వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ వికారి నామ సంవత్సరం ఎవరి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతోంది ..? రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఉగాది .. తెలుగు నూతన సంవత్సరాది. తెలుగు క్యాలెండర్ ప్రకారం 2019-20 వికారినామ సంవత్సరం. ఈ ఏడాది ఆయా జాతక ప్రకారం ఏలా ఉంది ? రాజ్యపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉన్నాయి. ఆదాయ, వ్యయాలు ఏలా ఉన్నాయో ఉగాది పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ ఎంఎన్ చార్య వన్ ఇండియా వీక్షకుల కోసం వెల్లడించారు. ఈ ఏడాది మీకు ఏ విధంగా ఉందో రాశులవారీగా చదివి తెలుసుకోగలరని సూచన.

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు.

 2019-20 శ్రీ వికారి నామ సంవత్సర ఆదాయ వ్యయ రాజ పూజ్య అవమాన ఫలాలు 2019-20 శ్రీ వికారి నామ సంవత్సర ఆదాయ వ్యయ రాజ పూజ్య అవమాన ఫలాలు

 మొదట మేష రాశితో పంచాంగ ప్రారంభిద్దాం ..

మొదట మేష రాశితో పంచాంగ ప్రారంభిద్దాం ..

మేషం :- (అశ్విని, భరణి, కృత్తిక 1పా) :-
ఆదాయం -14 వ్యయం -14.
రాజపూజ్యం -3 అవమానం - 6.

మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు గోచారరీత్యా నవంబర్‌ 4 వరకు అష్టమంలోను తరువాత సంవత్సరాంతం వరకు నవమంలో సంచరిస్తాడు. అష్టమంలో సంచరించడం వల్ల గౌరవలోపాలకు అవకాశం ఉంటుంది. చేసే అన్ని పనుల్లో పూర్వపుణ్య ఫలం ఎక్కువగా ఖర్చుఅవుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. సత్కర్మల కోసం ఖర్చుచేయడం మంచిది. సంవత్సరాంతం నుండి గురువు నవమ సంచారం వలన ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

పరిశోధకులు తమ పరిశోధనలను కొనసాగిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక తీర్ధ యాత్రలు, దూర ప్రయాణాలు చేస్తారు. 2020 జనవరి 24 వరకు శని నవమ సంచారం వల్ల కార్యనిర్వహణలో లోపాలు ఏర్పడతాయి.పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అంత తొందరగా లభించకపోవచ్చు. 24 జనవరి 2020 తర్వాత సొంత రాశి అయిన దశమంలో సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.

వ్యాపారస్తులకు ధనలాభం ఉంటుంది. చేసే పనుల్లో కొంత నిదానత ఉంటుంది. రాహువు తృతీయ సంచారం వలన సహకార లోపాలు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌ అంత అనుకూలించవు. దగ్గరి ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. నవమంలో కేతు సంచారం ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడుతుంది. సంతృప్తి లోపాలకు అవకాశం. అనుకున్నంత తొందరగా పనులు పూర్తిచేయలేరు.

ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందున వీరు మంచి పనులకై ఖర్చులు చేయడం మంచిది. దాచుకోవాలని చూస్తే ధనం నిల్వ ఉండదు. ఈ సంవత్సరం అంతా దైవ, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకై ఖర్చులు చేయడం మంచిది. వ్యవసాయ దారులకు రెండు పంటలు అనుకూలంగా లాభాలనిస్తాయి. అవివాహితులకు వివాహ ప్రాప్తి. ఉద్యోగులకు పై అధికారులతో సన్మానాలు పొందుతారు.

న్యాయవాదులకు, వైద్యులకు, నటులకు, గాయకులకు, సినిమా రంగంవారికి, మత్స్య , యంత్ర , పాడి పరిశ్రమ వారికి , క్రీడా రంగం ,రాజకీయ రంగం వారికి అఖండ గౌరవం, వ్యవహార జయం కలుగుతుంది.

మరిన్ని శుభాలకోరకు నాగుపాము పుట్టకు కోడిగుడ్డు సమర్పించి పూజించాలి. పేద వారికి అన్న,వస్త్ర దానాలు చేయాలి. పశు ,పక్ష్యాదులకు ధాన్యపు గింజలు ,త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు చవి చూస్తారు.

** ఇవి మేష రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

 మిధునరాశి వారి ఫలాలు

మిధునరాశి వారి ఫలాలు

మిథునరాశి:- (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు1,2,3 పా)
ఆదాయం -11 వ్యయం - 5 .
రాజపూజ్యం - 2 అవమానం - 2.

ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా నవంబర్‌ 2019 వరకు షష్ఠంలోను నవంబర్‌ తర్వాత సప్తమంలో సంచారం ఉంటుంది. గురువు షష్ఠసంచారం వలన పోటీ ల్లో గెలుపుకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. తన కంటే పెద్దవారితో ఉన్నతులతో పోటీ లు ఎక్కువగా ఉంటాయి. దాని వలన మనస్పర్థలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాలు పూర్తిచేసుకుటాంరు.

తదనంతరం సప్తమ సంచారం వలన సామాజిక అనుంబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో తొందరపడకూడదు. శని 2020 జనవరి 24 వరకు ధనుస్సులోను తరువాత తన స్వక్షేత్రమైన మకరంలో సంచరిస్తాడు. శని సప్తమ సంచారం అనాలోచిత పనులు చేస్తారు.

పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక అనుబంధాలు అంతగా విస్తరించవు. వ్యాపారస్తులు జాగరూకులై ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మోసపోయే అవకాశాలుంటాయి. స్నేహ సంబంధాలు అంత ఎక్కువగా పెంచుకోకూడదు. భాగస్వాములతో ఒత్తిడులు తప్పవు.

రాహువు మిథునంలో కేతువు ధనుస్సులో సంచారం వలన అన్నీ తమకే కావాలనే ఆశ పెరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. సమయం, కాలం, ధనం అన్నీ వృథా అవుతాయి. కేతువు వల్ల సామాజిక అనుబంధాల్లో విభేదాలు ఏర్పడే అవకాశం కనబడతుంది. పెట్టుబడులు విస్తరణ తగ్గుతుంది. వీరు దుర్గాస్తోత్ర పారాయణ, శ్రీరామజయరామ జయజయ రామరామ జపం మంచిది.

** ఇవి మిథున రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

సింహరాశి వారి ఫలాలు

సింహరాశి వారి ఫలాలు

సింహరాశి:-(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఆదాయం - 8 వ్యయం - 14.
రాజపూజ్యం - 1 అవమానం - 5.

ఈ రాశివారికి ఈ సంవత్సరం నవంబర్‌ 4 వరకు గురువు చతుర్థంలో సంవత్సరాంతం తరువాత గురువు పంచమంలో సంచారం ఉంటుంది. గురువు చతుర్థ సంచారం వలన వీరికి సౌకర్యాలు ఒత్తిడితో పూర్తి చేసుకుంటారు. చీటీలు, ఫైనాన్స్ లావాదేవిలకు సంబధించి దూరంగా ఉండండి. సౌకర్యాలను పెంచుకోవడం కోసం కొంత అవమానాలను భరిస్తారు.

నూతన భూ,గృహ లాభముల వలన ధనవ్యయం కలుగును. విందు వినోదాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. తీర్ధ యాత్రలకై ఖర్చు పెడతారు. సంవత్సరాంతంలో గురువు పంచమంలో సంచరించడం వలన సంతాన సంబంధ ఆలోచనల్లో ఆనుకూలత ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది.పెట్టే ఖర్చులు వృథా కాకుండా చూసుకుటాంరు. సంతృప్తి లభిస్తుంది.

శని 2020 జనవరి వరకు పంచమంలో సంచారం వలన సృజనాత్మకత తగ్గుతుంది. శ్రమకు ఓర్చక కూర్చుండి చేసే పనులవైపు ఆలోచన పెరుగుతుంది. ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. షష్ఠసంచారంలో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వ్యవసాయ దారులకు రెండు పంటలు కల్సి వస్తాయి.సేవకజన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి.

రాహువు లాభంలో సంచారం వలన అత్యాశ ఎక్కువ అవుతుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. రాజకీయ నాయకులకు అనుకూలకాలం. విదేశీ వ్యవహారాలు చక్కబడతాయి.పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కేతువు పంచమ సంచారం వలన అనాలోచిత ఖర్చులు చేస్తారు. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.

ఏదైనా పని చేసేముందు మీ శ్రేయోభిలాషుల సలహా అడిగి పనులు ప్రారంభించడం మంచిది. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నందున దాచుకోవాలనే ఆలోచన ఏరకంగా రాదు. దాచుకున్నవి కూడా తీసి దానం చేస్తారు. లేకపోతే గౌరవం తగ్గి పోతుందని ఫీల్ అవుతారు, అవివాహితులకు వివాహ యోగ్యం ఉంది. ఈ సంవత్సరం స్వగృహ కళ,వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. ఉద్యోగ విజయం కనబడుతుంది.

సుబ్రహ్మణ్య స్వామి పూజ లేదా పాము పుట్ట పూజ చేయండి , కిలోపావు ఉలవలను నానబెట్టి వాటికీ బెల్లం పట్టించి పావురాలకు కాని ఆవునకు గాని పెట్టండి శుభం కలుగుతుంది.

** ఇవి సింహ రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

తులారాశి వారి ఫలాలు

తులారాశి వారి ఫలాలు

తులరాశి:- (చిత్త 3,4 పా. స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఆదాయం - 8 వ్యయం - 8.
రాజపూజ్యం - 7, అవమానం - 1.

ఈ రాశివారికి గురువు సంవత్సరాంతం వరకు ద్వితీయంలో సంచారం ఉంటుంది. వాక్‌ పటిమ పెరుగుతుంది. కుటుంబంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ధనాన్నినిల్వ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. గౌరవాదులు వృద్ధి చెందుతాయి. సంవత్సరాంతం తరువాత తృతీయ సంచారం వలన తమకంటే ఉన్నతులతో స్నేహానుబంధాలు పెంచుకుంటారు.

వివాహం కావలసిన వారికి నవంబర్ వరకు మంచి అనుకులతలున్నాయి. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సినిమా ,రాజకీయ రంగాల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. శని 24 జనవరి 2020 వరకు తృతీయంలో సంచారం ఉంటుంది. సేవకజన సహకారం పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. విద్యార్ధులకు సామాన్య ఫలములు ఎక్కువ శ్రమ పడాలి. సంతానం విషయంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. జనవరి 2020 తర్వాత చతుర్థ సంచారం ఉంటుంది. పోటీలలో విజయం కొరకు ప్రయత్నిస్తారు.

శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఏ పనుల్లోనైనా ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొంత పనుల్లో ఆలస్యం అవుతుంది. పనులను వాయిదా చేయరాదు. రాహువు నవమ సంచారం వలన దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు శ్రమతో ఫలితాలు సాధిస్తారు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఎదుటివారిపై విజయం సాధించడానికి చాలా కష్టపడతారు.

అన్ని రంగాల వారికి 24 జనవరి 2020 నెలాఖరు నుండి సౌఖ్య లోపం, మాతృవర్గ ఇబ్బందులు, వాహన నష్టములు, భూవివాదములు ఏర్పడతాయి. నిరుత్సాహం కనబడుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం వలన మేలు కలుగుతుంది. మంగళవారం పేదలకు సంతృప్తి పరిచేలాగా కమ్మని భోజనం పెట్టించండి. పావురాలకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి.


** ఇవి తుల రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

ధనుస్సురాశి వారి ఫలాలు

ధనుస్సురాశి వారి ఫలాలు

ధనస్సురాశి:- (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం)
ఆదాయం - 2 వ్యయం- 8 .
రాజపూజ్యం - 6 అవమానం - 1.

ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మము నందు కేతువు, సప్తమము నందు రాహువు, 2020 ఫిబ్రవరి వరకు జన్మము నందు శని, ఆ తదుపరి ద్వితీయము నందు, నవంబర్ 4వ తేదీ వరకు వ్యయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమము నందు సంచరిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారి గోచారం పరిశీలించగా 'కీర్తిః త్యాగాను సారిణీ' అన్నట్లుగా ఇతరుల కోసం ధనం అధికంగా వెచ్చించడం మంచిది కాదని గమనించండి.

కుటుంబ విషయాల్లో ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. కుటుంబంలో పరస్పరం వాదులాటలు, అనుమానించుకోవడం, మానసిక అశాంత వంటివి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా అనుకూల పరిస్థితి తక్కువగా ఉన్నందున ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించడం, సామరస్యంగా మెలగడం, ప్రతి విషయంలో ఏకాగ్రతగా మెలగడం వంటివి ఈ రాశివారికి చెప్పదగిన సూచన.

ఆదాయం తక్కువగా ఉండడం అలానే ఖర్చులు అధికం. పాత ఋణాల వలన ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశివారికి గురువు, శని, రాహువులు అనుకూలంగా లేని కారణంగా అన్ని విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొనే ఆస్కారం ఉంది. ఉద్యోగ విషయాల్లో అధిక శ్రమ పొందినప్పటికి గుర్తింపు, గౌరవం వంటివి ఉండవు.

అధికారుల నుండి ఇబ్బందులు ఎదురైనప్పటికి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. తోటివారితో సంయమనంగా మెలగడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు విరమించడం మంచిది. అనుకున్న రీతిగా లాభాలు రావనే చెప్పాలి. ఆరోగ్య విషయముల యందు జాగ్రత్త అవసరం. శని రాహువుల ప్రభావం చేత నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కునే ఆస్కారం ఉంది.

విద్యార్థులు విద్యావిషయాల పట్ల అధిక కృషి చేసినప్పటికి ఒక మోస్తరు ఫలితాలను మాత్రమే అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలుకై చేయు యత్నాలు వృధా ప్రయాసగా మిగిలిపోతాయి. సినీ, కళా రంగాల్లో వారికి అధిక శ్రమానంతరం సత్ఫలితాలు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యర్థుల నుండి ఆపదలు తలెత్తే ఆస్కారం ఉంది. ఇతరులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. రైతులు విత్తనాల విషయంలో కానీ, నకిలీ వస్తువుల విషయంలో కానీ జాగ్రత్త వహించాలి.

ముఖ్యుల మాట తీరు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వెనక్కి ముందుకు అన్నట్టు ఉంటాయి. కానీ ఏ మాత్రం పురోగతి కనిపించదు. నిరుద్యోగులు అతి కష్టం మీద చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించగలుగుతారు. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ప్రతి పని శ్రమతో కూడుకుని ఉంటాయి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్త అవసరం. శరీరం అలసటకు గురవడం, ఆందోళన, భయం వంటివి ఉండగలవు. బంధువులతో, స్నేహితులతో వ్యవహరించడం, ప్రతి పనిని స్వయంగా చేసుకుని ముందుకు సాగడం, ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది.

ఈ రాశివారికి ఏలినాటి శనిదోషం ఉన్నందువలన ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి, 11 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించిన శుభం కలుగుతుంది.లలితా సహస్రనామం చదవడం వలన లేక వినడం వలన కుబేరుని ఆరాధించడం వలన సర్వదా జయం చేకూరుతుంది. కాకులకు నువ్వులు, బెల్లం వేసి చేసిన రొట్టె ముక్కలు వేయండి, పావురాలకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి.

** ఇవి ధనస్సు రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

కుంభరాశి వారి ఫలాలు

కుంభరాశి వారి ఫలాలు

కుంభరాశి:- (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
ఆదాయం - 2 వ్యయం - 2 .
రాజపూజ్యం - 5.అవమానం - 4.

ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా పంచమము నందు రాహువు, లాభము నందు కేతుపు 2020 ఫిబ్రవరి వరకు లాభము నందు శని ఆ తదుపరి అంతా వ్యయము నందు, నవంబర్ 4వ తేదీ వరకు రాజ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా లాభము నందు సంచరిస్తారు. ఈ రాశివారి గ్రహ సంచారం పరిశీలించగా 'ఆత్మబుద్ధి సుఖంచైవ' అన్నట్లుగా మీకు తోచిన విధంగా చేయడం వలన గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందు వలన మీకు అన్నివిధాలా పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో అందరి సహకారం, అనుకూలం మీకు ఉంటుంది.

కుటుంబ సభ్యులు అందరూ అన్ని విషయాల్లో ప్రోత్సాహంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం కూడా మీకు పుష్కలంగా ఉండడం వలన మీ సమస్యలు సులువుగా సానుకూలంగానే ఉంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. సంతాన విషయంలో వారి అభివృద్ధి రీత్యా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ విషయముల యందు జాగ్రత్త అవసరం. అధికారులు, తోటివారి నుండి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం పొందుతారు. స్థానచలన యత్నాలు, ప్రమోషన్ వంటి శుభశూచికలున్నాయి. వృత్తి, వ్యాపార విషయాల్లో నూతన పథకాలు వేసి జయం పొందండి.

మీరు అనుకున్న ప్రణాళికలు అమలుచేయగలుగుతారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఇతరులు కూడా వ్యాపారాభి వృద్ధికి మీకు మంచి సలహా, సహకారం అందిస్తారు. విద్యార్థులకు గురుబలం, శనిసంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం సత్ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. నిరుద్యోగుల నూతన యత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ సంవత్సరం నవంబరు నుండి కాలం అనుకూలంగా ఉన్న దృష్ట్యా స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి చేసే ఆలోచనలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు మొదట్లో కొంత ఇబ్బంది కరంగా ఉన్నప్పటికి చివరికి అనకూల ఫలితాలే పొందగలవు.

సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారస్తులు దళారీల నుండి ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదుర్కొనవలసి వస్తుంది. రైతులు శ్రమ చేసిన కొద్దీ వారికి తగిన ప్రతిఫలం లభిస్తాయి. శని లాభంలో సంచరిస్తూ ఉండడం వలన మీకు మానసిక ఆరోగ్యం, ధనం, అభివృద్ధి అన్ని చేకూరుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. కళా, క్రీడా రంగాల్లో వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఈ నవంబరుకు గురువు లాభంలోకి వచ్చిన తరువాత అన్ని విషయాల్లో అనుకూల స్థితి పెరుగుతుంది. విలువైన వస్తువులు అమర్చుకోగలుగుతారు.

అన్నిరకాల భయాందోళనలకు దూరమవుతారు. అన్నింటా విజయం కలుగుతుంది. అవివాహితులకు వివాహాయోగం. తీర్థయాత్రలు, ప్రయాణాలు సాగిస్తారు. 2020 జనవరిలో ఏలినాటి శని ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఈ సంవత్సరం ప్రతి అంశంలోనూ ఎక్కువ శ్రమచేసి, కార్యనుకూలం కోసం, సమస్యల పరిష్కార కోసం అధిక శ్రమచేస్తారు. విదేశీయాన యత్నాలు కొంతవరకు సఫలం అవుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి పనిభారం ఒత్తిడి అధికంగా ఉంటుంది. విష్ణు సహస్ర నామాలను చదువు కోవాలి. గోమాత సేవ ,పశు పక్షుల సేవా కార్యక్రమాలతో విజయం లభిస్తుంది.

** ఇవి కుంభ రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

 వృషభరాశి వారి ఫలాలు

వృషభరాశి వారి ఫలాలు

వృషభరాశి :- (కృత్తిక 2,3,4 పా. రోహిణి, మృగశిర 1,2 పాదాలు )
ఆదాయం - 8 వ్యయం - 8 .
రాజపూజ్యం - 6 అవమానం - 6.

ఈ రాశివారికి గురువు గోచార రీత్యా నవంబర్‌ 4 వరకు సప్తమంలోను సంవత్సరాంతంలో అష్టమ సంచారం చేస్తాడు. ప్రేమ వివాహాలు కలిసిరావు. సామాజిక అనుబంధాలు పెంచుకోవాలనే ప్రయత్నం అధికంగా చేస్తారు. తమకన్న పై స్థాయి వారిని పరిచయాలు పెంచుకుంటారు.పెట్టుబడులు విస్తరించే ప్రయత్నం చేస్తారు. తమ స్టేటస్‌ను పెంచుకునే ప్రయత్నంలో అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు.

ఏ రంగం వారైన ఈ సంవత్సరం కొంత ఎక్కువ జాగ్రత్తతో ఉండడం శ్రేయస్కరం. సామాజిక అనుబంధాలు, వివాహ అనుబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. భాగస్వాములతో జాగ్రత్తగా కలిసిమెలిసి ఉండేలా వ్యవహరించాలి. నవంబర్‌ తర్వాత అష్టమ సంచారం కూడా అంత మంచిది కాదు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి.సెల్ఫ్ డ్రైవింగ్ లో ఎక్కువ జాగ్రత్తలు అవసరం, ప్రయాణాలలో కుడా జాగ్రత్త వహించాలి. శని అష్టమ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి .

రాజకీయ రంగం వారికి విజయం చేకురుతుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తతో ఉండడం మంచిది. జనవరి 2020 తర్వాత శని నవమ సంచారం వలన ఆధ్యాత్మిక ప్రగతి కొంత పెరుగుతుంది. తీర్ధ యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఏ పని చేసిన అధిక శ్రమానంతరం సంతృప్తి లభిస్తుంది. రాహువు ద్వితీయ సంచారం వలన ఇతరులతో మాట్లాడేప్పుడు మాట తీరులో జాగ్రత్తగా పడాలి. తొందరపడి మ్లాడకూడదు. మీ ప్రవర్తనతో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కొంత కాలం విభేదాలు ఇబ్బంది పెడతాయి .స్థాన చలనములు, అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. కేతువు అష్టమ సంచారం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు. నిరాశ, నిస్పృహలు అధికంగా ఉంటాయి. పరామర్శలు చేస్తారు. హాస్పిటల్స్‌ కోసం ఖర్చులు చేస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందున వీరు మంచిపనులకై ఖర్చులు చేయడం మంచిది. గృహ శాంతి కాపాడుటకోరకు ఇష్టం లేకపోయినా జీవితంలో నటిస్తారు. గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు.

సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయండి. నాగుపాము పుట్టకు కోడిగుడ్డు పెట్టి పూజ చేసి ప్రదక్షిణాలు చేయాలి. పశువులకు పక్షులకు ధాన్యపు గింజలను, త్రాగడానికి నీళ్ళ వసతి ఏర్పాటు చేయండి.పేదవారికి, అవిటి వారికి అన్నదానం చేయండి శుభం కలుగుతుంది


** ఇవి వృషభ రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

కర్కాటకరాశి వారి ఫలాలు

కర్కాటకరాశి వారి ఫలాలు

కర్కాటకరాశి:- (పునర్వసు 4 పా. పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం - 5 వ్యయం - 5.
రాజపూజ్యం - 5 అవమానం - 2.

ఈ రాశివారికి నవంబర్ 4 వరకు గురువు పంచమంలోను తరువాత సంవత్సరాంతంలో గురువు షష్ఠంలో సంచారం ఉంటుంది. వీరికి సంతానం విషయంలో సంతోషం కలుగుతుంది. ఆలోచనలు అనుకూలిస్తాయి. చేసే పనుల్లో ఉత్సాహం, సృజనాత్మకతను పెంచుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకుటాంరు. కళాకారులకు అనుకూల సమయం.

విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నవంబర్‌ 4 తరువాత అనవసర ఒత్తిడులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. శారీరక బలం పెరుగుతుంది. పట్టుదలతో పనులు సాధిస్తారు. 2020 జనవరి 24 వరకు శని షష్ఠంలో తరువాత సప్తమంలో సంచారం ఉంటుంది. పోటీలలో విజయం కొరకు ప్రయత్నిస్తారు.

రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదార్ధం దూర ప్రయాణాలు చేస్తారు. రాహువు వ్యయంలోను కేతువు షష్ఠంలో సంచారం.వినోద, విలాసల కోసం అనవసర ఖర్చులు చేస్తారు .నరముల బలహీన ఏర్పడుతుంది. విశ్రాంతికై ప్రయత్నం అధికంగా ఉంటుంది. సమయానికి తగిన విశ్రాంతి లభించదు.

కొంత డబ్బు అధికంగా ఖర్చు విదేశాలకు వెళతారు. షష్ఠంలో కేతువు వలన పోటీ ల్లో శ్రమకు తగిన గుర్తింపు రాదు. నిరాశ, నిస్పృహలు పెరుగుతాయి. జ్యేష్ట సంతానం విషయంలో జాగ్రతలు అవసరం. శారీరక, మానసిక ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. సంతృప్తి లోపిస్తుంది. విద్యార్ధులకు ఎక్కువ కష్టపడాలి. ఉద్యోగులకు స్థాన చలనములు గోచరిస్తున్నాయి. అవకాశం ఉంది కుడా స్వంత వాళ్లకు సహాయ పడలేదని నిదలు మోయాల్సి వస్తుంది.

శుభ ఫలితాల కోపం నవగ్రహా దోష నివారణార్ధం రుద్రా పాశుపత హోమం చేయించుకుంటే మంచిది. కుక్కలకు వారానికి ఒకసారి బెల్లం కలిపిన రొట్టెలను తిని పించండి. గోమాతకు కేజింపావు శనగలు నానబెట్టి అందులో బెల్లం కలిపి విస్తరిలో పెట్టి తినిపించండి. కేజింపావు మినుములకు బెల్లం కలిపి పావురాలకు దానా వేయండి మంచి జరుగుతుంది.


** ఇవి కర్కాటక రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

 కన్యరాశి వారి ఫలాలు

కన్యరాశి వారి ఫలాలు

కన్యరాశి:- (ఉత్తర 2,3,4 పా. హస్త, చిత్త 1,2 పా)
ఆదాయం - 11 వ్యయం - 5.
రాజపూజ్యం - 4 అవమానం - 5.

ఈ రాశివారికి గురువు నవంబర్‌ 2019 వరకు తృతీయంలోను సంవత్సరాంతంలో చతుర్థంలో సంచారం ఉంటుంది. పెద్దవారి సహాయ సహకారాలు అందుకుటాంరు.పెద్దవారితో స్నేహ సంబంధాలు పెంచుకుటాంరు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయస్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. కమ్యూనికేషన్స్‌ కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం.

సంవత్సరాంతంలో చతుర్థ సంచారం వలన అనుకోని ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. విద్యార్థులకు కొంత శ్రమ, ఒత్తిడి ఉంటుంది. శని జనవరి 2020 వరకు చతుర్థంలో ఉంటాడు. చతుర్థ సంచారం వలన కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో జాగ్రత్త అవసరం. ఒత్తిడితో సౌకర్యాలను పూర్తిచేస్తారు. ధనాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తారు.

శని పంచమ సంచారం వలన సంతానం కోసం సమయాన్ని కేటాయిస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉత్సాహాన్నికోల్పోతారు. ఏ పనిచేసినా సొంత ఆలోచనలు చేయకూడదు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. రాహువు దశమంలో సంచారం వలన వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి కనిపిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వం చేయవద్దు ,జమనత్తు సంతకాలు చేయకూడదు.

వ్యవసాయ దారులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. కేతువు చతుర్థ సంచారం విద్యార్థులకు కష్టకాలం అవుతుంది. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు వస్తాయి. గౌరవ నష్టం సూచితమౌతుంది. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. నిందారోపణలు ఉంటాయి జాగ్రత్త, ప్రేమలు,పెళ్ళిళ్ళు వికటిస్తాయి. విష్ణుసహస్రనామ స్త్రోత్రాలు చదువుకోవాలి. రోజు రావిచెట్టుకు నీళ్ళు పోసి 11 ప్రదక్షిణలు నిదానంగా చేయండి.


** ఇవి కన్య రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

 వృశ్చికరాశి వారి ఫలాలు

వృశ్చికరాశి వారి ఫలాలు

వృశ్చికరాశి:- (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం - 14 వ్యయం- 14.
రాజపూజ్యం - 3, అవమానం - 1.

ఈ రాశివారికి నవంబర్‌ వరకు గురువు జన్మరాశిలో సంచరిస్తాడు.గురువు జన్మరాశిలో సంచరించడం వలన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదులు చేసుకునేవారికి ప్రమోషన్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. స్థాన చలనం తప్పనిసరిగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపకల్పన చేసుకుటాంరు.

పట్టుదలతో కార్యసాధన చేస్తారు. నవంబర్‌ 2019 తరువాత ద్వితీయంలో గురు సంచారం వలన రైతులకు రెండు పంటలు లాభసాటిగా ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలతలు కనబడతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. ఇచ్చిన మాటలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.

శని ద్వితీయ సంచారం వలన జనవరి 2020 వరకు మాట విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి మూడు నెలలు మాట విషయంలో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో గౌరవాన్ని తగ్గకుండా చూసుకోవాలి. వచ్చే సంవత్సరంలో తృతీయ సంచారం వలన సేవక జనసహకారం బాగా లభిస్తుంది. కావలసిన పనులు పూర్తిచేసుకుంటారు. చిన్న చిన్న యాత్రలు పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి.

రాహువు అష్టమ సంచారం వలన ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్స్‌ సందర్శనం అధికంగా ఉంటుంది. శ్రమలేని ఆదాయంపై ఆలోచనలు ఉంటాయి. అనవసర ఖర్చులు అధికంగా చేస్తారు. కేతువు ద్వితీయ సంచారం వలన మాటల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయి. మాటల వల్ల కుటుంబ సంబంధాలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించాలి. రావి చెట్టునకు పూజ చేసి 21 చుట్లు దారం చుట్టాలి. విష్ణుసహస్రనామ పారాయణ చేసుకోవడం మంచిది. బెల్లం,నువ్వులు వేసి చేసిన రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాకులకు వేయాలి.


** ఇవి వృశ్చిక రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

మకరరాశి వారి ఫలాలు

మకరరాశి వారి ఫలాలు

మకరరాశి:-(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఆదాయం- 5, వ్యయం - 2.
రాజపూజ్యం - 2 అవమనం - 4.

ఈ రాశివారికి 2020 ఫిబ్రవరి వరకు వ్యయము నందు శని, ఆ తదుపరి జన్మమము నందు, ఈ సంవత్సరం అంతా షష్టమము నందు రాహువు, వ్యయము నందు కేతువు, నవంబర్ 4వ తేదీ వరకు లాభం నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా వ్యయము నందు సంచరిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశివారి 'మిత్ర బుద్ధిః ప్రళయాంతకః' అన్నట్లుగా మీ మిత్రుల వలన ధన నష్టం, మాననష్టం జరిగే అవకాశం ఉన్నందువలన ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించండి.

ఈ రాశి వారికి ఏలినాటి సంచారం బాగుండడంతో కొంత సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా గానీ అనుకూలంగా ఉన్నదనే చెప్పవచ్చు. ఇబ్బందికర వాతావరణం ఎదుర్కునే విధంగా బుద్ధికుశలత ఉపయోగించి బయటపడతారు. ధనస్సులో ప్రవేశించినది మొదలు మీకు ఖర్చులు ఎక్కువ కావడం, ఋణాలు, కొంత చికాకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో అధిక శ్రమ పడవలసి ఉన్నది. అధికారులతో అప్రమత్తత అవసరం. తోటివారి తీరు మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

వృత్తి వ్యాపారాల్లో నవంబరు వరకు లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఎండుమిర్చి, కంది, మినుము పంటలు బాగా పండుతాయి. అనారోగ్య సమస్యలకు మంచి తరుణోపాయం దొరుకుతుంది. కళ్ళు, తల, నరాలకు సంబంధించిన సమస్యల నుండి కొంతబయటపడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీయాన యత్నాలు ఫలించగలవు. స్థిరాస్తుల అభివృద్ధి, కొనుగోలు యత్నాలలో మీరుచేసే యత్నాలి ఫలితాయి. పాత సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. మానసిక ఒత్తిడి, పనుల మీద దృష్టి అధికంగా ఉంటుంది.

శని వ్యయంలో సంచారం చేయునపుడు ప్రతి పనిలో ఒత్తిడి, అలసట, గౌరవభంగం వంటివి ఎదుర్కునే ఆస్కారం ఉంది.మద్య వర్తిత్వం చేయరాదు. సాక్షి సంతకాలు చేయకూడదు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు. ముఖ్యుల సహకారం మీకు అందుతుంది. అధికంగా ఆలోచించి ఇబ్బందులకు గురికాకండి. పుణ్యకార్యాలు విరివిగా చేస్తారు. అవివాహితులకు శుభదాయకం. తాము ఇష్టపడిన సంబంధాలు అయ్యే ఆస్కారం ఉంది. కంప్యూటర్, ఎలక్ట్రానికి రంగాల్లోవారికి కలిగిరాగలదు.

వ్యవసాయదారులు అనుకున్న పంటలు వేసినప్పటికి తగిన గిట్టుబాడు ధరలు అందక కొంత నిరుత్సాహం చెందుతారు. ఎగుమతి, దిగుమతుల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కునే అవకాశం ఉంది. తలిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం జాగ్రత్త వహించండి. ఏలినాటి శనిదోషం ఉన్నందువలన ప్రతి శనివారం 11 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంకు పూలతో శనిని పూజించిన ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది.

నుదుట రోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పేద వారికి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. వేంకటేశ్వర స్వామిని తులసి మాలతో పూజించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఉత్తరాషాడ నక్షత్రం వారు పనస చెట్టును, శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు చెట్టును, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును పూజించిన దోషాలు తగ్గుతాయి.


** ఇవి మకర రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

మీనరాశి వారిఫలాలు

మీనరాశి వారిఫలాలు


మీనరాశి:-(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం- 2 వ్యయం- 8.
రాజపూజ్యం - 1 అవమానం - 7.

ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా చతుర్థము నందు రాహువు, రాజ్యము నందు కేతువు. 2020 ఫిబ్రవరి వరకు రాజ్యము నందు శని, ఆ తదుపరి అంతా లాభము నందు, నవంబర్ 4వ తేదీ వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా, రాజ్యము నందు సంచరిస్తారు. ఈ రాశివారికి గ్రహసంచారం పరిశీలించగా 'ఆలస్యం అమృతమ్ విషమ్' అన్నట్లుగా ప్రతి చిన్న అవకాశాన్ని విడవక సద్వినియోగం చేసుకోండి.

కుటుంబ విషయాల్లో కొంత అనుకూలంగా ఉన్న ఎక్కువ భాగం బంధుమిత్రులతో, కుటుంబీకులతో కలహ వాతావరణం నెలకొనే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల యందు అధిక జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలు ఇతరుల మద్ద చర్చించకుండా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఖర్చులు కూడా నియంత్రించుకోగలుగుతారు. అదేరీతిలో అవసరానికి తగిన కొత్త ఋణములు, ఆర్థిక వెసులుబాటు చక్కగా లభిస్తాయి. శని, గురువులు అనుకూలంగా ఉన్న దృష్ట్యా కష్టేఫలి అన్నట్లుగా మీరు శ్రమిస్తున్న కొద్దీ దానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు.

నూతన దంపతులు శుభవార్తలు వింటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ విషయాల యందు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రమోషన్‌కై చేయు యత్నాలు ఫలిస్తాయి. తోటి ఉద్యోగుల సహాయ సహకారులు మీకు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుకుడులు ఉన్నప్పటికి మంచి లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించనప్పటిక నెట్టుకు రాగలుగుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రుల సహాయ, సహకారాలు అందుకుంటారు.

ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి శుభకాలం. నూతన ఉగ్యోగ యత్నాలు ఒక కొలిక్కిగాలవు. విలువైన వస్తు, వాహనాలను అమర్చుకుంటారు విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. క్యాంపస్ సెలక్షన్ ద్వారా అరుదైన అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒకడుగు ముందుకు వేస్తారు. మీ ప్రయత్నాల్లా సఫలీకృతులౌతారని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. విదేశీయాన యత్నాలు చేయువారు వారికి అధిక ప్రయాస, ధనవ్యయం అయినప్పటికి చివరికి పనులు సానుకూలమవుతాయి.

రైతులు పంటల విషయంలో గానీ, విత్తనాల విషయంలో గానీ తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మోసపోయే ఆస్కారం ఉంది. వాతావరణం కూడా అనకూలించడంతో అనుకున్న లాభం పొందగలుగుతారు. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. గురు, శని సంచారం అనుకూలం దృష్ట్యా వర్క్‌ర్స్‌తో సహకారం మీకు బాగా అందుతుంది. సాంఘిక, సేవా కార్యక్రమాలకు సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది.

నూతన పరిచయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అవివాహితుల్లో నూతన ఉత్సాహం నెలకొంటుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో అనుకోని పురోభివృద్ధి కానవస్తుంది. పుణ్యకార్యాలు, దైవదర్శనాలు చేసుకుంటారు. చెడు ఆలోచనకు దూరంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకున్నట్లైతే ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. ఆవేశంగా తొందర పడి నిర్ణయాలు తీసుకోవద్దు.

ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రని పూలతో పూజించి, ఆదిత్య హృదయం ప్రతిరోజూ పఠించిన సంకల్పసిద్ధి, మనోవాంఛలు నెరవేరగలవు. తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నంత కాలం మీకు ఏమి కాదు.

** ఇవి మీన రాశి వారి ఫలాలు. మీరు మీ రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా. మరి మీ స్నేహితులు వారి రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ లింక్ వారికి షేర్ చేయండి.

English summary
The results of this diaphragm effect are given by the perspectives of the gravestones and the glands. These results are from the minds of all sections. You can see the entire detail through your personal horoscope. So you can contact your experienced scholars who are available to you for your complete horoscopes, and ask them to get horoscope and details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X