వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికమాసము అంటే ఏమిటి..? శుభ ముహూర్తాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

హిందువుల కాలగణన ప్రకారం తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, ఋతువులు, పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని 'అధికమాసం' అంటాం. అంటే, సూర్యుడు ఆ నెలలో ఏ రాశిలోనూ కొత్తగా ప్రవేశింపడు. ఇలా అధికంగా వచ్చే అధికమాసంలో శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని మన పెద్దలు నిషేధించారు.

వివరణ :- సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విధంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు .... మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు.

 What is Adhika maasam ? what is its importance

సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకరరాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు.

అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను ( తిథులను ) ఆధారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 324 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటలు 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 324 రోజులే పడుతుంది.
వీరిద్దరి మధ్య సుమారు 41 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వలన భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు ఏడాదికి 12 మాసాల చొప్పున 228 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.

ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.

18 సెప్టెంబర్ 2020 నుండి అధిక ఆశ్వీయుజ మాసం ప్రారంభమై అక్టోబర్ 16 తో ముగుస్తుంది. అక్టోబర్ 17 నుండి నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 19 సోమవారం నుండి శుభముహుర్తాలు ప్రారంభం అవుతాయి. అధిక మాసం అనుష్ఠానాలకు, జపతపాలకు విశిష్టమైంది. యధాశక్తి దాన ధర్మాలు, సంతర్పణలు చేయడం మంచిది. పితృకార్యాలు మాత్రం యథావిధిగా నిర్వహించాలని శాస్త్రం చెపుతున్నది.

English summary
The Adhika masam always falls between the month of Chaitra and the month of Ashvayuja
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X