• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శని మకరంలోకి ప్రయాణం కొన్ని రాశులకు ప్రతికూలం

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శని భగవానుడు ఎవరి జాతకంలో అనుకూలంగా ఉండదో అట్టి వ్యక్తులకు కుటుంబ, ఆరోగ్య, ఆర్ధిక, వ్యవహార, పోలిస్ కేసులు, అందరితో వైరం, నీలాపనిందలు రావడం, ఏది చేసిన కలిసి రాక పోవడం, అందరితో మాట పడాల్సిన స్థితి రావడం, ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం మీద వైరాగ్యం రావడం, బతుకు భారంగా నడవడం కనిపిస్తుంది. శని గ్రహం సెప్టెంబరు 29 నుండి మకర రాశిలో నేరుగా కదలనున్నాడు. ఈ ఏడాది మే 11న ఆ రాశిలో తిరోగమించాడు. ఇప్పుడు ప్రత్యక్ష కదలిక వల్ల కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

Traveling to Saturn Capricorn is unfavorable for some constellations

నవగ్రహాల్లో అన్నింటికంటే క్రూరమైన గ్రహాలుగా రాహువు, కేతువులను పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో స్వభావారీత్యా న్యాయాన్ని సూచించే శని చేరాడు. శని సెప్టెంబరు 29 నుండి తన సొంత రాశి చక్రమైన మకరంలో ప్రత్యక్షంగా కదలనున్నాడు. ఇంతకు ముందు ఈ ఏడాది మే 11న శని తన సొంత రాశిచక్రంలో తిరోగమించాడు. ఇప్పుడు మళ్లీ సరళమైన వేగంతో ప్రయాణించనున్నాడు. శని కదలిక వల్ల కొన్ని రాశులకు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మరి ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉండనుందో మనం ఇప్పుడు గమనిద్దాం.

​మిథునరాశి ( లగ్నాల ) వారికి :- శని ప్రత్యక్ష కదలిక మిథునరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారవాణిజ్యాల్లో చాలా హెచ్చుతగ్గులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే శని ఈ రాశిలో ప్రయాణించాడు. ఫలితంగా మీరు వృధా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని నివారించండి. ఇదే సమయంలో ఇంట్లో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో నష్టాల్లుటాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కొరవడుతుంంది.

​సింహరాశి ( లగ్నాల ) వారికి :- శని గ్రహం నేరుగా కదలడం వల్ల సింహ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఫలితంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థికాంశాల్లో హెచ్చతగ్గులుంటాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. వాతావరణ మార్పు వల్ల జలుబు, జ్వరం లాంటివి ఇబ్బంది పెడతాయి.

​తులరాశి ( లగ్నాల ) వారికి :- శని కదలిగా ద్వారా తులరాశి వారి వైవాహిక జీవితంలోనూ పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో మనస్పర్థలు కలుగుతాయి. వీలైనంత వరకు వివవాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. జీవితంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఇంట్లో విభిన్న రకాల సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఇంట్లో దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

​ధనస్సురాశి ( లగ్నాల ) వారికి :- శని ప్రభావం వల్ల ధనస్సు రాశి వారికి సంతానానికి సంబంధించి ఏ వార్త విన్నా మానిసికంగా నిరాశకు లోనవుతారు. డిపాజిట్లు కోల్పోవడం వల్ల మీ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా భౌతిక ఆనందం కోసం సమయాన్ని వెచ్చిస్తారు. ఈ కారణంగా ఇంట్లో డబ్బు విషయంలో ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచించినట్లయితే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

​కుంభరాశి ( లగ్నాల ) వారికి :- శని ప్రత్యక్ష గమనం వలన ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. వైవాహిక జీవితంలో ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే సమయంలో మీ ఆరోగ్యం కూడా ప్రభావితమై కంటికి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇంటి నిర్మాణం, రీపేర్లకు సంబంధించిన కొన్ని ఖర్చులు చేస్తారు. మీరు తదనగుణంగా ఖర్చు చేయాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.

తరునోపాయలు:- రావి చెట్టునకు "11" ప్రదక్షిణలు "ఓం నమో భగవతే వాసుదేవాయ " నాయి స్మరించు కుంటూ నిధానంగా ప్రదక్షిణలు చేయాలి. తలి దండ్రుల సేవలు చేయాలి. గోమాతకు తోచిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు. పేద వారికి అన్నం దానం చేయండి, బట్టలు ఇప్పించండి. సాధ్యమైనంత వరకు అన్ని వ్య్వహాలలో మౌనం పాటించండి. మధ్య వర్తిత్వాలు, జమానత్తు సంతాకాలు చేయకూడదు. వృక్షాలకు, పశు పక్ష్యాదులకు సేవ చేయండి. రోజు యోగ, ధ్యానం చేయండి. మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇతర గ్రహ ప్రభావం మీపై ఎంత ఉందో తెలుసుకుని తగు రేమిడిస్ ఫాలో అవ్వండి.

English summary
Traveling to Saturn Capricorn is unfavorable for some constellations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X