వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోషాలు కలిగిన నక్షత్రాలు ఏవి వాటి ఫలితాలు ఏమిటి ..పుట్టిన పిల్లలపై ప్రభావమెంత..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జననకాల నక్షత్ర దోషాలు

పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషేకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.

1. అశ్విని 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

What are Dosha Nakshatras? Children born under this constellations will have to perform these

2. భరణి 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది.

3. కృత్తిక నక్షత్రములో 3 వ పాదములో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.

4. రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదము తండ్రికి, 3 వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టడం వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలననే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.

5. మృగశిర 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.

6. ఆరుద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.

7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.

8. పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రములో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు. మూడు, నాల్గవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి.

9. ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి, 4 వ పాదము తండ్రికి దోషము. నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.

10. మఖ నక్షత్ర 1 వ పాదములో జననమైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము. 3 వ పాదమున పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.

11. పుబ్బ నక్షత్రములో 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్ర 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.

13. హస్తా నక్షత్ర 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

14. చిత్త నక్షత్రములో 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

15. స్వాతి నక్షత్రమున 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.

16. విశాఖ నక్షత్రము జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును. 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.

17. అనూరాధ నక్షత్రము 1 2 3 4 పాదములలో జన్మించుట వలన దోషము లేదు.

18 . జ్యేష్ట నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి. అందులో ఏ భాగములో పుడితే ఆ భాగ సంబందము కలవారికి తప్పక నాశనము కలుగును.
1 వ భాగములో తాతయ్యకు, 2 అమ్మమ్మకు, 3 తల్లి తోడ బుట్టిన వారికి, మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు, 6 ఎవ్వరికి దోషము ఉండదు, 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు, 8 జాతకునకు, 9 తల్లికి, 10 తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జననమైతే తండ్రికి దోషము. ఇది సమారు 9 నెలలు ఉండును. విశేష శాంతి చేయించాలి .

19. మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును. ఈ నక్షత్రములో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, 3 వ పాదము ధనమునకు నాశనము కల్గించును, 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు. మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి.

పన్నెండు భాగాలలో1 వ భాగము తండ్రికి దోషము, 2 తల్లికి, 3 అన్నలకు, 4 భాగస్వాములకు, 5 పిల్లనిచ్చిన మామగారికి, 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ, పెద్దమ్మలకు మరియు మేనమామలకు. 8 ధనమునకు, 9 జీవన నాశనము, 10 దరిద్రమును కల్గిస్తుంది, 11 భ్రుత్యులు, 12 జాతకునికి నాశనము కలుగ చేయును.

జ్యేష్ట ,మూలా నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును. నవ గ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.

20. పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2 , 3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము. 4 వ పాదమున జననము దోషము లేదు.

21. ఉత్తరాషాడ నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

22. శ్రవణం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

23. ధనిష్ట నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

24. శతభిషం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

25. పూర్వాబాద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు. నాల్గవ పాదము సామాన్య దోషము .

26. ఉత్తరాభాద్ర నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

27. రేవతి నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు. 4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి.

* ఈ నక్షత్రములనే కాక ప్రేగులు మేడలో వేసుకుని పుట్టిన, కాళ్ళు మొదట బయటకు వస్తు జననం జరిగినా, దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందునూ, గ్రహణ సమయములలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట మఖ్యము.

* జన్మ పత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి:- శిశువు జన్మించిన తర్వాత 'పురుడు' అయిన తరవాత జన్మ పత్రిక వ్రాయించుకుని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష పండితుని అడిగి తెలుసుకుని... శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురౌతుంటాయి. సాధ్యమైనంత తొందరలో జరిపించుకోవడం ఉత్తమం.

* శిశువు 12 సం.రాలు దాటిన తర్వాత ద్వాదశ భావ ఫలితాలు గురించి తెలుసుకోవాలి.

* శిశువుకు 16 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత సంపూర్ణ జాతక విషయాలను అడిగి తెలుసుకోవాలి.

* అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుడిని సంప్రదించి జాతక చక్రం వేయించుకుని జాతక ఫలితాలు తెలుసుకున్నాకా పండితుడికి స్వయం పాకం, దక్షిణ, పండ్లు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.

English summary
Children born under the constellations of Dosha must perform Nakshatra Japa, Nava Graha Shanti, Homa, Shade in Oil, Rudrabhishekam, etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X