వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణపతి బప్పా 'మోరియా' ఎందుకంటామో తెలుసా?: దాని వెనుక కథ..

సూర్యభగవానుని అనుగ్రహమున రాణి గర్భము దాల్చెను.

|
Google Oneindia TeluguNews

గణపతి బప్పా'మోరియా' అనే పదానికి వెనుక కథ
శ్రీమోరేశ్వర్ లేక శ్రీ మయూరేశ్వర్- మోర్గాం

పూర్వము చక్రపాణి అను రాక్షస రాజు గండకిని పరిపాలించుచుండెను. అతని భార్య ఉగ్ర, వారికి పిల్లలు లేనందున శానక మహాముని సూచనమేరకు భార్యాభర్తలు సూర్యోపాసన చేసిరి. సూర్యభగవానుని అనుగ్రహమున రాణి గర్భము దాల్చెను. గర్భమందున్నపిల్లవాడు సూర్యునివంటి వేడితో ఉండుటచేత భరించలేక ఆ గర్భమును ఆమె సముద్రమునందు వదలెను.

సముద్రమున జన్మించిన ఆపిల్లవానిని సముద్రుడు బ్రాహ్మణరూపమున వచ్చి, చక్రపాణి దంపతులకు సమర్పించెను. సముద్రములో పుట్టిన ఆపిల్లవానికి, వారు సింధు (సముద్రము) అని నామకరణము చేసిరి. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడై 2000 సంవత్సరములు తపస్సుచేసి, సూర్యుని నుండి అమృతమును పొందెను.

What does "Morya" mean when they say "Ganpati bappa Morya" during Ganeshotsav?
సూర్యునివరముచే అమృతం పొందాడు, అమృతము అతని ఉదరంబున ఉన్నంతకాలము, అతనికి మృత్యు భయము లేకుండెను. ఈ ధైర్యముతో సింధురాసురుడు తన పరాక్రమముతో ముల్లోకములను జయింపవలెనని సంకల్పించెను. ముందు దేవతలను జయించి వారిని కారాగారములో బంధించెను. తరువాత కైలాసము, వైకుంఠములపై దండెత్తెను.

పార్వతీపరమేశ్వరులు గూడ సింధురాసుని బాధలుపడలేక కైలాసమును వదలి, మేరుపర్వతమున ఉండసాగిరి. సింధురాసురుడు శ్రీ మహావిష్ణువును తన గండకి రాజ్యములో ఉండుమని ఆజ్ఞాపించెను.
ఈ పరిస్థితులలో దేవగురువైన బృహస్పతి, సింహారూఢుడు, పది చేతులు కలవాడు అయిన వినాయకుని ప్రార్ధించి, ఆయనను శరణు పొందుడని దేవతలకు సలహాయిచ్చెను. వారు అట్ల చేసిరి. వారి ప్రార్థనలను మన్నించి, గణపతి సాక్షాత్కరించి, తాను పార్వతీదేవికి కుమారుడుగా జన్మించి, సింధురాసురుని చంపెదనని మాట యిచ్చెను.

మేరు పర్వతమున, పరమేశ్వరుని ఉపదేశానుసారముగా పార్వతి 12 సంవత్సరములు గణేశ మంత్రమును జపించెను. ఆ జపమునకు సంతుషుడై గణపతి పార్వతికి ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారము ఆమెకు పుత్రుడుగా జన్మించి, సింధురాసురుని చంపెదనని వాగ్దానము చేసెను. అట్లే ఒక భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి పుత్రుడుగా జన్మించెను. ఆ పుత్రునకు గణేశుడు అని నామకరణము చేసిరి.

కొంతకాలమునకు సింధురాసురుని మిత్రుడగు కమలాసురుడు శివునిపై యుద్దమునకు వెడలెను. అప్పడు గణపతి నెమలి వాహనారూఢుడై కమలాసురునితో ఘోరయుద్ధము చేసెను. కమలాసురుని నేత్తురునుండి అనేక మంది రాక్షసులు ఉద్భవించుటచే, అతనిని చంపుట కష్టమయ్యెను.

అప్పడు గణపతి బ్రహ్మదేవుని పుత్రికలైన బుద్ధి, సిద్దులను స్మరించి, వారిని కమలాసురుని నెత్తురు నుండి పుట్టుచున్న రాక్షసులను ప్రింగివేయుడని కోరెను. అట్ల వారి సహాయముతో గణపతి కమలాసురుని ఎదుర్కొని వాని శిరస్సును ఖండించెను. ఆ శిరస్సు మోర్గాంక్షేత్రమునందు పడెను.
తరువాత, గణపతి పార్వతీ పరమేశ్వరులతో కలిసి గండకికి వెళ్ళి, దేవతలను చెరసాలనుండి విడిపింపుము-అని సింధురాసురునకు ఆజ్ఞయిచ్చెను.

అతడు ఆ ఆజ్ఞను పాటించనందున, అతనితో 3 రోజులు గణపతి ఫనోరయుద్దము చేసెను. చివరకు సింధురాసురుడు ఖడ్లము ధరించి గణపతి వైపు పరుగెత్తెను. అప్పడు గణపతి చిరు రూపమును ధరించి, నెమలి వాహనమును వీడి, క్రింద నుండి సింధురాసురుని ఉదరముపై ఒక బాణము వేసెను. అది అతని ఉదరమును చీల్చి వైచెను. వెంటనే ఉదరములో ఉన్న అమృతమంతయు బయటకు వచ్చెను. దానితో సింధురాసురుడు మరణించెను. దేవతలు ఆనందించి, గణపతిని పూజించి కొనియాడిరి.

అప్పడు మోర్గాంక్షేత్రమునందు దేవాలయమును నిర్మించి, గణపతి విగ్రహమును ప్రతిష్టించెను. ఈ విధముగా మోర్గాం, మోరేశ్వర్ గణపతి పుణ్యక్షేత్రమైనది. గణపతి మయూర వాహనముపై వచ్చినందున, ఆయనకు మయూరేశ్వర్ అనుపేరుకూడ వచ్చినది.

మరాఠీ భాషలో మోర్' అనగా నెమలి. ఆ ప్రదేశమునందు నెమళ్ళు ఎక్కువగా ఉండుటచేత, ఆ గ్రామమునకు మోర్గాం' అను పేరు వచ్చినది. నెమలిని వాహనము చేసికొనినందులకు, గణపతి మోరేశ్వర్ అయినాడు. అందుకే 'గణపతి బప్పా మోరియా' అని భక్తులు అంటారు.
ఈ కథను చెప్పెడివారికి, వినువారికి, చదువు వారికి శ్రీమోరేశ్వరానుగ్రహముచే సమస్త కోరికలు ఫలించును, ధన సంపత్తి, యశస్సు ప్రాప్తించును.
గమనిక: మోర్గాం పూణేకు 79 కిలోమీటర్ల దూరములో ఉన్నది. పూణే జిల్లాలో బారామతి తాలూకాలో ఉన్నది.

English summary
Morya Gosavi the famous devotee of Lord Ganesh of the 14th century who lived in Chincwad, Pune.He was a crazy devotee of Lord Ganesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X