వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Buddha Purnima అంటే ఏంటి..? గౌతమ బుద్ధుని చరిత్ర తెలుసుకుందాం.. !

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

బౌద్దప్రవక్త గౌతమబుద్ధుడు. గౌతముడు క్రీస్తుపూర్వం 563 లో జన్మించి 483 లో నిర్యాణము పొందాడు. ఈయన క్షత్రియ వంశంలో జన్మించాడు. వివాహం జరిగి ఒక బిడ్డ జన్మిచాక రాజ్య పరిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు. అనేక ఏళ్లపాటు కఠోర తపస్సు చేసాడు. చివరకు భోది వృక్షమూలంలో కుర్చుని జ్ఞానం సంపాదించాడు. ఆయన సాధించిన జ్ఞాన సంపదే బౌద్ద దర్శనంగా రూపొందింది. అశోక చక్రవర్తి పుణ్యాణ బౌద్ధం చైనా, జపాన్, వియత్నాం, శ్రీ లంక మొదలైన దేశాలకు వెళ్లి అక్కడ నిలదొక్కుకుంది. బుద్దుడు దుఃఖాన్ని అసలు కారణాన్ని కనుగొన్నాడు. దుఃఖం నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే అవిద్యను లేక అజ్ఞానాన్ని తొలగించాలన్నాడు.అవిద్యను నిర్ములించడానికి అష్టాంగ మార్గమే సరైనదని బుద్దుడు భోదించాడు. అష్టాంగం మార్గం అంటే ఎనిమిది అంశాలతో కూడుకుని ఉండేవి అవి 1. సమ్యక్ దృష్టి, 2. సమ్యక్ సంకల్పం, 3. సమ్యక్ వాక్కు, 4. సమ్యక్ కర్మ, 5. సమ్యక్ జీవనం, 6. సమ్యక్ ప్రయత్నం, 7. సమ్యక్ స్మృతి, 8. సమ్యక్ సమాధి ( ధ్యానం ) బుద్దుని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం

గౌతమ బుద్ధుడి చరిత్ర

గౌతమ బుద్ధుడి చరిత్ర

ఈ ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు చిన్న వయస్సులోనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు, పద్ధతులని అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయస్సులో జ్ఞానోదయాన్ని పొందాడు. ఆ తరువాత బౌద్ధాన్ని గురించి తెలుసుకుని ప్రపంచమంత పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయస్సులో నిర్యాణము పొందాడు.

బుద్దుని గురించి వాస్తవాలు

బుద్దుని గురించి వాస్తవాలు

బుద్ధుని గురించి ఆసక్తికర వాస్తవాలు:- బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసమిమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటినుండి ఆడవారికి కూడా సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు. ఆడవారు కూడా తాను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాకా 2500 సంవత్సరాలపాటు మనగలిగిన బౌద్ధం 500 సంవత్సరాలపాటు మాత్రమే ఉంటుందని చెప్పాడు. బుద్దుడు మరియూ మహావీరుని ( జైన తీర్థంకరులలో చివరి వాడు ) మతంలో దాదాపు నలభై వేల మంది సన్యాసినులు ఉండేవారు. వీరి సంఖ్య పురుష సన్యాసుల కంటే ఎక్కువ. ఆడ మరియూ మగ సన్యాసుల నిష్పత్తి 3:1లో ఉండేదిట.

బుద్ధుడుని జాగ్రత్తగా పెంచిన తండ్రి

బుద్ధుడుని జాగ్రత్తగా పెంచిన తండ్రి

బుద్ధుడు పుట్టగానే బుద్ధుని తండ్రితో చాలా మంది జ్యోతీష్కులు ఈయన పేరొందిన మహారాజు లేదా సాధువు అవుతాడని చెప్పారు. కానీ ఒక్క యువ జ్యోతీష్కుడు మాత్రం ఈయన ఖచ్చితంగా పెద్ద ఆధ్యాత్మిక సాధువు అవుతాడని చెప్పాడుట. కానీ బుద్ధుని తండ్రి ఈ యువ జ్యోతీష్కుని మాటలు పెడ చెవిన పెట్టి తన కొడుకు సన్యాసం స్వీకరించకుండా ఏమి చెయ్యాలని ఇతర జ్యోతీష్కులని అడిగాడు. చావు అంటే ఏమిటో తెలియకుండా చేస్తే మంచిది అనడంతో అసలు ఎవ్వరూ మరణించడం లేదా రోగగ్రస్తులవ్వడం బుద్ధుడు చూడకుండా పెంచారు. ఎంత కట్టుదిట్టంగా పెంచారంటే పెరటిలో రాలి పడిన ఎండు ఆకులు కూడా బుద్ధుని కంట పడకుండా చూసేవారుట.

 బుద్ధుడు అనే మాటకు అర్థం...

బుద్ధుడు అనే మాటకు అర్థం...

గత జన్మలో బుద్ధుడు ఙానోదయమైన ఒక ఆధ్యాత్మిక గురువు పాదాలని స్పృశించగానే ఆ గురువు తిరిగి బుద్ధుని పాదాలు పట్టుకున్నాడు. తాను సామాన్యుడిని మాత్రమే కావున గురువు గారు ఇలా ఎందుకు చేసారని బుద్ధుడు అడుగగా ఆ గురువుగారు నీవు ఈ జన్మలో ప్రస్తుతం కాలం బుద్ధుడిని చూస్తున్నావు కానీ నేను రాబోయే బుద్ధుని పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వే బుద్ధునిగా జన్మిస్తావు అని పలికారుట."బుద్ధుడు" అనే మాట ఙానోదయమైన అందరికీ వాడే ఒక పదం మాత్రమే. ఒక మనిషి బుద్ధుడు అయ్యాడు అంటే బుద్ధు ( అవివేకం ) నుండి బుద్ధి ( వివేకం ) లోకి ప్రయాణించడమే. ప్రతీ ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రయాణం మొదలెట్టాల్సిందే. మనందరిలోనూ ఈ మార్గంలో వెళ్ళడానికి కావాల్సిన శక్తి దాగి ఉంది. బుద్ధుని చివరి సందేశం "మీ పట్ల మీరు జాగురూకులై ఉండండి". అనగా మీలోనికి వెలుతురుని ప్రసరింపచేసుకుని అనేక జన్మల నుండి ఉన్న అజ్ఞాన చీకట్లని పారద్రోలమని.

 బోధి చెట్టు కొమ్మను శ్రీలంకకు పంపిన అశోక చక్రవర్తి

బోధి చెట్టు కొమ్మను శ్రీలంకకు పంపిన అశోక చక్రవర్తి


బుద్ధుడు తనని తాను తెలుసుకునేందుకు ఇల్లు విడిచిపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది అస్సలు ఎవరూ ఊహించనిది పైగా అప్పుడే బుద్ధుని భార్య మగపిల్లవాడిని ( రాహులుడు ) ప్రసవించింది కూడానూ. తప్పించుకోలేని జనన మరణ చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఈ బాధల నివారణకు ఉపాయం కనుగొనదలచి తన ఇంట్లో వాళ్ళకెవరికీ కనీసం భార్యకి కూడా తెలియచేయకుండా ఇల్లు విడిచిపెట్టేసాడు. బీహార్లోని బోధ్ గయ ప్రాంతంలో బుద్ధునికి జ్ఞానోదయమయ్యింది. ఆ స్థలం ఇప్పటికీ సంరక్షింపబడుతోంది. కానీ ఏ బోధి చెట్టు క్రింద బుద్ధునికి జ్ఞానం కలిగిందో ఆ చెట్టు కాల గర్భంలో కలిసిపోయింది. కానీ అదృష్టవశాత్తూ ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని అశోకుడు శ్రీలంకకి పంపి బౌద్ధ వ్యాప్తికి తోడ్పడ్డాడు. ప్రస్తుతం గయలో ఉన్న బోధి చెట్టు శ్రీలంకకి అశోకునిచే పంపబడిన చెట్టు నుండి కొమ్మ తీసుకుని పాతగా వెలిసిన చెట్టు.

Recommended Video

Dussehra 2018 : మహాలక్ష్మి గా అమ్మవారు | Mahalakshmi Alamkaram | Oneindia Telugu
 గొలుసుకట్టుగా జ్ఞానం పొందిన శిష్యులు

గొలుసుకట్టుగా జ్ఞానం పొందిన శిష్యులు


పొరపాటున విషపూరితమైన పుట్టగొడుగులు తినడంవల్ల బుద్ధుని భౌతిక శరీరం విడిచిపెట్టబడినది. బుద్ధుడు చక్కగా బోధించగల్గిన ఆచార్యుడు అందువల్లే వేలకొలదీ శిష్యులు బౌద్ధం గురించి ఆయన ద్వారా తెలుసుకోగలిగారు. ఆయన నిర్యాణం తరువాత కూడా అనేక మంది శిష్యులకి జ్ఞానం కలిగింది. ఎందుకంటే ఒక బుద్ధుడు నిర్యాణమొందాకా ఆయన చుట్టూ ఉన్నవారిలో జ్ఞానం ప్రకాశిస్తుందట.ఇలా అనేకమంది గొలుసుకట్టు చర్యలాగ ఒకరి నుండి మరొకరు జ్ఞానం పొందారుట ( బుద్ధుడు నిర్యాణమొందాకా ఆత్మ ఙానం కలిగిన మొట్ట మొదటి శిష్యుని నుండి మొదలుకొని ). ఈ చెయిన్ రియాక్షన్ గురించి తెలుసుకోవాలంటే క్వాంటం ఫిజిక్స్ చదవండి. బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ఒక మిత్రుని రూపంలో బుద్ధుడు మరల వస్తాడని చాలా మంది నమ్మకం. తత్వ వేత్త జిడ్డు కృష్ణ మూర్తిగారు కూడా ఇదే నమ్మారు. గౌతమ బుద్ధుని ఆత్మ ఈయన ద్వారా వస్తుందని నమ్మినవారున్నారు.

English summary
importance and significance buddha purnima 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X