• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంటి ప్రధాన గుమ్మంకు పాటించాల్సిన వాస్తు సూత్రాలేంటి..? వచ్చే అనర్థాలేంటి..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనం నివసించే ఇంట్లో ప్రశాంతత వాతావరణం కొనసాగాలంటే కొన్ని శాస్త్ర సూచనలు పాటించాల్సి ఉంటుంది. వాస్తుశాస్త్రంలో ఇంటి యొక్క ప్రతి మూల గురించి ప్రత్యేక విషయాలు విశీదికరించారు. ఇంట్లోని ప్రతి భాగానికి ప్రత్యేక వాస్తు ప్రాముఖ్యత ఉన్నట్లు భావిస్తారు. మనం ఇల్లు నిర్మించేటప్పుడు ఆ సమయంలో వాస్తు నియమాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. అదే విధంగా ఈ రోజు మనం ఇంటి ప్రధాన ద్వారం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. దీని ద్వారా మాత్రమే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది, ప్రతికూల శక్తి బయటకుపోతుంది. ఈ నేపథ్యంలో ఇంటి ప్రధాన ద్వారం గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరమేంటో గమనిద్దాం.

​ఇంటి ముఖద్వారానికి ముత్యం, పగడం, వెండి తీగను అమర్చుకోవాలి

​ఇంటి ముఖద్వారానికి ముత్యం, పగడం, వెండి తీగను అమర్చుకోవాలి

ఇంటి ప్రధాన ద్వారం నిర్మిస్తన్నప్పుడు వాస్తును జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రధాన ద్వారాన్ని తయారు చేసేటప్పుడు ఫ్రేమ్ కుడివైపు శేరెడు గడపకు చేసిన తోల్లలో వెండి తీగను, ముత్యం, పగడం వేయాలి. ఇది చాలా పవిత్రంగా శుభకరంగా పరిగణించబడుతుంది. వెండి ఇంటి శ్రేయస్సును పెంచుతుంది. ప్రధాన తలుపు ఫ్రేమ్ తయారు చేసేటప్పుడు వెండి తీగను ఉంచడం వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఫలితంగా డబ్బు కొరత అస్సలు ఏర్పడదు. వెండిని చల్లదనానికి చిహ్నంగా భావిస్తారు. ఫలితంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు ప్రేమగా జీవిస్తారు.

 ​ప్రధాన ద్వారాలను కర్రతోనే తయారు చేయాలి

​ప్రధాన ద్వారాలను కర్రతోనే తయారు చేయాలి

ఇంటి ముఖ ద్వారం విషయంలో గమనించదగ్గ మరో విషయం ఏంటంటే ప్రధాన గుమ్మం ఎప్పుడూ కర్రతోనే తయారు చేయించుకోవాలి. కలపకు ఉండే ప్రత్యేక గుణం బయట నుండి వచ్చే ప్రతికూల శక్తులను నిరోధిస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తుంది. చెక్క వాస్తు పరంగా మరింత పవిత్రంగా పరిగణింపబడుతుంది. ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటే చెక్కతో తయారు చేసిన ప్రధాన ద్వారం తొలగిస్తుంది.

గుమ్మానికి గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకలు

గుమ్మానికి గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకలు

ఇంటి ప్రధాన గుమ్మానికి లోపలి వైపు గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకల పటాన్ని అమర్చుకోవాలి. ఈ అమ్మవారి పటం వెనక భాగంలో భోజపత్రంపై శక్తి పీఠాలకు సంబంధించిన యంత్రం అమర్చబడి ఉంటుంది కావున ఇంట్లోకి చెడు ఎనర్జీ , దుష్ట శక్తుల చెడు ప్రభావం ఇంటిపై సోకకుండా కాపాడుతుంది, ముఖ్యంగా నరదృష్టి తగలకుండా రక్షిస్తుంది. ఈ ఐశ్వర్య కాళీ అమ్మవారి పాదుకలు నకిలీవి పెట్టడం వలన ఉపయోగం ఉండదని గ్రహించాలి. అమ్మవారి పాదుకల చిత్రపటంలో తప్పకుండా గోమాత ఉండాలి, శక్తి పీఠాలకు సంబందమైన యంత్రాలు ఉండి లోపలి వైపు భోజపత్ర యంత్రం తప్పక ఉండాలి. పంచ భుతాలకు సంబంధించిన విశ్వకర్మ పతాకం ఉండి తీరాలి ఇవన్ని ఉన్న పాదుకల ఫోటో ఉంటేనే పై తెలిపిన శుభ ఫలితాలు వర్తిస్తాయి. ఈ అమ్మవారి పాదుకల పటాన్ని స్వంత ఇళ్ళలో వ్యాపార సంస్థలలో, అద్దె ఇళ్ళలో ఉన్ననూ పెట్టుకోవచ్చును.

ముఖ ద్వారాన్ని ఎలా అలంకరించాలి

ముఖ ద్వారాన్ని ఎలా అలంకరించాలి

ఇంటి ప్రధాన గుమ్మం చాలా శుభ్రంగా ఉంచుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఓం, స్వస్తిక్ లాంటి ఆధ్యాత్మిక చిహ్నాలను ఇంటి ముఖ ద్వారం వల్ల తప్పని సరిగా ఉంచితే మంచి జరుగుతుంది. ఈ విషయాలన్నీ సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి. ప్రధాన ద్వారం వద్ద వీటిని వర్తింపజేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి పెంపొందుతాయి.

 గుమ్మానికి ​నలుపు రంగు వాడకూడదు

గుమ్మానికి ​నలుపు రంగు వాడకూడదు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి నలుపు రంగు ఉపయోగించరాదు. ఎందుకంటే నలుపు ప్రతికూల శక్తిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇంటి ముఖ ద్వారానికి ఎల్లప్పుడూ లేత రంగులు మాత్రమే వాడాలి. ఇలా చేయడం ద్వారా ఇంటి యజమాని ఒత్తిడి లేకుండా ఉంటారు. ఇంట్లో ఎలప్పుడూ సద్భావనతో ఉండడం జరుగుతుంది. పై తెలిపిన పద్దతుల ప్రకారం మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఆనందదాయకంగా జీవితాన్ని కొనసాగించు కోగాలుగుతాము.

English summary
If we want to maintain a calm atmosphere in the house where we live, we have to follow some scientific instructions. In architecture special things are elaborated about each corner of the house. Each part of the house is considered to have special architectural significance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X