వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకాదశులు ఎన్ని రకాలు? జనవరి 6న వైకుంఠ ఏకాదశి.. సూర్య నమస్కారం చేస్తే కలిగే లాభం..

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

చంద్రుడు భూమిని చుట్టి రావడానికి ఇరవై తొమ్మిదిన్నర రోజులు అవుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిధి అనబడే చాంద్రమాసంలో 30 తిధులు ఉన్నాయి. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 తిధులను శుక్ల పక్షమని పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల తిధులను బహుళ పక్షమని ( కృష్ణ పక్షమి ) అని అంటారు.

అమావాస్య నాడు సూర్య చంద్రులు ఒకే సమయంలో ఉదయించి ఒకే సమయంలో అస్తమిస్తారు. అక్కడ నుండి ఒక్కొక్క రోజు 12 డిగ్రీల చొప్పున చంద్రుడు, సూర్యుని నుండి దూరమౌతాడు. నాల్గవ రోజు చవితి నాడు చంద్రుడు సూర్యుని నుండి 37 డిగ్రీలు మొదలు 48 డిగ్రీలు వెనుక బడతాడు. పదకొండవ రోజు ఏకాదశి నాడు సూర్యుని నుండి 134 డిగ్రీలు వెనుక ఉన్నట్టు. పౌర్ణమి నాడు సూర్యుని నుండి 180 డిగ్రీలు ఉంటుంది. పైన చెప్పిన రోజుల్లో సూర్యుని నుండి చంద్రుడు దూరముగా ఉన్నందున భూమి ఆకర్షణ శక్తి అధికమవుతుంది.

Vaikunta Ekadashi on January 6th: Significance of holy festival

ఆలాంటి సమయంలో ఎప్పుడూ భోజనం చేసినట్లు చేస్తే జీర్ణక్రియ సరిగా ఉండదు. అందు వలన ఆ కాలంలో శాస్త్ర సూచనలు ఉపవాసం చేయాలని చెబుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున చంద్రుడు సూర్యునికి 135 డిగ్రీలు వెనుకబడి ఉంటాడు. ఆనాడు సూర్యుని మార్గానికి దక్షిణాన దూరంగా ఉంటాడు. ఆనాడు కూడా భూమి ఆకర్షణ శక్తి అధికమైనందున ఉపవాసం చేయాలి అని తెలియజేయబడినది.

ఏకాదశిరోజు ఉపవాస వ్రతం చేయడం వలన పదిరోజుల నుండి తిన్న ఆహారంలో చేరిన మలినాలు ,అధిక కొవ్వు పదార్ధాలు కరిగి బయటికి పోతాయి. ఏకాదశిరోజు కడుపు శుభ్రపడుతుంది. ఆ రోజు జీర్ణక్రియకు విశ్రాంతి లభిస్తుంది. మనకు ముఖ్యంగా విటమిన్ 'ఏ' విటమిన్ 'సి' అవసరపడతాయి. అందు వలన ద్వాదశి నాడు 'ఏ' విటమిన్ అధికంగా కలిగిన ఆకుకూరను, 'సి' విటమిన్ అధికంగా కలిగిన ఉసిరికాయలను ఆహారంలో చేర్చుకుంటున్నాము.

ప్రతిరోజూ మనం సూర్య నమస్కారాలు చేసి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వలన నేత్ర దృష్టికి, దేహానికి ఆరోగ్యం లభిస్తుంది. ప్రతి నెలకు రెండు పక్షాలు 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులుంటాయి. ప్రతి నెల ఆమావాస్యకు, పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాడ శుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని అంటారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు 12 వస్తాయి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు 12 వస్తాయి.

వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నను. ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తాము. అవే

1. ఆషాడ శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి / శయనేకాదశి )
2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి )
4. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి )

వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి. పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని అంటారు.

English summary
Vaikunta Ekadashi on January 6th: According to the Vishnu Purana, fasting on Vaikuntha Ekadashi is equivalent to fasting on the remaining 23 Ekadashis of the (Hindu) year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X