వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: ఇంట్లో చిరాకులా? భార్యాభర్తల మధ్య ఘర్షణలా? కర్పూరంతో చిన్న చిట్కాలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నప్పటికీ, మనకు తెలియకుండా జరిగే చిన్నచిన్న వాస్తు దోషాల కారణంగా మన ఇంట్లో ప్రతికూల శక్తి చేరుతుంది. అయితే ప్రతికూల శక్తిని తొలగించటానికి వాస్తు శాస్త్రంలో అనేక చిట్కాలు సూచించబడ్డాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో కర్పూర మహత్తరమైన పాత్రను పోషిస్తుందని, ఇంటిని శుద్ధి చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 ఇంట్లో కర్పూరం .. వాస్తు దోషాల నివారణకు మార్గం

ఇంట్లో కర్పూరం .. వాస్తు దోషాల నివారణకు మార్గం

ఇంట్లో కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొంటుందని చెబుతున్నారు. ఇంట్లో నిత్యం పూజ చేసుకొని, పూజ తరువాత కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని, ఇంట్లో సానుకూల శక్తి నిండుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక మరొక విధానంలో డిఫ్యూజర్ లో కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల కూడా కర్పూర పరిమళం ఇల్లంతా నిండి, దానివల్ల నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుందని చెబుతున్నారు. కర్పూరం వాసన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

ఇంట్లో కర్పూర ధూపం ... కుటుంబంలో శాంతి

ఇంట్లో కర్పూర ధూపం ... కుటుంబంలో శాంతి


ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారితే, ఆ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులను బయటకు పంపటానికి, ఇంటిలో సానుకూల వాతావరణం నెలకొల్పడానికి కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా, కర్పూర ధూపం తగిలేలా చూడాలని వాస్తు శాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు. వాస్తు ప్రకారం, కర్పూరాన్ని ఇంట్లో ఉపయోగించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. అపార్థాలు మరియు వాదనలు కాస్త తగ్గుతాయి. ఇంట్లో కర్పూరం మనస్సును ప్రశాంతంగా ఉంచేలా పనిచేస్తుంది. కర్పూరం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందువల్ల, మనస్పర్ధలు తక్కువగా చోటుచేసుకుంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 భార్యాభర్తల మధ్య గొడవలుంటే కర్పూరంతో ఈ పని చెయ్యండి

భార్యాభర్తల మధ్య గొడవలుంటే కర్పూరంతో ఈ పని చెయ్యండి


ఇక ఇంట్లో భార్య భర్తల మధ్య వైవాహిక విభేదాలు ఎదురైతే, రోజూ మీ పడకగదిలో వెండి లేదా ఇత్తడి గిన్నెలో కర్పూరం వెలిగించాలని సలహా ఇస్తున్నారు. అలా వీలుకాకపోతే ప్రత్యామ్నాయంగా, మీరు గది మూలలో రెండు కర్పూరం ముక్కలను కూడా ఉంచవచ్చునని చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాలను సమన్వయం చేస్తుందని నమ్ముతారు. ఇంటి ఆగ్నేయంలో సాయంత్రం పూట కర్పూర స్ఫటికాలను కాల్చడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది. నెయ్యితో కర్పూరాన్ని కాల్చడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఆర్ధిక సమస్యలు ఉంటే కర్పూరం ఇలా వినియోగించండి

ఆర్ధిక సమస్యలు ఉంటే కర్పూరం ఇలా వినియోగించండి


ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే, క్రమం తప్పకుండా రెండు లవంగాలను కర్పూరంతో కాల్చి, ఇంట్లో మొత్తం తిప్పితే ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా దీపావళి రోజున కర్పూరాన్ని వెలిగించటం వల్ల ప్రతికూలత మరియు దుష్టశక్తులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందినప్పుడు, మీరు సంపద, మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని పొందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే, అటువంటి వాస్తుతో సరిపడని ప్రదేశాలలో కర్పూరం స్ఫటికాలను ఉంచడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుంది. బాత్రూమ్ లేదా మెయిన్ డోర్ వాస్తు సిద్ధాంతాల ప్రకారం ఏర్పాటు చేయకపోతే నెగటివ్ ఎనర్జీని దూరం చేయడానికి కర్పూరాన్ని ఉపయోగించవచ్చని సలహా ఇస్తున్నారు.

కర్పూరం ఒక అద్భుతమైన రూమ్ ఫ్రెష్ నర్..

కర్పూరం ఒక అద్భుతమైన రూమ్ ఫ్రెష్ నర్..


కర్పూరం ఒక అద్భుతమైన రూమ్ ఫ్రెష్ నర్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. కర్పూరాన్ని పొడిగా ఒక స్ప్రే బాటిల్ లో నీళ్ళతో కలిపి నింపి పెట్టుకుంటే ఇంట్లో సువాసన కోసం దానిని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. కర్పూరం పొడిని నీళ్లలో కలిపి ఇల్లు శుభ్రం చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు నశించడమే కాకుండా, ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. మొత్తానికి కర్పూరం వాస్తు దోషాలను తొలగించడంతో పాటుగా, మానసిక ప్రశాంతతకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Conflict between husband and wife? Vastu Shastra experts say that if you follow small tips with camphor, everything will be fine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X