వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభముహూర్తాలు ఓకే... దుర్ముహూర్తాలు అంటే ఏమిటి..? వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దిన ప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు.

గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది. దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు,

What is a bad time according to Astrology, why one needs to know about bad Muhurthas?

ఆదివారం సాయంత్రము 4-44 నుండి 5:36 వరకు

సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58 వరకు

మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50 వరకు

బుధ వారం ఉదయం 11-41 వరకు

గురువారం మధ్యాహ్నం 2-54 వరకు

శుక్రవారం మధ్యాహ్నం 12-28 వరకు

శనివారం ఉదయం 2-40 వరకు దుర్మహూర్తం వచ్చుచుండును.

ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.

పంచకరహితము :- ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి.1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజ పంచకం, 6 చోర పంచకం, 8 రోగ పంచకం ఇవి దోషకరమైనవి.

శూన్యమాసము:- శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.

మూఢము లేక మౌఢ్యమి :- రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.

కర్తరి:- కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.

త్రిజ్యేష్ట విచారణ:- తొలుచూలు వరుడు/ వధువు జ్యేష్ట మాసం, జ్యేష్ట నక్షత్రం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే.

English summary
According to Astrology, Muhurath plays a vital role in the life of man. Apart from having good knowledge on good muhurat one should also have an understanding on bad Muhuraths
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X