• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యక్తిత్వం-తామరాకు-నీటిబొట్టు: రేపు చూద్దామంటే... ఆ రేపు ఉంటుందో లేదో?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

మనం కొన్ని సందర్భాలలో కలల మేడలు కడుతుంటాం.మెళకువలో మనం కట్టుకునే కలల మేడలే మన వ్యక్తిత్వం, ప్రపంచం. దీనినే అంతర జగత్తు అంటారు.

ఈ కలల మేడలు కట్టక ముందు ఉన్న ఖాళీ స్థలమే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, పరబ్రహ్మము.

మెళకువ పోయి గాఢనిద్ర లోనికి జారినపుడు ఈ వ్యక్తిత్వం ప్రపంచం కనుమరుగౌతాయి.దృష్టి లోంచి తప్పుకుని దృష్టిని విశ్రాంతం చేస్తాయి.మరల మెళకువ ఏర్పడినపుడు దృష్టి లోనికి వచ్చి తదనుగుణంగా అనుభవములను కదిలించి ఉహా భావములను కలిగించి మరల మనం కట్టుకున్న కలల మేడలను దృష్టి లోనికి తీసుకువస్తాయి.

అప్పుడు దృష్టి అంతర్ ముఖం అయ్యి క్రమంగా బహిర్ముఖం అవుతుంది.మనసే అంతర్, బహిర్ముఖములవుతూ అన్ని జ్ఞానములను, విజ్ఞానములను, పరిజ్ఞానములను, కళలను కలల మేడల రూపంలో మనలోపల ఏర్పరచి చూపిస్తూ, భౌతిక ప్రపంచంతో బయట అనుసంధానం కలిగించేది మనసు.మనసు అంతర్గతమైతే వ్యక్తిత్వం, ప్రపంచం కనపడవు. అప్పటికి అన్ని రకాల జ్ఞానములు, కళా నైపుణ్యాలు దృష్టి నుంచి తప్పకుంటాయి. బయటి భౌతిక ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది.

అప్పుడు మనము మానసిక విరామ స్థితిని అనుభవిస్తాము. కలల మేడల నిర్మాణం, మరల గాఢనిద్రలో కనుమరుగై మెళకువ రాగానే విజృంభించే తలపుల రూపమైన వ్యక్తిత్వం, ప్రపంచం, జ్ఞానములు, కళా నైపుణ్యాలు దృష్టిలోకి వస్తాయి.

ఆ విజృంభణ ఆగిపోయి, అది తెలుస్తూ ఉంటే ఆ స్థితిని శాంతానంద స్థితి, లేక మౌన స్థితి లేక మోక్ష స్థితి అంటారు.మోక స్థితిలో మనం కట్టుకున్న కలల మేడలు అదృశ్యమై ఉంటాయి.

అప్పుడు మానసిక స్థలం ఖాళీగా ఉంటుంది. ఖాళీ అయిన మనసే ఆత్మ.నిర్మాణం కరిగిపోయి, లేకుండా పోయి, దానికి ఆధారమైన ఖాళీ స్థలంగా మన మనసు మిగలడమే ముక్తి. నిర్వాణము. వైకుంఠ లేక కైలాస లేక సత్యలోక వాసము.నివాసము.

సమస్త జ్ఞానముల కళా నైపుణ్యముల మొదలు చివర ఆత్మయే పరమాత్మయే. ( శాస్త్ర యోనిత్వాత్ - బ్రహ్మ సూత్రములు

భూః, భువః, సువః, మహః, జనః, తపోలోకాలలో నివసించడమే కలల మేడలలో వసించడం. సంసార తాపత్రయాన్ని వహించడం. వ్యక్తిత్వంతో ప్రపంచానుసంధానంతో కలిగే సుఖదుఃఖానుభవమే సంసారం.

అదే అధ్యాత్మిక జీవనం

అదే అధ్యాత్మిక జీవనం

కలల మేడలలో అవసరమైన దానికన్నా ఎక్కువ సమయం వసించక, కర్మలకు కర్తృత్వం వహించక తామరాకు మీద నీటి బొట్టు వలె జీవించడమే

ఆధ్యాత్మిక జీవనము.

తత్త్వ జిజ్ఞాస, జ్ఞాన సాఫల్యము.

తామరాకు మీద నీటి బొట్టు నిలవదు. అలాగే ఈ జీవితం కూడా క్షణికం.జీవితం చంచలం. ప్రపంచం రోగాలతో, అభిమానాలతో,శోకాలతో నిండి ఉంది.

తామరాకు మీద నీటి బొట్టు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. కానీ ఏ కొద్దిపాటి గాలి వీచినా జారిపోతుంది.మానవుని జీవితం అంతే.అనంతమైన కాలంలో మనిషి జీవిత కాలం క్షణం. ఆ క్షణమాత్రానికే అహంకార మమకారాలతో మనిషి మహిషియై పతనమవటం ఎంతవరకు సమంజసం. ఒక్క క్షణం ఆలోచించి కాలం విలువ గ్రహిస్తే పరతత్త్వ విచారణతో బ్రతుకు ధన్యమవుతుంది. ఈ లోకం శోకమయం.నశ్వరమైన శరీరం రోగాలకు నిలయం. సంసారం విషవలయం.బ్రతుకు భారం నుండి బయటపడాలంటే రోజులో కొద్ది సమయమైనా దైవచింతనకై వెచ్చించి పుణ్యాత్ములమై, ధన్యాత్ములమై, దైవానుగ్రహం పొంది తరించాలి.

అప్పుడే ముత్యానివి అవుతావు

అప్పుడే ముత్యానివి అవుతావు

వాన చినుకును తామరాకుకు అంటుకోదు, ఆవిరి అవదు, నిలిచి పోదు, మెరిసి, మురిసి, అదే జారిపోతుంది.

విచ్చుకొన్న ఆల్చిప్పలో పడిన అదే వాన చినుకు అపురూపమైన రూపాంతరం చెందిదే మంచి ముత్యం.

ఈశ్వర సృష్టి అయిన ఈ జీవితాన ఆయన దృష్టి అయిన

వాన చినుకుని తమో గుణంతో ఆవిరి చెయ్యొద్దు.

సత్యాన్వేషణలో సత్వ గుణానికి సానపట్టి రజోగుణ, తమోగుణాలను

అదిమిపట్టి ( తొక్కిపెట్టి ) సత్వగుణ,రజోగుణ సాకారంతో తమోగుణాన్ని జయిస్తే

నువు తామరాకు మీద నీటి బొట్టు అవుతావు.తర్వాత సత్వగుణ సాకారంతో రజోగుణం జయిస్తే ముత్యానివి అవుతావు.

క్రమంగా సత్వ గుణాన్ని

కూడా విడిచి పెట్టినప్పుడు సత్యం తెలుసుకొని ఆ ఈశ్వరుని (శివం) చేరి నువ్వూ మాలలో ముత్యంగా సుందరంగా అవుతావు !

అపుడు తామరాకు మీద నీటి బొట్టులాంటి జీవితం గడపవచ్చును.

నళినీ దళ గత జల మతి తరళం

తద్వజ్జీవిత మతిశయ చపలం

విద్ధివ్యాద్యభిమాన గ్రస్తం

లోకం శోక హతం చ సమస్తం

.

తామరాకుపై నీటిబొట్టు స్థిరంగా ఉండదు

తామరాకుపై నీటిబొట్టు స్థిరంగా ఉండదు

తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. అటూ ఇటూ కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది.అలాగే మానవ జీవితం నీటిబుడగ లాంటిది. క్షణికమైనది. ఇప్పుడున్నట్టే ఉంటాం. మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే. అనంతకాల ప్రవాహంలో మానవ జీవితం అత్యంత అల్పమైనది. పోనీ ఉన్న కొద్దికాలమైనా సుఖంగా హాయిగా ఉంటామా? లేదు. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం. బాల్యంలో అడిగినవాటిని తల్లిదండ్రులు కొనిపెట్టలేదని ఏడుస్తాం.పెద్దయ్యాక కలిగే కోరికలు తీరకపోతే తీరలేదని తీరితే కొత్త కోరికలు కోరుకుని వాటి కోసం ఏడుస్తాం. వృద్ధాప్యంలో శరీర అవయవాలు పట్టుదప్పి బలం సన్నగిల్లుతుంది దానికీ ఏడుస్తాం.

రేపు చూద్దాం అనుకుంటే.. ఆ రేపు ఉన్నదో లేదో తెలియదు

రేపు చూద్దాం అనుకుంటే.. ఆ రేపు ఉన్నదో లేదో తెలియదు

చివరకు మృత్యువు అనే రాక్షసి పట్టి పీడిస్తుంది. అప్పుడు కూడా ‘అయ్యో అన్నిటినీ వదిలి పోవాల్సివస్తోందే' అని ఏడుస్తాం.

దీన్నే భగవద్గీతలో జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నారు. అందులకే లోకం సమస్తం శోకహతం అన్నారు శంకరాచార్యులవారు. జన్మ ఉండేది కొద్దికాలం. ఆ కాస్త సమయంలో అనేక దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు. ఇలాంటి జీవితంలో ఎక్కువగా ఆశలు పెట్టుకోరాదని.పెట్టుకుని వాటిని తీర్చుకోవడానికి మూఢులు కారాదని చెప్పారు.ఒక్క క్షణం ఈ జీవితాన్ని వృథా చేసినా ఆ క్షణం మళ్లీ తిరిగిరాదని మృత్యువు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుందని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని బోధించారు.

మరైతే మన కర్తవ్యం ఏమిటి ? మానవ జీవిత పరమలక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడకు పోవాలో తెలుసుకోవాలి. ఆ మార్గంలో ప్రయాణించడానికి ఇప్పుడే, ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. ‘రేపు చూద్దాం' అంటే కుదరదు. ఆ రేపు అసలు ఉన్నదో లేదో తెలియదు. భగవత్సంబంధమైన కార్యాల్లో సత్కార్యాలు చేయడంలో జాప్యం ఏ మాత్రం పనికిరాదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Water dot are very beautiful on lotus in lake, life is like water dot on lotus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more