ప్రారంభమైన మాలవ్య రాజయోగం.. ఈ రాశులవారికి..!
ప్రతి గ్రహం నిర్ణీత సమయానికి ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచార ప్రభావం 12 రాశులపై ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడు వృషభ రాశిలో ఏప్రిల్ 6వ తేదీనే ప్రవేశించడం వల్ల సింహరాశి, వృషభరాశి, వృశ్చిక రాశులవారికి రాజయోగం పట్టనుంది. ఈ సందర్భంగా ఏర్పడిన మాలవ్య రాజయోగం మూడు రాశులవారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ధనానికి, భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడు వృషభరాశిలో ప్రవేశించడంవల్ల ఏర్పడిన యోగాన్ని అత్యంత శుభసూచకంగా పరిగణిస్తారు. దీనివల్ల అదృష్టం వికసిస్తుంది.
సింహ రాశి : ఈ రాశి 10వ పాదంలో శుక్రుడి గోచారమైంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు మంచి సమయం. కొత్త ఆస్తి లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే వారికి ఇది మంచి సమయం. కోరుకున్న చోటకి బదిలీ అవడమే కాకుండా వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వృషభ రాశి : శుక్రగ్రహం ఈ రాశిలో ప్రవేశించి ఉండటంతో ఏర్పడిన మాలవ్య రాజయోగం ప్రభావం వృషభ రాశి జాతకులకు ఎంతో బాగుంటుంది. ప్రతి పనిలో వీరు విజయం సాధిస్తారు. ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా వీరివెంటే విజయం ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటమేకాదు.. వీరి ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది.
వృశ్చిక రాశి: మాలవ్య రాజయోగం వృశ్చిక రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు ఈ రాశివారికి అంతులేని సుఖ సంతోషాలను అందివ్వడంతోపాటు కుటుంబంలో ప్రశాంతత ఉండేలా చూస్తాడు. ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications