వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిళ్లలో చేస్తున్న ప్రధాన పొరపాట్లు ఏంటి..? శాస్త్రీయ పద్ధతిలో వివాహాలు జరగడం లేదా..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఏడడుగుల బంధం ఎంత పవిత్రమైనదో మన సనాతన ధర్మాలు, ఋషులు మనకు తెలియజేసారు. ఆధునికత అనే పేరుతో పరదేశపు విష సంస్కృతీ మోజులో పడి అగోచర గమ్యంలో కొట్టు మిట్టాడుతూ మన శాస్త్ర విలువలను మరచి అదోగతి పాలై తను సుఖంగా ఉండలేక, తలిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రశాంతత లేని జీవనం సాగించడానికి గల కారణాలు ఏమిటో గమనిద్దాం ఏడడుగుల బంధానికి ఏడు సూత్రాలు తెలియజేయడం జరుగుతుంది.

1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం:- దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం, భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం.

What are the mistakes committed during Indian weddings ?

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం.

ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం. వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం,ఫోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి.

3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం.

ఫలితం:- దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం.

4. తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం.

ఫలితం:- దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు.

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం.

ఫలితం:- దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం.

6. బఫే భోజనాలు.

ఫలితం:- దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.

7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం.

ఫలితం:- దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం.

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి. శాస్త్రీయమైన ఒక మంచి విషయం అందరికి తెలియజేయండి, చెప్పకపోతే తప్పు మనది అవుతుంది, చెప్పినా వారు పాటించక పోతే వాల్ల కర్మ. ఇవన్ని శాస్త్రంలో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పాటించకుండా ఉంటే ఏమి జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. అందరూ భారతీయ హిందు వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేటట్లుగా ఇతరులకు తెలియజేస్తూ, మీరూ సధర్నాన్నిఆచరింపచేస్తారని ఆశిస్తూ...జై శ్రీమన్నారాయణ.

English summary
Our rituals and sages have informed us how sacred a Marriage relationship is. Seven principles of the marriage relationship say how to to live a peaceful life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X