• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆవుపాలతో ఆరోగ్యమెంతో తెలుసా..? గంగిగోవు పాలు గరిటడైనను చాలు అని ఎందుకన్నారు..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని, అవి ఎన్నడూ ఎవరిచేతా దొంగిలింపబడరాదని, దుష్టుల వాతపడగూడదని, అధిక సంతతి పొందాలని, యజుర్వేదంలో గోవుల గురించి వాటి పరిరక్షణ గురించి వ్యక్తం చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవని, ధన సంపదలువృద్ధి పొందగలవని ప్రశంసించబడింది.

 ఆవుపాలల్లో ఔషధ గుణాలు

ఆవుపాలల్లో ఔషధ గుణాలు

ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు.గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రంలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలే శరణ్యం. ఈ ఆవు పాలను ఆహారంగానే కాకుండా అరాద్యంలోను అనగా పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు.

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అన్న నానుడి ప్రకారం ఆవుపాలు అమ్మ పాలలాగ ఎంతో శ్రేష్టమైనవి, ఇతర జంతుల పాలకంటే ఆరోగ్యకరమైనవి. ఆయుర్వేదము నందు ఆవుపాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆవుపాలు పలచగా ఉండి త్వరగా జీర్ణం అగును. శిశువులకు తల్లిపాలు లభించని పక్షంలో ఆవుపాలు పట్టడం అత్యంత శ్రేయస్కరం . ఒక వంద గ్రాముల ఆవుపాల నుంచి 60 కేలరీల శక్తి లభిస్తుంది. వంద గ్రాముల ఆవుపాలలో పిండిపదార్ధాలు 5 గ్రా , ప్రోటీన్స్ 3 గ్రా , ఫాట్స్ 3 .5 గ్రా , ఫాస్ఫరస్ 87 మి.గ్రా , క్యాల్షియం 120 మి.గ్రా , ఐరన్ 0 .3 మి.గ్రా , సోడియం 34 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , A విటమిన్ 170 LU లు B1 - 55 మి.గ్రా , B2 - 200 మి .గ్రా , B3 - 4 .8 మి.గ్రా , నియాసిన్ - 3 మి.గ్రా , కొలెస్టరాల్ 11 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం అగుటకు 2 గంటలు పడుతుంది. ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులలో మన శరీరానికి అవసరం అయిన అని" ఎమైనో యాసిడ్స్" పుష్కలంగా లభించును. పైన చెప్పిన వివిధ మోతాదుల్లో మన శరీరానికి అవసరం అయిన ఎన్నో విలువైన విటమిన్లు , ధాతువులు మనకి లభ్యం అగును. ఇప్పుడు మీకు ఆవుపాల గురించి వివరణయే కాక ఆయుర్వేదం నందు ఆవుపాలతో వైద్యప్రక్రియలు కూడా వివరిస్తాను .

 ఆవుపాలతో వైద్యప్రక్రియలు

ఆవుపాలతో వైద్యప్రక్రియలు

* ఆవుపాల యందు ఫాస్ఫెట్స్ , క్యాల్షియం , పొటాషియం వంటి ఖనిజ లవణాలు సమృద్దిగా ఉన్నాయి . ఎముకలు , కండరాల పెరుగుదలలో ఇవి ప్రముఖపాత్ర వహిస్తాయి. ఆవుపాలలో ఐరన్ మాత్రం చాలా తక్కువ శాతములో లభించును. కాబట్టి ప్రతిరోజూ ఆవుపాలు ఆహారంగా స్వీకరించేవారు ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవాలి .

* ఆవుపాలలో " కాసినోజిన్ " మరియు "లాక్టాల్ అల్బుమిన్ " అను మాంసకృత్తులు ఉన్నాయి . పాలలో ఉన్న మాంసకృత్తులు మన శరీరానికి అత్యవసరం .

* ఆవుపాలలో ఉన్న మాంసకృత్తుల వలన మన శరీరంలో "వ్యాధినిరోధక శక్తి " పెరుగుటయే కాక మాంసకృత్తులు శరీరంలో లోపించిన సందర్భాలలో అవి భర్తీ చేయబడును.

* ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులు చిన్నపిల్లలకు , గర్భిణీ స్త్రీలకు , పాలిచ్చు బాలింతలకు , జీర్ణశక్తి లోపించిన వారికి , శస్త్రచికిత్స చేయించుకున్న వారికి అత్యంత అవసరం.

* క్షయ , మధుమేహం , క్యాన్సర్ , ఉబ్బసం , నిద్రలేమి , నరాల బలహీనత లాంటి దీర్ఘకాల వ్యాదులలో ఆవుపాల యందు ఉన్న మాంసకృత్తులు దివ్యౌషధంలా ఉపయోగపడును.

  గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత
   ఆవుపాలతో ఇతర ఉపయోగాలు

  ఆవుపాలతో ఇతర ఉపయోగాలు

  * పాలయందు ఉన్న పదార్ధాలలో మాంసకృత్తుల తరువాత కొవ్వు ముఖ్యమైన పదార్థంగా చెప్పుకోవచ్చు . పాలలో కొవ్వు కరిగి ఉండుటచేత పాలకు తెలుపు రంగు ప్రాప్తించింది . పాలలో ఉండు కొవ్వు మన శరీరంలో తేలికగా జీర్ణం అగును. కొవ్వు తీసిన పాలను " skimmed milk " అంటారు.

  * పాలలో ఖనిజ లవణాలతో పాటు సిట్రిక్ ఆసిడ్ కూడా క్యాల్షియం , మెగ్నిషియంలలో మిళితమై పుష్కలంగా ఉంటుంది. ఈ ఆసిడ్ కడుపులో కురుపులు రాకుండా ఆపడంలో ప్రముఖపాత్ర వహించును.

  * ఆవుపాలతో పాటు 2 ఖర్జురాలు కలిపి సేవిస్తుంటే ఐరన్ , క్యాల్షియం , ఫాస్ఫరస్ వంటి మినరల్స్ మరియు సాల్ట్స్ మన శరీరానికి పుష్కలముగా లభించును.

  * ఆవు పాలలో విటమిన్‌ 'ఏ' తో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గేదెల కంటే ఆవులు ఎక్కువ కాలం పాలు ఇస్తాయి. రోజువారీ పోషణ ఖర్చు తక్కువ, రోజుకు 20 లీటర్ల వరకూ పాలు ఇస్తాయి. పోషక విలువలు అధికం. గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ. సంకర జాతి ఆవు పాలలో వెన్నశాతం 3.5 ఉండగా, జెర్సీ ఆవు పాలలో 4.5 శాతం, గేదె పాలలో 6 నుంచి 9 శాతం వరకూ వెన్న ఉంటుంది.

  English summary
  Cow's milk, yoghurt, ghee, manure and urine are known to have many medicinal properties. The nutritional and health benefits of cow's milk, yogurt and ghee are well known
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more