వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఈ 4వస్తువులలో ఏది ఇంట్లో ఉన్నా.. వాస్తుదోషాలు, ఆర్ధిక కష్టాలకు చెక్!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న వస్తువులు సానుకూల లేదా ప్రతికూల శక్తికి కారణమవుతాయి. ఈ శక్తి ఒక వ్యక్తి జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ప్రతికూల శక్తి కారణంగా పని చెడిపోతుంది. పురోగతికి ఊహించని విధంగా ఆటంకం ఏర్పడుతుంది. అంతే కాదు ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు డబ్బు కూడా వృధా ఖర్చు అవుతుంది. అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతికూల శక్తిని ఇంట్లో లేకుండా చూడడం చాలా ముఖ్యమైన అంశం.

 వాస్తు దోషాలతో మనుషులపై ప్రతికూల ప్రభావం

వాస్తు దోషాలతో మనుషులపై ప్రతికూల ప్రభావం

ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఉండే మనుషులపైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లో సానుకూల ఫలితాల కోసం కొన్ని వస్తువులను తీసుకు వస్తే అవి మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వస్తువులు ఇంటికి తీసుకురావాలి? ఏ వస్తువుల తో ఇంటికి మేలు జరుగుతుంది ? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

 తెల్ల జిల్లేడు మొక్క ఇంటికి శ్రేయస్కరం

తెల్ల జిల్లేడు మొక్క ఇంటికి శ్రేయస్కరం


ఇంట్లో తెల్ల జిల్లేడు మొక్కను నాటడం శుభపరిణామంగా భావిస్తారు. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడని, శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదని నమ్ముతారు. వాస్తు ప్రకారం, ఇంట్లో తెల్ల జిల్లేడు మొక్క ను పెట్టడం వల్ల ఆనందం మరియు శ్రేయస్సుతో పాటు ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఆగ్నేయ దిశలో కాకుండా ఉత్తర దిశలో ఈ మొక్కను నాటడం శ్రేయస్కరం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

 ఒక కన్ను ఉన్న కొబ్బరికాయ పూజించడం శ్రేయస్కరం

ఒక కన్ను ఉన్న కొబ్బరికాయ పూజించడం శ్రేయస్కరం


వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఒక కన్ను ఉన్న కొబ్బరి కాయను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కొబ్బరికాయను శుభం మరియు సంతోషం మరియు శాంతికి చిహ్నంగా భావిస్తారు. ఒక కన్నుతో కొబ్బరికాయను తెచ్చి, దానికి పసుపు, కుంకుమ పూసి, ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, పూజ గదిలో ఉంచి, క్రమం తప్పకుండా పూజించాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో అంతా మంచే జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంటి గుమ్మంలో పటిక.. ప్రతికూల శక్తులు రావిక

ఇంటి గుమ్మంలో పటిక.. ప్రతికూల శక్తులు రావిక


ఇక వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు తొలగించుకోవడానికి ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటికి గుమ్మంలో వేలాడకట్టాలి. ఇలా కట్టడంవల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని, నరదృష్టి కూడా లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వారు సుఖ సంతోషాలతో ఉంటారని సూచిస్తున్నారు. ఇంటి గుమ్మం ముందు పటికను కట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావని, సానుకూల శక్తి కుటుంబ సభ్యుల మధ్య సంతోషానికి కారణం అవుతుందని చెబుతున్నారు

పాదరస శివలింగం.. వాస్తు దోషాలను హరించే మార్గం

పాదరస శివలింగం.. వాస్తు దోషాలను హరించే మార్గం


ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి, నియమనిష్టలతో ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజిస్తే ఆ శివుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. వాస్తు దోషాలు తొలగి పోవడంతో పాటు, అంతా మంచి జరుగుతుందని సూచిస్తున్నారు. అయితే ఇంటికి శివలింగాలను తీసుకొని వస్తే కచ్చితంగా నిత్యం అభిషేకం చేయవలసిందే. నియమనిష్ఠలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో, నిత్య పూజలు చేస్తేనే తగిన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Experts in Vastu Shastra say that any of these objects in the house, such as Mercury Shivlinga, alum, one-eyed coconut, will check Vastu Doshas and financial difficulties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X