వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మను, వేదములను సృష్టించినది విశ్వకర్మయే

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

తేదీ 17-2-2019 ఆదివారము మాఘశుద్ద త్రయోదశి తిధి రోజు పరబ్రహ్మ విశ్వకర్మ భగవానుని పండగ.ఈ సకల చరాచర సృష్టిని ప్రాణికోటిని సృష్టించిన మూల పురుషుడు విశ్వకర్మ భగవాణుడు.చాలా మంది తెలియక మహాభారతంలో కనిపించే దేవశిల్పియే విశ్వకర్మ భగవాణుడు అనుకూంటారు.భారతంలో కనిపించే విశ్వకర్మ వేరు .

సృష్టిలో ఏమి,ఏదీ లేనప్పుడు స్వయంభూ: గా ఐదు ముఖములతో వెలసిన విశ్వకర్మ భగవాణుడు తన ఐదు ముఖాలకు ప్రతీకగా మను ,మయ,త్వష్ట ,శిల్ప,విశ్వజ్ఞ బ్రహ్మలను సృష్టించి వారిచే వంశోత్పత్తిని చేయించాడు .సూర్యుడు,చంద్రుడు,భూమి,ఆకాశం,అగ్ని,నీరు,గాలి బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు సైతం విశ్వకర్మ భగవాణుని తర్వత ఏర్పడినవి.విశ్వకర్మ భగవాణుని గురించి పురాణాలలో ఏమి చెప్పబడినదో సంక్షిప్తంగా వివరిస్తున్నాను.

Vishwakarma jayanti 2019 worship of lord vishwakarma

యో బ్రహ్మాణం విదాధాతి పూర్వం
యో నై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తం హ దేవ మాత్మబుద్ధి ప్రకాశం
ముముక్షు ర్వై శరణ మహం ప్రపద్యే.
శ్వేతాశ్వతరోపనిషత్ 6-18

కృత యుగములో పృధు అనే చక్రవర్తి భూమండలమును క్షామము నుండి రక్షించుటకు జరిపిన విశ్వకర్మ యజ్ఞము నందు వేద స్వరూపుడైన విశ్వకర్మ భగవానుడు మాఘ శుద్ధ త్రయోదశి నాడు సాక్షాత్కారించాడు.అది మొదలుకొని లోకంలో విశ్వకర్మ యజ్ఞము లోకము నందు ఉత్సవంగా చేయాలనీ ఆజ్ఞాపించారు.

విశ్వకర్మా హ్యజనిష దేవ ,
ఆదిద్గ్గన్ధర్వో అభవద్వి యః
తృతీయః పితా జనితావ్ ఓషధీనము ;
ఇది యజుర్వేదంలో విశ్వకర్మ సూక్తం లోని మంత్రం.

ఎవరి నిర్మాణ కౌశల్యము విశ్వకర్మ పరబ్రహ్మ సృష్టివలె శ్రేష్టమైనదో సంకృతి అని అంటారు. కనుక ప్రధమ సంకృతులు విశ్వకర్మ, మిత్ర,వరుణ,అగ్ని మరియు బృహస్పతి అని వేదములు చెబుతున్నాయి.

స ప్రథమో సంకృతిర్విశ్వకర్మా౹
స ప్రథమో మిత్రో వరుణో అగ్నిః౹
స ప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్౹౹
యజుర్బ్రాహ్మణమమ.

ఈ మంత్రానికి శాయణాచార్యుల భాష్యము - సమీచీనా కృతి నిర్మాణం యస్యసౌసంకృతిః తాదృశో విశ్వకర్మ నామకోదేవ ఇంద్ర ఏవ౹

ఇందువలన బృహస్పతి శిల్పి వంశీక బ్రాహ్మణుడు.విశ్వకర్మ అనే పదం ఎలా వచ్చింది .విశ్వకర్మ అనే పదం వేదములలో ఉన్నది.విశ్వకర్మ జగదీశ్వరుడు .అతడే సృష్టి అంతటికి కారణ కర్త .తన తేజస్సు నుండి తన ప్రతిభింభమూర్తి అయిన త్వష్ట బ్రహ్మ ను సృష్టించాడు.అతని వల్లనే ఈ ప్రపంచం నిర్మించబడింది.

ఆ విరాట్ రూపి తేజస్సు నుండి ఆ త్వష్టయే బ్రహ్మయై ప్రజాపతియై ఋషియై శోభాయమానంగ ఉన్నాడు .త్వష్ట అపర బ్రహ్మయై విశ్వరూపాచార్యుడును ప్రధమ సంతానంగ విశ్వకర్మ అనే అతనిని రెండవ సంతానంగ పొందినాడు.అని వేద పురాణాలూ చెబుతున్నవి.దైవత్వంతో పాటు బ్రాహ్మణత్వాన్నీ పొందినారని పురాణం తెలుపుతుంది .

ఇంద్రుడికి త్వష్ట బ్రహ్మచేసి ఇచ్చిన వజ్రాయుధంతో విశ్వరూపాచార్యులను ఇంద్రుడు వధించాడు.ఇంద్రుడు విశ్వకర్మ యజ్ఞము చేసి తన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారణ చేసుకున్నాడు.త్వష్ట బ్రహ్మ యొక్క రెండవ కుమారుడైన విశ్వకర్మను ,వారి పరంపరకు చెందిన వారిని విశ్వకర్మ అని పిలిచేవారు అని శాస్త్రాలలో ఉన్నది.

విశ్వకర్మ అను శబ్దం జాతి వాచకంగ కూడా పేర్కొనబడినది.సృష్టి కర్త అయిన పరమాత్ముని పేరు కూడా ఇదే .అందువల్ల విశ్వకర్మ వంశజులు అని చెప్పబడినది.విశ్వకర్మ సృష్టికర్త అతడు పంచభూతాలను ఉపయోగించుకొని సకల జగత్తును సృష్టించాడు.జగత్ సృష్టిని శాస్త్రాలలో జగత్ శిల్పి అన్నారు .

ఎవరు మట్టి నుండి లోహం నుండి వివిధమైన రూపాలను సృష్టిస్తాడో ఎవరు దివిలోక ,భూలోక ,అంతరిక్ష లోకాలలో అచేతనాలను చేతనం చేయడం,యంత్రాలను ,ప్రతిమలను తయారు చేయడం,ఎవరికి జ్యోతిష్య చక్ర రహస్యాలు తెలియునో మరియు రథాలు,ఆకాశంలో ఎగిరే విమానాలు ఎవరి చేతి సృష్టియో వారే విశ్వకర్మ.మూలస్తంభ పురాణం ,విష్ణు పురాణంలో విశ్వకర్మ పదాన్ని చూడవచ్చు.

మూల స్తంభ పురాణంలోని ఒక శ్లోకం చూదాం .

శ్లోకం. సత్యవాన్ బ్రహ్మచారిచ శుద్ధాత్మ విజితేంద్రియ:
శ్రీద్దవాన్ సర్వజీవ దయాళుర్య:స: విశ్వ బ్రాహ్మణో భవేత్.

అనగా ఎవడు సత్యవంతుడో ఇంద్రియ నిగ్రహం కలవాడో పరిశుద్ధమైన అంతరంగం కలవాడో అన్ని జీవులపై దయ గలవాడో అతడే విశ్వబ్రాహ్మణుడు.శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని అంశచే జన్మించి వీరిని విశ్వబ్రాహ్మణులు,దేవ బ్రాహ్మణులుగా పిలవబడుతున్నారు.వీరు మహా మేధావులు సమాజమునకు శ్రేయస్సును కలిగించే మహానుభావులు.

వాయుపురాణం భూఖండము విశ్వకర్మోపాఖ్యానలో శివుడు పార్వతీదేవికి విశ్వకర్మ భగవాణుని ఆవిర్భావం గురించి ఈ క్రింది విధంగా తెలియజేసాడు.

శ్లోకం.. చింతయే ద్విశ్వకర్మాణం శివే వటతరో రధ:
ద్వివ్య సింహాసనాసీనం మునిబృంద నిషేవితమ్
ఉపాస్యమాన మమరై: స్తూయమానం మహర్షి భి:
పంచవక్త్రం దశ భుజం బ్రహ్మచారి వ్రతేస్థితిమ్
లక్ష్మీ సరస్వతీభ్యాంచ సంక్షాళిత పదద్వయమ్
వక్షస్థలేచ బిభ్రాణం బ్రహ్మవిద్యా ముమాతనుమ్
హార కేయుర కటక కుండలాద్వై స్సుశోభితమ్
భస్మంగరాగం దేవేశం వరదం సుస్మితాననమ్
కుద్దాల కరణీ వాస్యామమీ యంత్రం కమండలుమ్
బిభ్రాణం దక్షిణైర్హస్తై రవరోహ క్రమాత్ప్రభుం
మేరుంటకం స్వనం భూషాం వహ్నించ దధతంకరై:
అవరోహ క్రమేణైవ వామైర్వామ విలోచనే.

ఓ పార్వతీ విశ్వకర్మ భగవాణుడు మర్రిచెట్టు కింద సింహాసములో కూర్చుండి ఉండగా మహర్షులచే సేవిస్తూ పూజించబడుతున్నవాడు పది చేతులు కలిగిన ఈ స్వామిని లక్షీ,సరస్వతీ పాదాలు కడుగుతుండగ,వక్షస్థలలో బ్రహ్మవిద్యను ధరించి రత్న మాలలు,భుజకీర్తులు,కంకణములు,కర్ణభూషణములు ధరించి విభూతి నుదటన ధరించి చిరునవ్వుతో ఎంత గానో ప్రకాశిస్తున్న విశ్వకర్మ భగవానుని ధ్యానించుము అని శివుడు తన అర్ధాంగి పార్వతిదేవికి వివరించాడు.

పంచాననో దశభుజో వ్రరబంధ దీక్ష:
కేయూర హార మణికుండల చండతేజా:
( వాయు పురాణం )

వాయు పురాణంలో స్పష్టంగా విశ్వకర్మ భగవాణుని పూజంచాలి అతడే ఆధ్యుడు స్వయంభూగ వెలసినవాడు ఈ సృష్టిలోని ప్రతీ మానవుడు విశ్వకర్మ భగవాణుని పూజించాలి.వీరిని పూజిస్తే సమస్త సుఖ సౌఖ్యా భాగ్యాలు కలుతాయని చెప్పడం జరిగినది.వీరి అంశచే విశ్వకర్మలు ఈ లోకానికి ఐదు వృత్తులతో సృష్టికి మూల పురుషులు అవుతున్నారు.ఈ విశ్వబ్రాహ్మణులు కులవృత్తులనే కాకుండా జ్యోతిషం,వాస్తు,పౌరోహిత్యం,వైద్యం,ప్రవీణ్యం కలిగిన ఇంజనీయర్లుగా,అధ్యాపక విద్యావంతులు,కవులు,కళాకారులు మొదలగు వృత్తులలో నిష్ణాతతను చాటుచున్నారు.

విశ్వకర్మ వృత్తులు,ప్రమేయం లేకుండా ఈ సృష్టిలో మానవాళికి మనుగడలేదు.దైవాంశ సంభూతులైన విశ్వబ్రాహ్మణులను వారి వృత్తులను గౌరవించడం అనేది తరతరాలుగా వస్తుంది.జగద్గురువు శంకరాచార్యులు విశ్వకర్మ కులంలోనే పుట్టారు.శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేద్ర స్వాములవారు కూడా విశ్వకర్మీయుడే ఇలాంటి మహామహులు విశ్వకర్మ జాతిలో ఎందరో ఉన్నారు. మహిమాన్వీతులైన విశ్వకర్మీయుల ఇండ్లలో ప్రతి రోజు విశ్వకర్మ భగవాణునికి నిత్యపూజలు జరుగుతుంటాయి..... వారి సేవలు సమాజానికి అందిస్తూ ఉంటారు జై విశ్వకర్మ.

English summary
Vishwakarma Day, also known as Vishwakarma Jayanti or Vishwakarma Puja, is a day of celebration for Vishwakarma, a Hindu god, the divine architect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X