వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో ఏడుకొండల చరిత్ర.. వాటి వెనుక పరమార్థం మీకు తెలుసా?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనలోని ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన ఏడు కొండలు పైన ఉంటాడు. ఈ ఏడు కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది.

1. వృషభాద్రి 2. వృషాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి. 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

Tirumala Yedukondalu: Significance and history of the Seven Hills

ఆ ఏడు కొండలు సాలగ్రామాలే. ఆ ఏడు కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండి విముక్తులు కాగలరు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు :- వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి నాలుగు కొమ్ములుంటాయి. మూడు పాదాలు ( భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు )
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం :- ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి :- ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు. భగవ : ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు. అన్ : ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి :- అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు.

5. శేషాద్రి :- ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు "తుల్య నిందా స్తుతిర్ మౌని" (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి :- వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి :- అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటాచల తిరుమల శ్రీనివాసున్నీ మనసారా కొలవడం అంటే నభూతో నభవిష్యత్.

English summary
Tirumala is located 3,200 feet above sea level and covers an area of approximately 26.8 km. Surrounding the hills are seven peaks of Seshachalam range, Eastern Ghats namely Seshadri, Neeladri, Garudadri, Anjanadri, Vrushabadri, Narayanadri and Venkatadri. The temple of Sri Venkateswara is on the seventh peak Venkatadri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X