• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బల్లి పడితే ఏం చేయాలి ? దోష నివారణం ఏంటీ ?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వెలుతూరుకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరూ కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. ఇక అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే బల్లి కూడా శకునం పలుకుతుందనీ, బల్లిపాటుకి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

ఇంట్లో బల్లి చేసే శబ్ధాలు, శరీరంపై పడితే .. జరిగే ఫలితాలను జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని శాస్త్రం చెబుతోంది.

ఇక ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభ కార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని చెప్పవచ్చు. పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన విషయం తెలిసే అవకాశం ఉంది.

ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధగ్రహ ప్రభావంతో బంధువులు రాక ఉంటుంది. స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు వంటి శుభ ఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి.

What Happen if Lizard Falls on us

బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా, చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేయాలి. దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి క్రిందకు దిగితే మంచిది కాదు. క్రింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది.

శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాలందు బల్లి పడటం వల్ల వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. తల మీద పడితే కలహం, బ్రహ్మరంధ్రం మీద భయం, జుట్టు మీద అయితే కష్టం, వెనుక జుట్టు మీద పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి.

ఇక ముఖంపైన పడితే బంధుదర్శనం, కనుబొమ్మల మీద కలహం. కుడి కన్ను మీద ఓటమి, ఎడమ కన్ను మీద అవమానం. కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The lizard is usually found on all the walls of the house. It takes food insects that are coming home. So no body will do the idea of ​​pulling them out of the house. And they do not care too much because they are not harmful. However, science says that the lizard is also a source of evil and the result of a fall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more