• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోమం అంటే ఏంటీ ? చేస్తే ఏం ప్రయోజనం చేకూరుతుంది ?

|

మనిషి అన్నాక ఎంతో కొంత స్వార్థం అంటూ ఉంటుంది.నిజమే కానీ కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు.తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే మనమూ బాగుంటామని గుర్తించి గుర్తుంచుకోవాలి. మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్థమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు.

మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట!

హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి ( ఎనర్జీ ) భూమి మీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం.

What Is Homam

హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి.ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.

సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా ప్రతికూలంగా మారితే ఆ వ్యక్తి ఆకాల మృత్యువాతన పడవచ్చు,ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని శాస్త్రం సూచిస్తుంది.ఎక్కువగా హోమక్రతువులను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. నవగ్రహాలలో ఎ గ్రహానికి హోమాలలో ఏ మూలికలు వాడతారు గమనిద్దాం.

సూర్యానుగ్రహం కోసం అర్క " తెల్ల జిల్లేడు " సమిధను ఉపయోగిస్తారు.

చంద్రగ్రహ శాంతి కోసం "మోదుగ"ను వాడతారు.

కుజ గ్రహ శాంతి కోసం "చంద్ర,కదిర" సమిదాలను వాడుతారు.

రాహువు కోసం "గరిక" ఉపయోగిస్తారు.

గురు గ్రహశాంతి కొరకు అశ్వద్ధ "రావి సమిదలను ఉపయోగిస్తారు"

శని గ్రహం అనుకూలత కోసం శమీ "జమ్మి" వృక్ష సమిధను,

బుధ గ్రహశాంతి కొరకు "ఉత్తరేణి" సమిదలను ఉపయోగిస్తారు.

కేతు గ్రహ ఉపశాంతికోసం "దర్భ"ను ఉపయోగిస్తారు.

శుక్రగ్రహశాంతి కొరకు "మేడి" సమిదలను ఉపయోగిస్తారు.

ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది.రావి చెట్టు సమిదలను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు,ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.మోదుగ వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది,రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

హోమాల వలన అన్ని ప్రయోజనాలే ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The man is a bit more selfish than usual.It is not just what we live for ourselves but also for the sake of the good. Remember that all of us are good and remember that good. The Maharishi said that in many cases, Not to say and practically shown. They did much for the sake of others without any reward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more