వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: నిద్రకూ వాస్తు డైరెక్షన్: ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకుంటే ఏమవుతుందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

మన భారతీయ సనాతన సాంప్రదాయాల్లో మానవాళికి మేలు జరిగే ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఇది అనేక సమయాల్లో నిరూపించబడింది. ఈ క్రమంలోనే వాస్తు కూడా మానవాళికి మేలు జరిగే రీతిలోనే నిర్దేశించారు అని చెప్పబడింది. వాస్తులో నిద్రించడానికి కూడా సరైన దిశానిర్దేశం చేయబడింది. ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రించకూడదు అని ఇంట్లో పెద్ద వారు చెబుతారు. అసలు ఉత్తర దిక్కుకు తలపెట్టి ఎందుకు నిద్రించరాదు? దీని వెనుక వున్న సైంటిఫిక్ కారణాలు ఏంటి? ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తే ఏం జరుగుతుంది వంటి అనేక వివరాలు ఈరోజు మన వాస్తు టిప్స్ లో తెలుసుకుందాం.

మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైంది నిద్ర .. నిద్రకూ వాస్తు డైరక్షన్

మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైంది నిద్ర .. నిద్రకూ వాస్తు డైరక్షన్

నిద్ర అనేది మీ శరీరం యొక్క అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలలో ఒకటి, ఇది మరుసటి రోజు మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు అవసరం. నిద్ర శరీరాన్ని తిరిగి శక్తివంతం చేస్తుంది . రోజులో కోల్పోయిన శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కాబట్టి, గాఢమైన నిద్రలోకి జారుకోవడం మరియు రాత్రిపూట తగినంత గంటలు నిద్రపోవడం చాలా అవసరం. సరిగ్గా నిద్రపోని వారు అనారోగ్యం బారిన పడతారు. అందుకే సరైన నిద్రకు సరైన డైరెక్షన్ కూడా అంతే అవసరమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

 ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే రక్తపోటులో హెచ్చుతగ్గులు

ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే రక్తపోటులో హెచ్చుతగ్గులు

ఎటువంటి పరిస్థితులలోనూ ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదని సాధారణంగా చెబుతారు. ఇది నిజం. ఉత్తర దిక్కుకు నిద్రించకూడదు అని చెప్పడం వెనుక అనేక కారణాలున్నాయి. భూమి మరియు మానవ శరీరం, రెండూ వాటి స్వంత గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిగి ఉన్నాయని మనందరికీ తెలుసు. భూమిపై అయస్కాంత క్షేత్రాలు ఉత్తర మరియు దక్షిణ ధ్రువంలో కేంద్రీకృతమై ఉన్నాయి. మీరు ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తున్నప్పుడు, మీ శరీరం యొక్క అయస్కాంత క్షేత్రం భూమికి అంతరాయం కలిగిస్తుంది. ఇది మీ రక్తపోటును హెచ్చుతగ్గులకు గురి చేస్తుంది. గుండె సమస్యలను కూడా కలిగిస్తుంది. దీన్ని అధిగమించడానికి మీ హృదయం మరింత కష్టపడాలి. మీరు వృద్ధులైతే లేదా ఇప్పటికే గుండె జబ్బు ఉన్నట్లయితే, మీరు రక్తస్రావం లేదా పక్షవాతం స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.

మెదడుపై గురుత్వాకర్షణ తరంగాల ప్రభావం.. అనారోగ్యం, మరణాలు సంభవించే ప్రమాదం

మెదడుపై గురుత్వాకర్షణ తరంగాల ప్రభావం.. అనారోగ్యం, మరణాలు సంభవించే ప్రమాదం


భూమిపైన గురుత్వాకర్షణ శక్తి ఉత్తర దక్షిణ ధ్రువాల నడుము ప్రసారం అవుతూ ఉంటుంది. మనం ఉత్తర దిక్కుగా పడుకున్నప్పుడు ఆ తరంగాలు మన మెదడుపై ప్రభావం చూపుతాయి దానివలన అనేక ఆరోగ్య మానసిక సమస్యలు వస్తాయి . మెదడులో లోపాలు తలెత్తుతాయి. రక్తప్రసరణలో తీవ్రమైన మార్పులు వస్తాయి. తత్ఫలితంగా అనేక అనారోగ్య బాధలను అనుభవించాల్సి వస్తుంది. అది ఒక్కొక్కసారి మరణానికి కూడా దారి తీయవచ్చని చెబుతున్నారు. మీ తలని ఉత్తరం వైపుగా పెట్టుకుని పడుకోవడం వల్ల నిద్రా భంగం కలుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకుండా ఉండటం మంచిది.

నిద్రించడానికి ఈ దిక్కులు అనువైనవి

నిద్రించడానికి ఈ దిక్కులు అనువైనవి


తూర్పు మరియు దక్షిణ దిశలు నిద్రించడానికి అత్యంత అనుకూలమైన దిశలు. దక్షిణం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల ఉత్తర దిశ యొక్క ప్రతికూల ప్రభావాలను తిప్పికొడుతుంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది మరియు స్థిరమైన రక్త ప్రసరణను కూడా నిర్వహిస్తుంది. నిద్రపోతున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ మీ ఎడమ వైపున పడుకోవడానికి ప్రయత్నించాలి . ఎడమవైపు పడుకోవడం వల్ల గుండె సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి మరియు మంచి నిద్ర వస్తుంది.

English summary
Architecture says that sleep has an vastu direction. It has been scientifically proven that lying on the north side can lead to brain problems and blood circulation problems. That is why it is said not to sleep on north.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X