వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాంగంలో దగ్ద యోగం అంటే ఏమిటి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

దగ్ధయోగాలు :- తిథీ వారం కలిస్తే వచ్చే మొత్తం కనక పదమూడు ఐతే అది దగ్ధ యోగం అన్నారు మనవారు. మాయా బజార్ సినిమాలో శంఖు తీర్ధులవారు లెక్క కట్టి "ఇది దగ్ధ యోగం" వివాహం కాదు అని శాస్త్రం చెబుతోంది అంటారు. పదమూడు అంటే 1+3 =4 నాలుగు సంఖ్య జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువుకు సంకేతం. శనివత్ రాహువు అన్నారు. రాహువు చాయా గ్రహం అయిననూ శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. రాహువు కారకరత్వంలో చెడును చేసే ఫలితాలు గమనిస్తే పైకి ధైర్యం లోపల పిరికి, భ్రష్టత్వం, ఉద్రేకం, ఉద్వేగం, ఇతరులకు భాద కలిగించునట్లు చేయుట, మానసిక వ్యద, వ్యాదులు, పనులలో అంతారాయాలు మొదలగునవి కలిగిస్తాడు.

ఆ దగ్ధ యోగాలు కలిగించేవి ఈ క్రింద ఇవ్వ బడ్డాయి గమనించండి.

What is Dagdha Yoga in the panchangam

షష్టీ 6 +7 శనివారం
సప్తమీ 7 + 6 శుక్రవారం
అష్టమీ 8 +5 గురువారం
నవమి 9 + 4 బుధవారం
దశమీ 10 +3 మంగళవారం
ఏకాదశి 11+2 సోమవారం
ద్వాదశి 12+1 ఆదివారం

పైన తెలిపిన రోజులలో ఏ పని మొదలుపెట్టినా జరగదని భావం. షష్టి నాడు మొదలెట్టిన పని కలహంతో ముగుస్తుందిట. అష్టమినాటి పని కష్టాన్ని మిగులుస్తుంది, నవమినాటి పని వ్యయప్రయాసలకే కారణం అంటారు. చిత్రం త్రయోదశినాటి పని దిగ్విజయంగా ముగుస్తుందట. పదమూడు వర్జించవలసిందికాదు, రెండు కలిస్తే పదమూడు వర్జనీయమే !

చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి తిథులను వదిలేస్తాం గనక వీటితో వచ్చే దగ్ధయోగాలను పట్టించుకోం. ఇక దశమి మంగళవారం, ఏకాదశి సోమవారాలే మనల్ని ఇబ్బంది పెట్టేవి. తిధి, వారాలు కలిసి దోషప్రదమైన దగ్ధయోగాన్నిస్తాయి. నిత్యమూ చేసే పనులకి పంచాంగం చూడక్కరలేదంటారు,కొంత మంది పెద్దలు. ఇవి అత్యంత ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఆచరించాల్సి ఉంటుంది.

షష్టి నాడు వచ్చే శనివారం,

సప్తమి నాడు వచ్చే శుక్రవారం,

అష్టమి నాడు వచ్చే గురువారం,

నవమి నాడు వచ్చే బుధవారం,

దశమి నాడు వచ్చే మంగళవారం,

ఏకాదశి నాడు వచ్చే సోమవారం,

ద్వాదశి నాడు వచ్చే ఆదివారం ,

ఇలా వచ్చినప్పుడు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు. వీటిని దగ్ధయోగాలు అంటారు. పనుల కోసం ఏ తిథి మంచిది, ఏ తిథి మంచిది కాదు ఇలా తెలుసు కోండి.

తిధులు వాటి ఫలితాలు:-

పాడ్యమి - మధ్యాహ్నం తర్వాత జయమవుతాయి, శుభం.

విదియ - ఏపని చేసిన సంతోషాన్ని ఇస్తుంది.

తదియ - సౌక్యం, కార్య సిద్ధి.

చవితి - మధ్యాహ్నం తర్వాత జయమవుతాయి.

పంచమి - ధన ప్రాప్తం, శుభయోగం.

షష్టి - కలహం, రాత్రికి శుభం.

సప్తమి - సౌకర్యం.

అష్టమి -కష్టం.

నవమి - వ్యయ ప్రయాసలు.

దశమి - విజయ ప్రాప్తి.

ఏకదశి - సామాన్య ఫలితములు.

ద్వాదశి - భోజన అనంతరం జయం.

త్రయోదశి -జయం.

చతుర్దశి -రాత్రి కి శుభం.

పౌర్ణమి - సకల శుభకరం.

అమావాస్య- సాయంత్రం నుండి శుభకరం.

English summary
Dagdha yoga is the result of the combination of day and date
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X