వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగినీ హస్త భోజనం విశిష్టత: అంటే ఏమిటి, ఏం చేస్తారు?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

యుముడు ఇచ్చిన మాట... నిలబెట్టుకుంటాడట...
సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ

సోదరీ,సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం.

భగిని అంటే సోదరి.ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు.కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది.

ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష( రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెపుతారు.రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది.

"భయ్యా ధూజీ'' అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.
మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున.ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది.కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు.

What is importance of Bhagini Hastha Bhojanam?

చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది.చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.

ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు.వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి.ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది.

ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం ( అకాల మరణం ) లేకుండా ఉంటుంది.ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట.అందు వలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు.

యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అంటాడు.దీనికి కారణం ఉంది.

యముడు యమున సూర్యుని పిల్లలు.సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట.అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట.

అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదర,సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాలలో దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు.పురాణ కధలలో ఎదో అంతరార్ధాలు దాగి ఉన్నాయని గ్రహిస్తే ఆచారాలు ఆచరణలోకి వస్తాయి.

English summary
Bhagini Hastha Bhojanam 2018, Bhagini Hastha Bhojanam after Deepavali in 2018, when is Bhagini Hastha Bhojanam in 2018?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X