వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు శాస్త్రం: ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి?

|
Google Oneindia TeluguNews

ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇల్లుని శుద్ది చేసుకోవాలి, నీళ్ళలో కాస్త దొడ్డు ఉప్పువేసి ఇళ్ళును శుభ్రపరచుకోవాలి. వారనికి రెండు సార్లైన సాయంత్రం సమయాలలో సాంబ్రాని దూపం పొగ ఇంట్లో,వ్యాపార సంస్థలలో వేయాలి. పక్కబట్టలు,కర్టేన్లు వారం పది రోజులకోకసారి శుభ్రపరచుకోవాలి. ప్రశాంత వాతవరణంలా ఉండేందుకు ఎదైన దేవుని చాంటింగ్ లేదా సన్నగా సంగీత వాయిద్యాల వాయిస్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.

డ్రాయింగ్ రూంలో కుటుంబ సభ్యుల సంతోషకరమైన ఫొటోలు చిత్రాలను పెట్టండి. నవ్వుతూ ఉన్న చిత్రాల వల్ల పాజిటివ్ ఏనర్జీ పెరుగుతుంది.పగిలిన విరిగిన ఫ్రేమ్ ఫోటోలు ఉండరాదు. పాలులు,గద్ద,కొంగ,ముంగీస,యుద్ద సంకేతం ఉన్న ఫోటోలు ఉండకూడదు. అపరిశుభ్రంగా ఏ ఫొటోనూ ఉంచరాదు.పగిలిన విరిగిన వస్తువులు కూడ ఉండరాదు.

Vastu Shastra must and should for house

నిదుర నుండి లేచిన వెంటనే చీపురును చూడకూడదు.ఇంటి కలవడానికి వచ్చిన వారికి మన పాద రక్షలు వారి కంట కనబడకుండా చూసుకోవాలి. ఆగిపోయిన గడియారాలను, పగిలిన అద్దాలు, విరిగి బీటలు పడిన బొమ్మలు, కళా కాంతులు కోల్పోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు.గుమ్మలపైన గడియారాలు ఉండకూడదు.ఇలాంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా మరిచిపోకుండా పాటిస్తే హాని కలుగదు

అపార్ట్మెంట్లలో నివశించే వారి అభిరుచులకి విరుద్ధంగా వ్యవహరిస్తూ, కుక్కలను ఇతర జంతువులను పెంచుకుంటూ ప్రతి దినం ఇతరుల ఆగ్రహాని గురికాకుండా ఉండాలి,వారి దుర్భాషలకు,శాపాలకు గురి కాకుండా చూసుకోండి. నివాస స్థలములలో ఇతరులను బాధపడుతూ వ్యతిరేకతకు గురి అవుతూ అధర్మ ప్రవర్తనగా చేసే ఏ పని శుభాలు కలుగ నీయదు.

ఒకవేళ పూర్వజన్మ పుణ్యం వలన కొంత కాలం శుభాలు పొందినా పుణ్యఫలం అయిపోగానే అధికమైన అనర్ధాలను పొందడమే గాకుండా ఇతరుల వల్ల కల్గిన శాపాలు తమ సంతతికి అందించిన వారవుతారు. వారి దుఖ:మయ జీవితానికి నాంది వేసిన వారు అవుతారు.

వాస్తు శాస్త్ర ఆమోదమైన పద్దతులను పాటించాలి మత్స్యయంత్రాలు,గోమాత సహిత భోజపత్ర యంత్ర ఐశ్వర్యకాళీ ఫోటోలు నివాస స్థలాలో,వ్యాపార స్థలాలలో ఏర్పాటు చేసుకుంటే దోష నివారణలు కలిగి సుఖశాంతులను ఇస్తాయి.

--- డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

English summary
Vastu Shastra must and should for house. According to Vastu Shastra, the main door of a home is not only the entry point for the family but also for energy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X