వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: ఇంట్లో మహిళలకు ఎప్పుడూ రోగాలా? ఈ వాస్తు దోషాలతోనే కావచ్చు!!

|
Google Oneindia TeluguNews

అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు, చాలామందికి తినడానికి ఆహారం, ఉండడానికి లంకంత ఇల్లు ఉన్నా ఎప్పుడు అనారోగ్యం వెన్నంటే ఉంటుంది. అది ఆ కుటుంబంలో తీవ్రమైన అశాంతికి, అలజడికి కారణంగా మారుతుంది. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు ఎప్పుడూ జబ్బు పడుతున్నారు అంటే ఆ ఇంట్లో ఎవరికి సుఖశాంతులు ఉండవు. ఎంత డబ్బు సంపాదించినా ఆసుపత్రుల కోసమే వృధాగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఇక సదరు గృహిణి కూడా శాశ్వతంగా ఒకే అనారోగ్య సమస్యతో బాధపడరు . రకరకాల అనారోగ్య సమస్యలతో, ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు నియమాలు సరిగా పాటించకపోవటం వల్ల అని చెప్తున్నారు.

మహిళలకు తీవ్ర అనారోగ్యం... దీనివల్లే

మహిళలకు తీవ్ర అనారోగ్యం... దీనివల్లే


ఎటువంటి వాస్తు నియమాలు పాటించకపోతే మహిళలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు? అసలు ఎక్కడ వాస్తు దోషం ఉంటే మహిళలు ఇంతగా అనారోగ్యం బారిన పడతారు? వంటి విషయాలను గమనిస్తే దక్షిణ నైరుతి దిశలో వాస్తు దోషమున్నా, వీధిపోటు ఉన్న మహిళలు తీవ్ర అనారోగ్యం పాలు అవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దక్షిణ నైరుతి దిశలో వీధి పోటు, వాస్తు దోషం ఉంటే తగిన విధంగా పరిహారం చేసుకోవాలని, వాస్తు దోష నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఆ సమస్య పరిష్కారం అయితే గృహిణుల అనారోగ్య సమస్యలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇల్లు శుభ్రంగా లేకుండా, సూర్యకాంతి లేకుండా ఉంటే జరిగేదిదే

ఇల్లు శుభ్రంగా లేకుండా, సూర్యకాంతి లేకుండా ఉంటే జరిగేదిదే

దక్షిణం వైపు కాళ్లు పెట్టి పడుకోవడం, మంచానికి ఎదురుగా పెద్ద పెద్ద అద్దాలు ఉండడం, ఇక ఇంట్లో ఉండే మెట్ల కింద స్టోర్ రూమ్ లను ఏర్పాటు చేసుకోవడం, చెత్తాచెదారాన్ని స్టోర్ రూమ్లలో జమ చేయడం చేస్తే కూడా ఇంట్లోని మహిళలు అనారోగ్యం బారిన పడతారని చెబుతున్నారు. బూజు దులుపుకోకుండా ఇంటిని ఎప్పుడు చెత్తాచెదారంతో ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరవకుండా, ఇంట్లో కనీసం సూర్యకాంతి పడకుండా ఇంటిని చీకటి గదిలాగా ఉంచటం కూడా మహిళలను రోగాలపాలు చేస్తుందని చెబుతున్నారు.

ఇంటి గోడలు చెమ్మ వస్తున్నా, కుళాయిలు కారుతున్నా అనర్ధమే

ఇంటి గోడలు చెమ్మ వస్తున్నా, కుళాయిలు కారుతున్నా అనర్ధమే

కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా తలుపులు, కిటికీలు తీసి పెట్టడం వల్ల కొంతమేర రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. ఇక అంతే కాదు ఆగ్నేయ దిశలో వంటగది నిర్మాణం చేయకుండా, నైరుతి దిశలో పడకగది నిర్మాణం చేయకున్నా తీవ్ర అనారోగ్యం కలుగుతుందని చెప్తున్నారు. వాస్తు ప్రకారం ఏ దిశలో కేటాయించిన గదులను ఆ దిశలోనే నిర్మించాలని సూచిస్తున్నారు. ఇక ఇంట్లో గోడలు తరచూ చెమగిల్లుతున్న, కుళాయిలు కారుతున్నా ఆ ఇంటి ఇల్లాలికి తరచూ అనారోగ్యం కలుగుతుందని చెబుతున్నారు. అలా లేకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో స్త్రీల ఆరోగ్యం విషయంలో వాస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఇంట్లో స్త్రీల ఆరోగ్యం విషయంలో వాస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఇక వంట గదిలో పాడైపోయిన వస్తువులు దాచిపెట్టిన, ఆహార పదార్థాలు ఉంచినా, మందులు వంట గదిలో పెట్టినా, చెత్త డబ్బా వంటగదిలో ఉంచినా అవి రోగాలకు నిలయంగా మారుతాయి అని చెబుతున్నారు. కుటుంబాన్ని నడిపించేది పురుషుడే అయినప్పటికీ, ఇంటిని తీర్చిదిద్దేది స్త్రీ. అటువంటి స్త్రీ ఆరోగ్యంగా లేకుంటే ఆ ఇంట్లో అన్నీ ఉన్న దరిద్రమే. కాబట్టి స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పైన పేర్కొన్న కొన్ని వాస్తు దోషాలను సవరించుకుంటే, కొంతమేర రోగాల బారి నుండి సదరు గృహిణికి ఉపశమనం దొరుకుతుంది. ఫలితంగా కుటుంబ జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Astrology: కలలో పాములు కనిపిస్తే శుభమా? అశుభమా? తెలుసుకోండి!!Astrology: కలలో పాములు కనిపిస్తే శుభమా? అశుభమా? తెలుసుకోండి!!

English summary
Women often suffer from illness at home. Vastu Shastra experts say that women's health will be affected only if these Vastu Defects exist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X