వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధనుర్మాసం ప్రారంభం - ముగింపు ఎప్పుడు: ఎలాంటి పూజలు చేయాలి..? ఏం తినాలి

|
Google Oneindia TeluguNews

ధనుర్మాస ప్రారంభం

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం

లక్ష్మికాంతం కమల నయనం యోగి హృధ్యాన గమ్యం
వందే విష్ణుమ్ భవ భయహరం సర్వలోకైక నాదం.

కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు.

ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు.

ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం. అనగా . . . ఇది రాత్రి కాలం. మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడి నుండి ఉత్తరాయణం.
అనగా . . . పగలుగా భావన. ఇలా భావిచినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది . . . సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే.

సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.

What is Dhanurmasam according to Telugu calendar,when does this start and end

'చాతుర్మాస్య'మనగా నాలుగు నెలల కృత్యం. ఋతువులు మూడు. అవి - వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో ఋతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానకాలంతోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని 'వర్ష' అని కూడా అంటారు. ప్రతి ఋతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం - ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేథ యజ్ఞం నిర్వహించాలని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఉంది. ఈ వరుస క్రమంలో వర్ష ఋతువును చాతుర్మాస్యం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.

ఏడాది పాపాలు పటాపంచలు.. చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి సంవత్సరానికి ప్రథమ ఏకాదశి. ఈ ఏకాదశినాడు విష్ణువు క్షీర సముద్రంలో శేష పానుపుపై శయనిస్తాడని పురాణ ప్రతీతి. ఈ వ్రతమును ఏకాదశి నుంచి కానీ కర్కాటక సంక్రాంతి దినం నుంచి కానీ ఆషాఢ పూర్ణిమ నుంచి కానీ ఆరంభించవచ్చు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరకృత్య పాపాలన్నీ నశిస్తాయని భారత వచనం.

ఆరోగ్య పరిరక్షణకొరకై ఈ చాతుర్మసం నాలుగు నెలలో ఏ పదార్ధాలు ఏ నెలలో తినకూడదో గమనిద్దాం.

* మొదటి మాసం 24 జులై 2021 నుండి 21 ఆగష్టు 2021 వరకు ''ఆకుకూరలు" తినకూడదు.

* రెండవ మాసంలో 22 ఆగష్టు 2021 నుండి 19 సెప్టెంబర్ 2021 వరకు "పెరుగు" తినకూడదు.

* మూడవ మాసం 20 సెప్టెంబర్ 2021 నుండి 19 అక్టోబర్ 2021 వరకు "పాలు" వాడకూడదు.

* నాల్గవ మాసంలో 20 అక్టోబర్ 2021 నుండి 19 నవంబర్ 2021 వరకు " మినపప్పు ( పప్పు ధాన్యాలు) తినకూడదు.

పాత ఉసిరిక వెతికి మరీ తినాలి.. చాతుర్మాస్య వ్రత విధానం గురించి స్కాంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులంగా ఉంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్రపద మాసాన పెరుగును, ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించాలని వాటిలో ఉంది. ఇంకా నిమ్మ, ముల్లంగి, ఎర్రముల్లంగి, గుమ్మడి, చెరుకు, కొత్త ఉసిరిక, చింత మొదలైన వాటిని త్యజించాలని స్కాంద పురాణంలో ఉంది. పాత ఉసిరిక ఎక్కడ దొరికినా దానిని సంపాదించి తినాలని అందులో పేర్కొన్నారు. పై ఆహార పదార్థాల నిషేధాన్ని బట్టి వర్షాకాలంలో అపథ్య ఆహారాన్ని మానిపించి, ఆరోగ్య పరిరక్షణమే ఈ వ్రత పరమార్థమని స్పష్టమవుతోంది. వర్షా కాలం క్రిమికీటకాలకు పుట్టినిల్లు. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ వ్రతం అపథ్య ఆహారాన్ని త్యజించిందని భావించాలి.

English summary
The lunar calendar is calculated according to which star the moon is in. The solar eclipse is calculated based on the sun crossing each constellation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X