వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినాలు.. అవేంటో తెలుసుకోండి..!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శివ కేశవులకు అభేదం లేదని నిరూపించే మాసం కార్తీక మాసం, ఈ మసానికి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం అంటేనే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం వంటివి చేయడం వలన జన్మ జన్మల పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకునే మహిమాన్వితమైన మాసంగా భక్తులు విశ్వసిస్తారు.

చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది.

What are the important days in Karthikamasam

"న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్" అని స్కంద పురాణంలో చెప్పబడింది. అనగా "కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం. కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం.ఈ ఏడాది నవంబర్ 16, సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. సోమవారంతో కార్తీక మాసం ప్రారంభం అవటంతో భక్తులు అత్యంత ప్రముఖమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఈనెలలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఒకసారి చూద్దాం.

నవంబర్ 16నుండి కార్తీక మాసం ప్రారంభం
నవంబర్ 16 కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం
నవంబర్ 18 బుధవారం నాగుల చవితి
నవంబర్ 20 శుక్రవారం తుంగభద్ర పుష్కరములు ప్రారంభం
నవంబర్ 21 శనివారం శ్రవణా నక్షత్రం కోటి సోమవారం పూజ
నవంబర్ 23 రెండవ సోమవారం
నవంబర్ 25 బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశి
నవంబర్ 26 గురువారం చిల్కు ద్వాదశి
నవంబర్ 28 శనివారం శనిత్రయోదశి
నవంబర్ 29 ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం
నవంబర్ 30 మూడవ కార్తీక సోమవారం, పౌర్ణమి

డిసెంబర్ 4 శుక్రవారం సంకష్టహర చతుర్థి
డిసెంబర్ 7 నాలుగవ సోమవారం
డిసెంబర్ 10 గురువారం ఉపవాస ఏకాదశి
డిసెంబర్ 11 శుక్రవారం గోవత్స ద్వాదశి
డిసెంబర్12 శనివారం- శనిత్రయోదశి
డిసెంబర్ 13 ఆదివారం మాసశివరాత్రి
డిసెంబర్ 14 ఐదవ సోమవారం, అమావాస్య సోమవార వ్రతం
డిసెంబర్ 15 పోలిస్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి
డిసెంబర్ 20 ఆదివారం సుబ్రహ్మణ్యషష్ఠి పూజ

అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో హిందూవులు ఈ పూజలను ఆచరిస్తారు. ఈ మాసంలో అత్యంత నిష్టానియమాలతో ఉంటారు. శాఖాహార భోజనాలకే ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు. విరివిగా దానధర్మలు చేసి మానవత్వం చాటుకుంటారు. ఈ మాసంలో ఎక్కువ చల్లగాలులు వీస్తాయి కాబట్టి నిరుపేదలకు, అనాధాలకు వెచ్చటి స్వెటర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి.

English summary
Here is the list of important days in Karthika masam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X