• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గురు గ్రహం వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ఆ రాశి వారికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గురు గ్రహం వక్రమార్గంలో కదులుతున్న క్రమంలో రాశి చక్రంలో ద్వాదశ రాశులపై ఏ విధంగా ప్రభావం చూపనున్నది . మరి గురు గ్రహం వ్యతిరేక దిశలో ప్రయాణాన్ని గురు గ్రహం తిరోగమనం అంటారు, దీనినే ఆంగ్లంలో Jupiter Retrograde అని పిలుస్తారు. ఈ వ్యతిరేఖ ప్రయాణం వలన ఎలాంటి ఫలితాలు ఉండబోనున్నాయో పరిశీలిద్దాం.

మే 14 తేది నాడు గురుడు వ్యత్రిరేక దిశలో కదులుతున్నాడు. దేవ గురువుగా ప్రఖ్యాతిగాంచిన గురుడు శనిగ్రహ రాశి అయిన మకరంలో తిరోగమిస్తున్నాడు. ఫలితంగా ఉన్న 9 గ్రహాల్లో 6 గ్రహాలు వ్యతిరేకంగా భ్రమిస్తున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆరు గ్రహాలం ఇలా సంచరించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దీని వలన రాశులపై శుభాశుభ ప్రభావం పడుతుంది. గురు గ్రహం వ్యత్రిరేక దిశలో సంచారం వలన ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనిద్దాం.

జాతకంలో గురువు బలహీనంగా ఉంటే సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్టపెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట, నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్నిపెంచి పెద్దది చేస్తాడు.

వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించవచ్చు.

మేషరాశి వారికి :-

మేషరాశి వారికి :-

గురుగ్రహం తిరోగమనం వలన ఈ రాశి వారు ఉద్యోగంలో కొంతమేరకు ఒత్తిడి తగ్గుతుంది. అయితే కొన్ని కారణాల వలన చేయాల్సిన కొన్ని పనులు వాయిదా పడే అవకాశముంది. కెరీర్ పరంగా మరోసారి ఆలోచించకోవాల్సిన అవసరముంది. అంతే కాకుండా సమాజంలో మీ పేరు ప్రతిష్టలను మెరుగు పరచుకోవాల్సి ఆవసరం ఉంది. ప్రేమ వ్యవహారంలో ఒక నిర్ణయానికి రావడం కష్టంగా మారుతుంది, ఎటూ తొందరగా తేల్చుకోలేక పోతారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి మరింతగా ఆలోచించస్తారు. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరించడం ఉత్తమం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​వృషభరాశి వారికి :-

​వృషభరాశి వారికి :-

ఈ రాశి వారుకు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఫలితం సరిగ్గా ఉండవు. కాబట్టి ఈ సమయంలో కొత్తగా ప్రయత్నించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు. ప్రజాకర్షణ కలిగిన వారు. అయితే గ్రహాల తిరోగమనం వల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటీకి, ప్రయత్న లోపం లేనప్పటికీ అంతగా విజయవంతం కాకపోవచ్చు. దాంపత్య జీవితంలో కొంచెం సహనంతో ఉంటే పరిస్థితి మెరుగుపడుతుంది. స్వంత నిర్ణయాలు పనికిరావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​మిథునరాశి వారికి :-

​మిథునరాశి వారికి :-

వ్యాపారస్థులు కొత్త ఒప్పందాలకు అంగీకరిస్తారు. ప్రభుత్వ కార్యాలతో సతమవుతున్న వారికి ఈ సమయంలో ప్రయోజనం చేకూరుతుంది. కొత్త ఆదాయ వనరులను కనుగొంటారు. విశ్వాసంగా ముందుకు సాగితే ప్రయోజనం చేకూరుతుంది. తొందరపాటు పడకుండా నిధానంగా ఆలోచించి వ్యవహారాలు చక్కపెట్టుకోవాల్సి ఉంది. అవకాశాలు పొందడం కోసం ఈ సమయంలో మిమ్మల్నీ మీరు నిరూపించుకోవాల్సి ఉంది. ఫలితంగా గురు గ్రహం ప్రభావంతో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 ​కర్కాటకరాశి వారికి :-

​కర్కాటకరాశి వారికి :-

గురు గ్రహం తిరోగమనం వల్ల మీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది . ఉద్యోగం చేసే స్థలంలో సహోద్యోగులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తత్ కారణంగా అక్కడ వివాదాలు తలెత్తే అవకాశముంది. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితుల ద్వారా ఆటంకాలను సమర్థంవంతంగా ఎదుర్కొంటారు. గురువుల సూచనలు పాటించండి, సహణం అవసరం అని గ్రహించండి. దైవానుగ్రహము కొరకు గురుగ్రహ హోమం జరిపించండి. ఆదాయ వనరులు బాగా ఉన్నప్పటికీ ఖర్చును మాత్రం అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 ​సింహరాశి వారికి :-

​సింహరాశి వారికి :-

ఈ సమయంలో సింహ రాశి వారికి అనుకూలిస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా దోహదపడుతుంది. మీరంటే ఇష్టపడే వారిని గౌరవించండి. మీ గురించి మీరు ఆలోచించుకుని తగిన ముందడుగులు వేయాల్సిన సమయమిది. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం విభిన్నంగా ఆలోచిస్తారు. ఇతరుల నుండి మద్దతు తీసుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రేమ వ్యవహారంలో కొంచెం అయోమయ పరిస్థితిలో ఉంటారు, త్వరగానే ఆ స్థితి నుంచి బయటపడతారు. మొండి తనం పక్కన పెట్టి శ్రేయోభిలాషుల మాట వినడం ఉత్తమం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​​కన్యరాశి వారికి :-

​​కన్యరాశి వారికి :-

గురు గ్రహం తిరోగమనం వలన కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సంఘంలో కీర్తి పెరుగుతుంది. కొత్తగా ప్రయత్నించి ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. అయితే రిస్కులు తీసుకోవడం మీ రక్తంలోనే ఉంది. ఈ కారణంగా కొత్త అనుభవాలను పొంది సమస్యల నుంచి బయటపడతారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచింది. అంటే వీలైనంత వరకు ఆగ్రహాన్ని తగ్గించుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎల్లవేళలా అప్రమత్తతతో ఉండాలి. ప్రేమ విషయాలలో జాగ్రత్తలు అవసరం, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​తులరాశి వారికి :-

​తులరాశి వారికి :-

గురుగ్రహ వ్యతిరేక ప్రయాణం వలన మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాడు. మొండి తనం పనికి రాదు, పట్టు విడుపు ఉండాలి. ముందుకు వచ్చి ఆలోచన శక్తి పెంచుకోవాలి. అంతే కాకుండా ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటి ప్రభావం మీ మీద అంతగా ఉండదు. కొన్ని రోజుల్లోనే పరిస్థితుల సద్దుమణుగుతాయి. జీవిత భాగస్వామితో చర్చించి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధు మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. అనుమానాలు, తగువులు కూడదు. సామరస్యమే శ్రీరామ రక్ష. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​వృశ్చికరాశి వారికి :-

​వృశ్చికరాశి వారికి :-

ఈ సమయంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానం అంటే అంతర్జాతీయ స్థాయి వరకు వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఉద్యోగ రంగంలో మీ సృజనాత్మకత, శ్రమ వల్ల అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులను కుడా ఎదుర్కుంటారు. అయితే ఇబ్బందులు ఎదురైనను గురువు గమనం వల్ల మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిసి వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. తలిదండ్రుల ఆశీస్సులు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​ధనస్సురాశి వారికి :-

​ధనస్సురాశి వారికి :-

ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు. గురు గ్రహం తిరోగమనం వల్ల మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఆలోచించాల్సి తరుణమిది. అంతే కాకుండా మీకు ఈ సమయం గడ్డుకాలం. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. వృత్తి పరంగానే కాకుండా వ్యక్తి గతంగానూ ఇబ్బందులకు లోనవుతారు. మనస్సులో ఎలాంటివి పెట్టుకోకుండా మంచిగా ఉంటారు. స్వేచ్ఛగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జీవితంలో వారే రాజు, మంత్రి తామే అనుకున్నది చేసేందుకు ఇష్టపడతారు. దైవానుగ్రహం అవసరం హోమ శాంతి చేయించుకోవడం ఉత్తమం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​మకరరాశి వారికి :-

​మకరరాశి వారికి :-

గురుడు తన స్వంత రాశి అయిన మకరం తిరోగమించడం, శని కూడా ఇదే రాశిలో భ్రమించడం వల్ల కొన్ని ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. తొందరపాటు వ్యవహారం ఉండరాదు. కొన్ని సార్లు మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తుండగా మరి కొన్ని సార్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితమవుతుంది. మీ జీవితంలో కొంత మందికి ఎక్కువ విలువ ఇస్తారు. మీ అభివృద్ధి మార్గంలో మీకెవ్వరూ అడ్డురారు. కీలక అంశాల్లో నిర్ణయం తీసుకునే ముందు కుటుంబంలో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. దైవ బలాన్ని పెంపోదించుకోవాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​​కుంభరాశి వారికి :-

​​కుంభరాశి వారికి :-

కుంభ రాశి వారికి గురుడు ప్రయోజకారిగా మారతాడు. ఈ గ్రహం ప్రభావం వల్ల ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి పెంచుకుంటారు. మనసులో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు ఏర్పడుతాయి. భావోద్వేగంలో కూడా మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయంలో బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇతరుల కంటే మీరు ఎంతో విభిన్నమైన వారిగా భావిస్తారు. మానసిక ప్రశాంతత కోసం దైవనామస్మరణ చేయడం ఉత్తమం. మీ జాతక చక్ర ఆధారంగా గ్రహ దోష నివారణలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​మీనరాశి వారికి :-

​మీనరాశి వారికి :-

గురుగ్రహం మీన రాశి వారి ఆరాధ్య దైవం. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తి జీవితంలో మాత్రం ప్రభావం కనిపిస్తుంది. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి,స్నేహితులు మీకు దూరమైయ్యే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధించి కార్యసాధకులవుతారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తిని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
On May 14, the Jupiter is moving in a direction of distraction. The Guru, known as the Deva Guru, is retreating in the constellation Saturn. Of the resulting 9 planets, 6 are orbiting against the planets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X