వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? అలా ఎందుకు చేయాలి?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కార్తీక మాసంలో శుద్ద విదియ తిధి నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఇది ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది.

భగినీ హస్త భోజనం రావడానికి గల కారణం గురించి తెలుసుకుందాం.
'భగిని' అంటే చెల్లెలైనా కావచ్చు అక్క అయినా కావచ్చు. 'హస్త భోజనం' అంటే చేతి భోజనము అని అర్ధం.అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట ఇందులో కొత్త విషయం ఏముందని మీరు అనుకోవచ్చు సాధారణంగా వివాహమైన చెల్లలు, అక్క ఇంటిలో తల్లి దండ్రులు గానీ అన్నదమ్ములు గానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్గం ఉండదు.

What is Bagini hasta Bhojanam?

శుభ సందర్భాలలో శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ ఊరికే వచ్చి తిననడం మర్యాద కాదని మన సాంప్రదాయం.కానీ కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది.దీనికి ఓ కథ కూడా ఉంది ఆ కథ ఏమిటనగా ....

సూర్య భగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. 'యమునకు' అన్నయ్య 'యముడు' అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా 'యమీ' అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది.ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమ ధర్మరాజు సోదరి యమునుకు మాట ఇచ్చాడు.

అ రోజు తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురు చూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని తనను మన్నించమని 'కార్తీక శుధ్ద విదియ' నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.

అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు.యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో' అని అడిగాడు. ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ వరం కోరుకుంది యమున.

యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు.అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది.ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.

మహారాష్ట్రలో ఈ పండుగను 'భయ్యా-దుజ్' అని పిలుస్తారు.

నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను 'భాయి-టికా' అని పిలుస్తారు.

పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను 'టిక్కా' అని పిలుస్తారు.

అనగా రేపటి రోజున అక్క , చెల్లెలు చేతి వంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను ఉండవు.
కనుక అందరు సోదరి చేతి భోజనం చేసి కనుమరుగైన బంధుత్వాన్ని కలుపుకొని సుఖముగా ఉండాలని కోరుకుంటూ.

English summary
Bagini hasta Bhojanam is symbol for Brother and Sister love relation. This ritual is followed in Karthika Masam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X