• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆషాఢ మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జూన్ 22 సోమవారం రోజు నుండి ఆషాడ మాసం ప్రారంభం అవుతుంది. ప్రస్తుత కాలంలో మనం నెలలను ఒకటవ తేది నుండి ప్రారంభం అవుతున్నాయి అని అనుకుంటున్నాము. ఒకటవ తేది నుండి పిలుసుకునే నెలలు అవి మన తెలుగు నెలలు కాదు. అవి ఆంగ్ల నెలలు వాటికి ప్రామాణికం అంటూ ఏమి లేదు. అదే మన తెలుగు మాసాలకు ప్రామాణికత ఉంది. తెలుగు మరియు ఇంగ్లీష్ నెలలు ఎలా ఏర్పడ్డాయి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.

మాసాలు ఎలా ఏర్పడతాయి

మాసాలు ఎలా ఏర్పడతాయి

చాంద్రమానాన్ని అనుసరించి భారతీయ జ్యోతిష పండితులు మాసాల ( నెలల ) కు ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మాల ఆధారంగా ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం తెలుగు సాంప్రదాయ మాసాల ప్రత్యేకత. ఈ మాసం ఎలా ఏర్పడినదో గమనిద్దాం. పూర్వాషాడ లేక ఉత్తరాషాడ నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చిన మాసానికి ఆషాడ మాసం అని పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ నెలలు జనవరి, పిబ్రవరి మొదలైన నెలల విషయంలో ఒక శాస్త్రీయ ప్రామాణికత లేనివి. అవి కేవలం రాజుల పేర్లతోనూ, కొన్ని ఇతర అంశాలతో కూడుకున్న అంశాల వలన వాటిని నెలల పేర్లుగా వారు పిలవడం మొదలు పెట్టారు.

ఆషాఢ మాసంలో ఏం చేయాలి..?

ఆషాఢ మాసంలో ఏం చేయాలి..?

ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు ఏమి చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి, దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి ప్రతి 15 రోజుల కొకసారైనా ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆషాఢ పూర్ణిమే గురుపూర్ణిమ. వ్యక్తికి జ్ఞాన జ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

ఆశాఢ మాసంలోనే బోనాలు

ఆశాఢ మాసంలోనే బోనాలు

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన (బోనం) తీసుకెళ్ళి అమ్మవారికి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరీ జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్త మాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

 ఆషాఢ మాసంలో దూరంగా కొత్త దంపతులు

ఆషాఢ మాసంలో దూరంగా కొత్త దంపతులు

కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన, అందుకే ఈ సంప్రదాయం.

ఆషాఢ మాసంలో మరిన్ని..

ఆషాఢ మాసంలో మరిన్ని..

ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

 ఆషాడ మాస ఫలము

ఆషాడ మాస ఫలము

ఈ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. పంచాంగా ఫలితంగా ఈ నెలలో ధాన్యానికి సమార్ఘత్యము "వర్షాలు" కలుగును. చంద్రునికి మిధునోదయం కలిగినందున దూది సూత్ర దాన్యాలు అధిక ధరలు ఉంటాయి. వస్త్రాలు, గోధుమలు, కందులు, నువ్వులు, మినుములు, ఉలవలు, బఠాణీలు, అవిసేలు, పిండి వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, కుంకుమ పువ్వు, కర్పూరం, తేనె, చక్కర, కంబళ్ళు, వాహనాలు, పెయింటింగులు, బంగారం, వెండి ధరలు అధికంగా ఉండును. శనగలు, లవంగాలు, బాదం, పొగాకు, తేయాకు, గంధం, తమలపాకులు, ఉన్ని, ఇత్తడి, రాగి, కంచు లోహ ధరలు ఎక్కువగా ఉండును. పెసలు, ఖాజు, ద్రాక్ష, ఏలాకులు,పోకలు, ఖర్జూరం, ఉప్పు, నెయ్యి, నునే, ప్రత్తి, పూలు, ముదలగునవి ధరలు నిలకడలేక ఎగుడు దిగుడుగా ఉండును.

English summary
According to Telugu calendar "Aashada Maasam " plays a key role. people will not start works in Aashada maasam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more