వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయకుడి పూజ ఎప్పుడు, మరి నిమజ్జనం ?

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీ మహా గణాధిపతయే నమ:

ప్రతీ ఏటా జరిపే మహాగణపతి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా వచ్చింది. ఆనందం, ఉత్సాహములతో పాటు వరాన్ని, అనుగ్రహాన్ని కూడా అందించే మహాగణపతి పూజా విధానంలో మనం తెల్సుకోవల్సిన కొన్ని అంశాలు చూద్దాం.

.నవరాత్రి ఉత్సవాలు జరిపే వారు వినాయకుని మూర్తి వీలైనంత వరకు మట్టితో ఉండేలా పర్యావరణానికి అనుకూలంగా ఉండేలాగా చూడాలి.

.ఇంట్లో చేసినా, బయట మంటపాలలో చేసినా స్థాపనకి, చివర ఉద్వాసనలకి ఖచ్చితంగా దంపతులే కూర్చోవాలి.

వీలైనంతవరకు ఉదయ కాలంలోనే స్థాపన చేయాలి.

.ఈ సంవత్సరం తిథి ప్రకారం 5వతేదీ సోమవారం రాత్రి 9గంటల వరకూ చవితి ఉంది కనుక. సూర్యా స్తమయం 6.20కి అవుతుమది సూర్యాస్తమయం లోపుగానే స్థాపన చేయాలి.

పూజమీద కూర్చునేవారు ఏరోజున కూర్చున్నా సంప్రదాయ సుస్తుల్లోనే కూర్చోవాలి.

Vinayaka Chavithi prayers and immersion

. మూడు రోజులు ఉంచేవారు మూడు రాత్రులు 5,6,7 లు పూర్తి చేసి. 8ఉదయాన్నే తీయాలి కానీ 7వతేదీ రాత్రి తీయరాదు.

. 5రోజులు ఉంచేవారు 5-9 వరకు ఉంచాలి శనివారం రోజున ఉదయం ఉద్వాసన చేయాలి.

. 7 రోజులు ఉంచేవారు 5-11 వరకు ఉంచాలి సోమ వారం రోజున ఉదయం ఉద్వాసన చేయాలి.

. 9 రోజులు ఉంచేవారు 5-13 వరకు ఉంచాలి బుధవారం రోజున ఉదయం ఉద్వాసన చేయాలి.

.11 రోజులు ఉంచేవారు 5-15 వరకు ఉంచాలి 16న నిమజ్జనం చేయాలి.

కానీ ఆరోజున శుక్ర వారం అవడం వలన. శనివారం తీసుకు వెళ్లాలి.

. ఉద్వాసన చేసేటపుడు ఒకటి. వాహనమ కదిలేటపుటు మరొకటి గుమ్మడి కాయని కొట్టాలి.

.సామూహుక కుంకుమార్చనలు చేసుకోదలచినవారు 8వ తేదీ శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లలితా సహస్ర నామాలతో చేసుకోండి.

. చదువుకునే పిల్లలతో సామూహిక గరిక పూజ 11వతేదీ ఉదయాన చేయించండి.

ఇవి నియమాలు.

'' యత్‌ శాస్త్ర విధి ముత్‌సృజ్య వర్తతే కామకారత:

నససిద్ధి మవాప్నోతి నసుఖం, నపరాంగతిమ్‌ .'' అని భగవద్గీతా శ్లోకం.

అంటే శాస్త్ర విధిప్రకారం నియమాలు పాటించనివారికి, అలా నడుచుకోనివారికి చేసేపనికి ఫలితమూరాదు, స్వర్గాది పుణ్యలోకాలు పొందకుండా, నరకానికి వెళతారు అని ఈశ్లోకార్థం.

కాబట్టి చక్కగా నియమంగా స్వామిని పూజించి ఐహికాముష్మికాలు తీర్చుకోవాలని కోరుకుంటూ. శుభం.

- మారుతి శర్మ.

English summary
Astrologer Maruthi Sharma explained about the Vnayaka prayers and immersion during Vinayaka Chavithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X