వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్ర; మంచి సంపాదన కూడా!!

|
Google Oneindia TeluguNews

ఇల్లు ఎంత వాస్తు నియమాల ప్రకారం కట్టుకున్నప్పటికీ, ఇంట్లో వాస్తు నియమాల ప్రకారం కొన్ని పద్ధతులను పాటించకపోతే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. ఆ కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన నిద్ర కూడా ఉండదు. తరచుగా నిద్రలో మేల్కొనడం, ఆందోళన చెందడం, సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి అనేక సమస్యలకు వాస్తు సరిగా లేకపోవడమే కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక అటువంటి వారు చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Vastu tips: వంటగదికి ఆరోగ్యానికి లింక్.. కిచెన్ వాస్తు ఏం చెప్తుందంటే!!Vastu tips: వంటగదికి ఆరోగ్యానికి లింక్.. కిచెన్ వాస్తు ఏం చెప్తుందంటే!!

 ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ఈ చిన్న వాస్తు చిట్కా పాటించండి

ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ఈ చిన్న వాస్తు చిట్కా పాటించండి

గ్రహాల ప్రతికూల పరిస్థితుల కారణంగా చాలామందికి నిద్ర భంగం కలుగుతుంది. విపరీతమైన శారీరక మానసిక ఒత్తిడి, అనారోగ్యం కూడా కలుగుతుంది. ముఖ్యంగా రాహు గ్రహ అననుకూలమైన పరిస్థితి కారణంగా నిద్రకు సంబంధించిన ఇబ్బందులు చోటు చేసుకోవడమే కాకుండా, శారీరక అనారోగ్యం కలుగుతుంది. అయితే ఈ పరిస్థితిని దూరం చేసుకోవడానికి పడుకునే ముందు బెడ్రూంలో గంధపు పరిమళాలు వెదజల్లేలా, గది మొత్తం గంధపు నీళ్లను, పన్నీటిని వెదజల్లండి. ఇది సహజ సిద్ధంగా రాహు దోషాన్ని తొలగించి మీకు నిద్ర పట్టేలా చేస్తుంది.

 దిండు క్రింద ఇవి పెట్టండి.. నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టండి

దిండు క్రింద ఇవి పెట్టండి.. నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టండి

పెద్దలు కానీ పిల్లలు కానీ నిద్ర పోకుండా ఇబ్బంది పడుతుంటే దిండు కింద కొన్ని బార్లీ గింజలను ఉంచి పడుకోండి. ఉదయం లేచిన తర్వాత ఆ గింజలను పక్షులకు కానీ పావురాలకు కానీ తినిపించండి. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తికి ఉన్న నిద్రలేమి సమస్య శాశ్వతంగా దూరమవుతుంది. దీంతో పాటు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. జీవితంలో ఏ రంగంలోనైనా వారికి లబ్ధి చేకూరుతుంది. ఇక పడుకునే గదిలో మంచం కింద దుమ్ము ధూళి, చెప్పులు, బూట్లు, ఏవైనా పనిచేయని ఎలక్ట్రిక్ వస్తువులు ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే వారికి శాశ్వత నిద్రలేమి సమస్యలు కలుగుతాయి. ఆ పరిస్థితి రాకుండా మంచం కింద ఏమీ లేకుండా జాగ్రత్త పడండి.

బెడ్ షీట్లు, దిండు కవర్ల విషయంలో ఈ పని చెయ్యండి

బెడ్ షీట్లు, దిండు కవర్ల విషయంలో ఈ పని చెయ్యండి


ఇక మంచి నిద్ర కోసం ఎప్పుడు బెడ్ షీట్లను శుభ్రంగా ఉంచుకోండి. ఉదకని బెడ్ షీట్లను ఎక్కువ కాలం పాటు వాడకండి. బెడ్ షీట్లు దిండు కవర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉతికి, మళ్లీ బెడ్ పైన వేసుకోవాలి. అలా చేస్తే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. అలా కాకుండా మురికిగా ఉన్న బెడ్ షీట్ల మీద పడుకుంటే, అది ప్రతికూలతను తీసుకువస్తుంది. మనిషి నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది కాబట్టి బెడ్ షీట్లను, దిండు కవర్లను క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.

బెడ్ క్రింద ఇలా ఉంటేనే సుఖవంతమైన నిద్ర

బెడ్ క్రింద ఇలా ఉంటేనే సుఖవంతమైన నిద్ర


ఇక ప్రస్తుతం చాలా ఇళ్లల్లో బాక్స్ బెడ్లు వినియోగిస్తున్నారు. ఇక ఈ బాక్స్ బెడ్ లలో బెడ్ కింద ఎక్కడెక్కడి పాత సామాన్లను, పాత బట్టలను, రకరకాల వస్తువులను పెడుతున్నారు. అయితే ఇది కూడా నిద్రలేమికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు ఎప్పుడూ చెబుతున్నారు. కాబట్టి నిద్రపోయే మంచం కింద, ఎటువంటి వస్తువులు ఉండకూడదని, మంచం కింద భాగం ఎంత శుభ్రంగా ఉంటే అంత ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Vastu experts say that if you follow some Vastu tips in the bedroom for healthy, peaceful sleep, you will get good sleep and your income will also increase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X