వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: చెప్పులను ఆ దిశలో పెట్టటం, అలా పడెయ్యటం.. దరిద్రానికి కారణం!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఏ విధంగా అయితే నిర్మించుకుంటామో, అదేవిధంగా వస్తువులను కూడా వాస్తు నియమాలను అనుసరించి పెట్టుకోవాలి. లేదంటే ఆ వస్తువు పెట్టిన స్థానం యొక్క ప్రభావం ఆ ఇంటి పై, ఇంట్లో నివసించే కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. ఇంట్లో పెట్టే ప్రతి వస్తువుకు తనదైన స్థానం ఉంటుంది. ఇంట్లోనే కాదు, ఇంటి ముందు పెట్టే చెప్పులకు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఒక స్థానం కేటాయించబడింది.

vastu tips: వర్షాకాలంలో ఇళ్ళల్లో చిరాకుగా ఉంటుందా.. ఆహ్లాదానికి సింపుల్ చిట్కాలు ఇవే!!vastu tips: వర్షాకాలంలో ఇళ్ళల్లో చిరాకుగా ఉంటుందా.. ఆహ్లాదానికి సింపుల్ చిట్కాలు ఇవే!!

 చెప్పులను ఎప్పుడూ ఈ దిశలోనే పెట్టాలి

చెప్పులను ఎప్పుడూ ఈ దిశలోనే పెట్టాలి


చెప్పులను పెట్టడంలో కూడా వాస్తు నియమాలను అనుసరించాలని చెప్పబడింది. లేదంటే దరిద్రం మనతోనే ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక చెప్పులను పెట్టే విషయంలో పాటించవలసిన నియమాల విషయానికి వస్తే చెప్పులను ఎప్పుడూ పశ్చిమ, నైరుతి దిశలలో పెట్టాలి. ఈ రెండు దిశలలోనే చెప్పుల స్టాండ్ ఉండాలని సూచించబడింది. ఎట్టి పరిస్థితులలోనూ తూర్పువైపు చెప్పులు విడువరాదని సూచిస్తున్నారు.

 చెప్పులు ఈ దిక్కులలో విడవటం మంచిది కాదు

చెప్పులు ఈ దిక్కులలో విడవటం మంచిది కాదు


తూర్పు దిక్కుకు సూర్యుడు అధిపతి కావడంతో, సూర్యుడికి ఎదురుగా చెప్పులు విడవడం మంచిది కాదని సూచించబడింది. అంతేకాదు చెప్పులను పెట్టడానికి ఉత్తరం , ఆగ్నేయం దిశలో కూడా మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక చెప్పుల స్టాండ్ పెట్టే గోడ, ఇంట్లోనే పూజగది గోడకు ఆనకుండా ఉండేలాగా చూసుకోవాలి.

ప్రధాన ద్వారానికి దగ్గరగా చెప్పులు పెట్టటం మంచిదేనా?

ప్రధాన ద్వారానికి దగ్గరగా చెప్పులు పెట్టటం మంచిదేనా?


సహజంగా చాలామంది ప్రధాన ద్వారానికి, కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ చెప్పుల స్టాండ్ లు పెడుతూ ఉంటారు. అయితే అది మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కనీసం ప్రధాన ద్వారానికి మూడు అడుగుల దూరంలో చెప్పుల స్టాండ్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక చెప్పులను ఎలా పడితే అలా విడవ కూడదని చెబుతున్నారు.

 ఇళ్ళ ముందు చెప్పులు బోర్లా పడి ఉండటం ఇంటికి అరిష్టం

ఇళ్ళ ముందు చెప్పులు బోర్లా పడి ఉండటం ఇంటికి అరిష్టం


వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు, లేదా బూట్లు బోర్లా పడి ఉండటం మంచిది కాదని చెబుతున్నారు. ఇళ్ల ముందు చెప్పులు బోర్లా పడి ఉండటం, ఇంటికి అరిష్టం తెస్తుందని చెబుతున్నారు. అలా చెప్పులు బోర్లా పడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన కూడా దీని ప్రభావం ఉంటుందని సూచిస్తున్నారు.

 చెప్పులు బోర్లా పడి ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా వెళ్ళిపోతుంది

చెప్పులు బోర్లా పడి ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా వెళ్ళిపోతుంది


ఇంటి ముందు చెప్పులు బోర్లా పడి ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బోర్లా చెప్పులు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. వృధా ఖర్చులు అధికమవుతాయి అని పేర్కొంటున్నారు. ఎన్ని డబ్బులు సంపాదించినా నిలవవని చెబుతున్నారు. అందుకే ఇంటిదగ్గర చెప్పులు పెట్టుకునే విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలని పదేపదే హెచ్చరిస్తున్నారు.

English summary
It is said that foot wear should not be placed in east, north and south-east direction. Moreover, it is said that everything is inauspicious if the sandals are reversed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X