపూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా చెప్పబడింది.ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. శూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుకూలం కాని మాసం అని అర్ధం. వర్ష ఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది.ఈ నెలలో చేసే స్నానం,దానం, జప,పారాయణలకు మొదలగు పనులకు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది.

ఆషాఢ మాసంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తి దాయకాలు.
ఆషాఢమాసంలోనే దక్షిణాయణ కాలం ప్రారంభమవుతుంది.కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది.అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అని అంటారు.

This Ashada Masam importance

ఈ అయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాడు.దక్షిణాయనం పితృ దేవతలకు ప్రీతి కరమని శాస్త్రంలో చెప్పబడింది.ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినంగా గురు పూర్ణిమ వస్తుంది,దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.

ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు.

ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది.ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు.ఆ రోజున పగలు,రాత్రి,నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటుంది.

ఆషాఢ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు.

ఈ రోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది.దీనినే శయన ఏకాదశి అని అంటారు.ఆషాఢమాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రాదాయబద్దంగా బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.మహంకాళీ అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం అని పిలుస్తారు (భోజనానికి వికృతి పదమే బోనం) దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాల పండగ అని అంటారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకొంటారు.సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు.అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి.ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి రక్షించేవే.ఈ సమయంలో ప్రకృతిలో జరిగే అనేక మార్పుల వలన ప్రజలు అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలును చేస్తాయి.

ఆషాఢ మాసం అనారోగ్యమాసం అని మనందరికీ తెలుసు.విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాడమాసమే.కాలువలోను,నదులలోను, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు.చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హానిని కలిగిస్తాయి.మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు.

చైత్ర,వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఈ సమయంలో వివాహాది శుభముహూర్తాలు కూడ ఎక్కువగా ఉంటాయి.ఆ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలంలో జరగాల్సిన పనులు జరగవు.వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు .

ప్రస్తుత కాలంలో లాగ కాలువల ద్వారా,పంపులద్వార నీరు లభించేది కాదు. పోలాలలో సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా ఆధాయం లేక దారిద్ర్యంతో బాధ పడవలసి వచ్చేది.అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి.అల్లుడుగారు అత్తవారింటికి వెళ్ళ కూడదు అనే నియమం పెద్దలు విధించారు .ఇంటి మీది ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమాన్ని పెట్టారు.అంతే కాకుండ ఆషాడం అనారోగ్య మాసం .కొత్త నీరు త్రాగడం మూలానా చలి జ్వరాలు, విరోచనాలు,తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం.

స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూలమైన మాసం కాదు,అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది.ఇలాంటి అనేక కారణాల వలన ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేసారు మన పెద్దలు.

పైగా ఈ మాసంలో స్త్రీ గర్భం ధరిస్తే ప్రసవ సమయానికి మంచి ఎండాకాలం అవుతుంది.అది తల్లి,పిల్లకు ఎండ తీవ్రత మంచిది కాదు. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి ముందు చూపుతో కొన్ని కట్టుబాట్లు,నియమాలు ఏర్పాటు చేసారు.

ముఖ్యంగా ఈ మాసంలో నుండే చాతుర్మాస దీక్షలు,వ్రతాలు ప్రారంభం అవుతాయి. ఈ నాలుగు నెలలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనిషి శరీరంలో ఉన్న సప్తధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు కావున దాంపత్య జీవితానికి దూరంగా ఉండమని సూచించారు. అందుకే దీక్షలు ఏర్పాటు చేసారు.ఈ కాలంలో వర్షాల వలన ప్రకృతిలో మార్పు సంభవిస్తుంది. అంటే గతంలో ఎండాకాలంలో తీవ్రమైన ఎండలతో భూమి తాపానికి గురై ఉంటుంది.ఈ వర్షపు నీరుతో కూరగాయలు,ఆకుకూరలు ఎక్కువగా పండుతాయి.

వర్షపు నీళ్ళు భూమిలోని ఇనికి భూమిలో ఉన్న ఉష్ణం అంతా పైకి రావడం మూలానా ఆ ఉష్ణతో పెరిగిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి కూరగాయలు తినకూడదు అని నియమం పెట్టారు.చాతుర్మాసం రెండవ నెల శ్రావణ మాసంలో పెరుగు తినకూడదు.మూడవ నెల భాద్రపద మాసంలో పాలను త్రాగకూడదు.చివరి నాల్గవ నెల ఆశ్వీయుజ మాసంలో కంది,పెసర,శనగ మొదలగు పప్పు ధాన్యాలు తినవద్దు అని పెద్ధలు మన భవిశ్యత్తును దృష్టిలో పెట్టుకుని సూచనలు చేసారు.

ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చాలా వరకు వనభోజనాలకు వెళ్ళడం జరుగుతుంది.అక్కడ క్రిమి,కీటకాలతో జాగ్రత్తలు వహించాలి.ప్లాస్టీక్ విస్తరీ ఆకులో భోజనం చేయకుండ పద్దతిగా మన పూర్వీకులు సూచించినట్లు మోదుగ ఆకులతో కుట్టిన విస్తరి ఆకులు కాని లేదా అరటి ఆకులలో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.నీళ్ళు కూడా ప్లాస్టిక్ గ్లాస్ లలో త్రాగకూడదు. అసలు మన దైనందిన దిన చర్యలలో ప్లాస్టిక్ ను దేనికోరకైన వాడకూదదు.ప్లాస్టిక్ వలన మనకు పెను ప్రమాదం ఉంది కనుక మనమే జాగ్రత్త పడి ఇటు ఆరోగ్యాన్ని,అటు పర్యవరనాన్ని కాపాడుకోవాలి.

ఈ కాలంలో మన ఇల్లు,పరిసర ప్రాంతాలు,పశువుల పాకలను,శుభ్రంగా ఉంచుకోవాలి.పనికి రాని చెత్తను,చెట్లను తీసివేయాలి. తినే ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న తర్వతనే తినాలి.చేతి గోళ్ళని వారనికి ఒక సారి తప్పక తీసుకోవాలి.దోమల నివారణ కొరకు ఇంట్లో,పరిసర ప్రాంతాలలో మురుగు నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కనీసం వారనికి మూడు సార్లు అయిన ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి వాటిపై దూపం,లోభాన్,మైసాక్షి లాంటి దూపాన్ని ఇంట్లో వేస్తే దోమలు,క్రిమి కీటకాలు నివారింపబడుతాయి.తో పాటు ఇంట్లో మంచి దైవశక్తి ప్రసరిస్తుంది.

ఈ కాలంలో మనం నివసించే ప్రాంతంలో కాని మన ఊరిలో ఎక్కడ కాళీ స్థలం ఉన్న అక్కడ వేప,జామ,మామిడి మొదలగు మనకు మేలుచేసే,ఉపయోగపడే చెట్లను నాటడం వలన భవిష్యత్తులో మనకు, మన పిల్లలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఎండాకాలంలో నీడనిస్తాయి,వర్షకాలంలో మంచి వర్షలు పడుటకు సహకరిస్తాయి.అన్నింటి కంటే ముఖ్యంగా ప్రతి రోజు మనకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యానిచ్చే ప్రాణ వాయువు ( ఆక్సిజన్ ) అందిస్తాయి.

ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ ఆషాఢ మాసాన్ని సూక్షమంగా ఆలోచిస్తే మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ( ధర్మో రక్షతి రక్షిత: - వృక్షో రక్షిత రక్షిత: ) అనే విషయాలను గుర్తు చేసుకోవాలి.మనం ధర్మాన్ని,వృక్షాలను,పెద్ధల సూచనలను గౌరవిస్తే మంచి జరుగుతుంది.మనం మన కొరకు మన భవిష్యత్తు కొరకు కొంత సహనం,శాస్త్రం,పెద్దలు చెప్పిన విషయాలను పాటిస్తే మనకే మేలు జరుగుతుంది.లేదంటే తత్ ఫలితం అనుభవించ వలసి వస్తుంది.ఎంత చేసుకున్నోడికి అంత అనే సామేత జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

ఒక సారి విజ్ఞతతో ఆలోచిస్తే అంతా అర్ధం అవుతుంది.పూర్వకాలంలో మన తాతలు,తండ్రులు పెద్దగా చదువుకోక పోయిన శాస్త్ర సూచనలు పాటించి సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా బలంగా ఎక్కువ కాలం జీవించారు.ప్రస్తుత కాలంలో మనం విదేశి సాంప్రదాయలకు ప్రాధాన్యతను ఇచ్చి కట్టు,బొట్టు,కుటుంబ ఆత్మీయత,ఆహర వ్యవహారాలను మరచి అనాగరికులలాగా అగాధంలో పడి అయోమయం అవుతున్నం చిన్న వయస్సులోనే ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నాం.మనం మారుదాం పూర్వీకులైన పెద్దలు చెప్పిన సూచనలు పాటించి సంపూర్ణ ఆరోగ్యంతో స్వచ్చ భారత్ లో జీవిద్దాం.

ఆషాఢమాసంలో ముఖ్యమైన రోజులు:-

01-07-2018 - సంకష్టహర చతుర్థి.

09-07-2018 - సర్వేషాం ఏకాదశి.

11-07-2018 - మాసశివరాత్రి

13-07-2018 - వటసావిత్రి వ్రతం(కొందరికి).

ఆషాఢమాసం:-

14-07-2018 - చంద్రోదయం, పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర.

16-07-2018 - దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటక సంక్రాంతి.

17-07-2018 - స్కందపంచమి,

18-07-2018 - కుమార షష్టి

23-07-2018 - శయనే ( తొలి ) ఏకాదశి.

24-07-2018 - చతుర్మాస్య వ్రతారాంభం.

27-07-2018 - గురు పూర్ణిమ,వ్యాస పూర్ణిమ.

29-07-2018 - సికింద్రాబాద్ మహంకాళీ జాతర.

31-07-2018 - సంకష్ట హరచతుర్థి.

English summary
Now, according to Hindu beliefs, ashada masam is the inauspicious month, as all the holy works like marriage, entering into a new house (gruhapravesh), wearing sacred thread (upanayanam), etc. are not allowed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X