వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: వంటగదికి ఆరోగ్యానికి లింక్.. కిచెన్ వాస్తు ఏం చెప్తుందంటే!!

వంటగది వాస్తు కుటుంబ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వంటగది ఎలా ఉండాలి. ఏ దిశలో ఏ వస్తువులు ఉండాలి అనేది తెలుసుకుని వాస్తు నియమాల అనుసారం వంటగది ఉంటే ఆరోగ్యం, ఆనందం , శ్రేయస్సు కలుగుతుంది.

|
Google Oneindia TeluguNews

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. దానికోసం మంచి పోషక ఆహారాన్ని తీసుకుంటే మాత్రం సరిపోదు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలి అనుకుంటే వాస్తుకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవాలి. వాస్తు నియమాలను పాటించాలి. ముఖ్యంగా వంటగది వాస్తును పాటించడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వంటగది వాస్తు సక్రమంగా లేకుంటే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. అందుకే ఇంట్లోని ముఖ్యమైన భాగమైన వంటగదిని వాస్తు నియమాల ప్రకారం నిర్మించుకోవడమే కాకుండా, వంటగదిలో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు నియమాలకు తగ్గట్టుగానే పెట్టుకోవాలి.

వంటగదికి వాస్తు ఎంతో అవసరం

వంటగదికి వాస్తు ఎంతో అవసరం


ఇల్లు కట్టేటప్పుడు వంటగదికి తక్కువ స్థలం ఇవ్వాలని ఆలోచన చాలామంది చేస్తూ ఉంటారు. అయితే అది తప్పు. వంటగదికి కూడా సరైన స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వంటగది బహిరంగ వాతావరణం కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. వంటగదిలో ఇతర ప్రదేశాలలో ఏ విధంగా అయితే వస్తువులు ఉంటాయో, అంతకు మించిన వస్తువులు ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా వంటగదిలోనే ఉంటాయి. అందుకే వంటగదిని వాస్తు దిశలో నిర్మించుకోవడమే కాకుండా, వాస్తు నియమాలను పాటిస్తూ వంటగదిని నిర్వహించుకోవాలి.

వంటగదిలో వస్తువుల వాస్తు నియమాలిలా ..

వంటగదిలో వస్తువుల వాస్తు నియమాలిలా ..

సాధారణంగా మనం ఆగ్నేయంలో వంటగదిని నిర్మించుకుంటాం. ఇక వంట గదిలో స్టవ్ కూడా ఆగ్నేయ కోణంలో ఉంచుకోవాలి. వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపుగా ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల సంపద పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక వంట గదిలో తాగునీటిని నిలువ చేసుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేసుకునే కుళాయిలను ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇక వంట గదిలో వాయువ్య మూలన సింక్ ఉంటే శుభప్రదంగా భావిస్తారు. వంటగదిలో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు నియమాలకు అనుసారంగా పెట్టుకోవాలి.

ఫ్రిజ్, ఓవెన్, మిక్సీలు ఈ దిశలోనే ఉండాలి

ఫ్రిజ్, ఓవెన్, మిక్సీలు ఈ దిశలోనే ఉండాలి

మైక్రోవేవ్ ఓవెన్, టోస్టర్, మిక్సర్ గ్రైండర్, జ్యూసర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆగ్నేయ కోణానికి సమీపంలో దక్షిణం వైపు ఉంచటం శుభప్రదం అని చెబుతారు. రిఫ్రిజిరేటర్ ను వంటగదిలో ఉంచాలి అనుకుంటే దక్షిణా లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. రిఫ్రిజిరేటర్ ను ఈశాన్యం లేదా నైరుతి కోణంలో ఎప్పుడు పెట్టకూడదు. ఇక వంటగదిలో మసాలా దినుసులు, ఆహార పదార్థాలు, పప్పులు, బియ్యం, పిండి, పాత్రలు ఏవైనా సరే దక్షిణం లేదా నైరుతి దిశలో ఉంచడం వాస్తుకు అనుకూలంగా ఉంటుంది. ఖాళీ సిలిండర్ ను నైరుతి దిశలో ఉంచటం మంచిది.

వంట గదికి వెయ్యాల్సిన రంగులు ఇవే

వంట గదికి వెయ్యాల్సిన రంగులు ఇవే

ఇక వాస్తు ప్రకారం వంటగది గోడలకు లేత నారింజరంగు కానీ, క్రీం కలర్ కానీ వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. వంట గదిలో ఎప్పుడూ నలుపు రంగును, నీలం రంగును ఉపయోగించకూడదు. నలుపు రంగును వంట గదిలో ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావం ఉంటుంది. అందుకే పొరపాటున కూడా నలుపు రంగును వంట గదిలో ఉపయోగించకూడదు. వంటగదిలో నలుపు రంగును ఉపయోగించడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టం జరిగే అవకాశం పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వంటగదిలో వాస్తు దోషాలుంటే ఈ రెమిడీలు ట్రై చెయ్యండి

వంటగదిలో వాస్తు దోషాలుంటే ఈ రెమిడీలు ట్రై చెయ్యండి

వంటగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే వాస్తు దోషాలకు అవకాశం ఉంటుంది. ఇక దానివల్ల వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ప్రధాన ద్వారానికి, వంటగదికి మధ్య పరదాలు వెయ్యాలని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఇక వంటగది వాస్తు దిశలో లేకపోతే, వాస్తు దోషాన్ని తొలగించడం కోసం, వంటగదికి ఆగ్నేయ దిశలో ఎర్రటి బల్బును పెట్టాలని, అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా వంటగది విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబ సభ్యుల అనారోగ్యం బారిన పడతారని, ఆర్థిక నష్టాలను చవిచూస్తారని చెబుతున్నారు. కాబట్టి వాస్తు శాస్త్రం నిపుణుల సూచనలు సలహాలు మేరకు వంటగది వాస్తును కచ్చితంగా పాటించండి.

disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సూచనలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: ఇంట్లోని ఈ భాగాలు రాహువుకు సంబంధించినవి, చిన్న దోషమున్నా సర్వ నాశనమే!!vastu tips: ఇంట్లోని ఈ భాగాలు రాహువుకు సంబంధించినవి, చిన్న దోషమున్నా సర్వ నాశనమే!!

English summary
Kitchen Vastu indicates family health. How should the kitchen be? According to Vastu rules, if the kitchen is in the right direction, health, happiness and prosperity will be yours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X