వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనిపోయినవారి ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?

ఏ దేవునిమాలలో ఏ దారాలు వాడాలి? , చనిపోయినవారి ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?, ఉప్పును ఎందుకు దొంగిలించ రాదు?, నిద్రలేవగానే ముందు ఎవర్నిచూడాలి? లాంటి విషయాలపై చాలా మందికి అనేక సందేహాలుంటాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏ దేవునిమాలలో ఏ దారాలు వాడాలి? , చనిపోయినవారి ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?, ఉప్పును ఎందుకు దొంగిలించ రాదు?, నిద్రలేవగానే ముందు ఎవర్నిచూడాలి? లాంటి విషయాలపై చాలా మందికి అనేక సందేహాలుంటాయి. వాటికి సమాధానం క్లుప్తంగా..

ఏ దేవునిమాలలో ఏ దారాలు వాడాలి?

ఏ దేవునిమాలలో ఏ దారాలు వాడాలి?

విష్ణుమాలలో నల్లటి దారము పటుది గాని, నూలు దారం గాని వాడాలి. అమ్మవారికి ఎర్రటి పట్టుదారం మాలగానూ, పరమశివునకు పసుపు ఊలుదారమూ, సూర్యభగవానుడికి పట్టుదారముగాని నూలుదారం గాని, వినాయకుడికి ఆకుపచ్చ పట్టుదారమూ, నూలు దారమూ వాడాలి. ధరించే వ్యక్తిగాని లేదా తన ఇంటిపేరుతో ఉన్నవారు గాని దారాన్ని చుట్టాలి. తనకోసం తనచుట్టింది ధరించటం అత్యంత శక్తివంతమైనవి. వేరే ఏవరైనా చుట్టిన మాలధరించే ముందు పంచగవ్యములతో శుద్ధిచేసి ధరించాలి.

చనిపోయినవారి ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?

చనిపోయినవారి ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?

నేనెంతో ధనం సంపాదించాను. ఒక్కపైసా కూడా తీసుకెళ్ళటం లేదు. రేపు మీ ధనమయినా ఇంతే. కనుక ధర్మంగా న్యాయంగా, జీవిస్తూ పదిమందికీ సాయంచేసి పోవటమే అసలు మానవధర్మం. కనుక మీరయినా స్వార్థచింతనలకు దూరంగా ఉండి, పదిమందికి మేలు చెయ్యండి అని.

ఉప్పును ఎందుకు దొంగిలించ రాదు

ఉప్పును ఎందుకు దొంగిలించ రాదు

ఉప్పును దొంగిలించడమే కాదు, కాళ్ళతో త్రోక్కరాదు. అలాగే చేబదులు కూడా తీసుకోరాదు. ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఉప్పు శనీశ్వరుని ప్రతిరూపము. పూర్వం ఉప్పు దొరికేదికాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి శనీశ్వరుని అంశగానూ, యమధర్మరాజు ప్రతిరూపంగానూ చెప్పేవారు. అలా చెప్పటం వల్ల ఆ రోజులలో ఉప్పును చేబదులు అడిగేవారు కాదు. దొంగిలించేవారు కూడా కాదు.

నిద్రలేవగానే ముందు ఎవర్నిచూడాలి?

నిద్రలేవగానే ముందు ఎవర్నిచూడాలి?

విద్యావేత్తనూ.. సుమంగళినీ. ఆవునూ. అగ్నిమండపం చూస్తే ఆరోజంతా మంచి ఫలితాలు కలుగుతాయి. నదినీ, సముద్రాన్నీ సరస్సునూ చూస్తే అన్ని దోషాలుతొలగి పోతాయి. పెరుగూ, నెయ్యి, ఆవాలూ, అద్దము వంటి వాటిని చూడరాదు. అలా చూస్తే అశుభం. అలాగే ముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యంగా జీవిస్తారు.

English summary
What are the best things to see after waking up in the morning?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X