వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలరాతని తప్పించుకోలేమా? అసలు తలరాత అంటే ఏమిటీ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

ఆయుష్షు తీరిన తర్వాత నశించి పోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరో శరీరానికి కర్మల్ని బదిలీచేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు. వెన్నంటే వస్తాయి వెంటాడుతునే ఉంటాయి. ఆ కర్మశేషాలను అనుభవించడానికి మరల మరల జన్మించడం. మనకి ఆ కర్మశేషాలు గుర్తుండక పోవచ్చు కానీ మరిచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి, తలరాత అంటారు .

కర్మలకు మరణం లేదు
మనిషి మరణించినా కర్మలు మరోజన్మకు పయనిస్తాయి. గతజన్మ కర్మలు కంటికి కనిపించవు. కానీ ఈ జన్మలో అనుభవమవుతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాత. గతజన్మల కర్మలశేషఫలానికి .. నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది జీవనయానం.

what is fate : we can’t escape this ?

తలరాత అంటే ..?
సాధారణంగా కష్ట కాలంలో అనుకునేరీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తుంటుంది - ఇదంతా మన తలరాత అని. మనచేతిలో ఏదీలేదు, తలరాత ఎలా వుందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం. ప్రారబ్ధమే మనిషిని నడిపిస్తే అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా ? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముందీ ? ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు నిరాశ వీడదు.

వజ్ర సంకల్పంతో విధిని జయించొచ్చు ..
జన్మించిన ప్రతీజీవి విధికి తలవొగ్గక తప్పదు. కానీ ప్రతి ఒక్కరికి విధిని ఎదురించేశక్తి వుంది. విధి బలీయమైనదే కావొచ్చు... కానీ దానిని మార్చుకోవచ్చు... వజ్ర సంకల్పంతో నిరంతర సాధనతో అకుంఠిత భక్తితో... ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాధలు గుర్తుచేసుకుందాం - విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి తన ఆత్మ విశ్వాసంతో వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి - సత్య వంతుల కధ మనందరికీ విధితమే.
పదహారు ఏళ్ళు మాత్రమే ఆయుష్షు ఉన్న మార్కండేయుడు తన అకుంఠిత భక్తితో యముణ్ణి జయించి శివుని ఆశిస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా ?

చేతిపై విద్యారేఖ గీరి .. సాధనతో వ్యాకరణం రాసి
చదువునందు రాణించలేక తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి నాయనా ! నీకు విద్యరేఖ లేదు చదువుకునే యోగం లేదు కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లి తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువు మాటలకు మనస్సు భారమై ఇంటికి బయలుదేరి మార్గమధ్యంలో దప్పికై ఓ రాతిగిలక బావి దగ్గర ఆగి దాహం తీర్చుకుంటూ తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతిగిలకను చూసి బలహీనమైన తాడువల్ల రాయే అరగగా నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయంకు వచ్చి పదునైన రాతిముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకోని తిరిగి గురువు చెంతకు వెళ్ళి నిరంతర సాధనతో అనతికాలంలోనే విద్యను అభ్యసించి సంస్కృత వ్యాకరణం వ్రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా?

కర్మ ఫలితమే విధి ..
అందరం ఒకటి గుర్తుంచుకోవాలి - మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం. స్వీయకర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతలం మనమే. గతజన్మల కర్మశేషాలే నేటి విధిరాతలయినట్లు .. నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారబ్దాలుగా మూటకట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం ... గిట్టడం ... తప్పదా ఈ చక్రపరిభ్రమణం ... రాదా ముక్తి?
వస్తుంది ... ఎప్పుడు? గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు...

'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః'
ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్యబుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమౌతాయి.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేన పద్మపత్ర మివామ్బసా

ఎవరు కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి, ఆసక్తి లేకుండా తన కర్మలు ఆచరిస్తారో అటువంటి వారు నీటిచే అంటబడని తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు. ప్రతీ ఒకరు చింత చింతన వీడి సానుకూల దృక్పధం ఏర్పరుచుకోవాలి. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి. సానుకూల భావం సాధనా సోపానం. సంకల్పం దృఢమైతే సాఫల్యం తేలికే అవుతోంది.

English summary
Karma will be transferred to another body that can not bear the body of the body. The corrupt deeds of the body will not perish. They keep going. To be born again to experience those rituals. We can not remember those rituals, but do not forget that we forget. This is called fate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X