• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరణానికి మరో పేరు మార్పు, ఏమిటి జననం మరణం?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ, మరణం అనే పదాన్ని వాడగానే, చాలా భయపడి పోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే "అవస్థాషట్కము" అని అంటారు. అవి-పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, క్షీణించుట, మరియు నశించుట. దీనినే, భగవద్గీతలో, రెండవ అధ్యాయం, సాంఖ్యయోగము, 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు:

శ్లో: "దేహినోస్మిన్ యధాదేహే కౌమారం యౌవనం జరా | తథాదేహాన్తర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి |"

అర్ధం:- జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని.ఇవన్నియూ మార్పులే అని . మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు; యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ, వార్ధక్యము పోయి, మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు.మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల, భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని,

బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల, తాను ప్రేమిస్తున్నవి, తాను అనుభవిస్తున్నవి, సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే, మరణంపై భయాన్ని కలుగచేస్తుంది!

భూమి పుట్టి ఇంతకాలమైనా,ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ

మృత్యు భయం వీడకపోవటానికి కారణం 'మోహం'! మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు ,ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు!అందుకు ధర్మరాజు ,ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు!మృత్యువుని

గురించి నచికేతుడు యమధర్మరాజుని అడిగి తెలుసుకుంటానికి ప్రయత్నించాడు!అది 'కఠోపనిషత్' గా ప్రసిద్ధి చెందింది!ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం-ఏది అభౌతికమైనది అంటే.'ఆత్మే' అభౌతికమైనది.

దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే 'జీవాత్మ' అవుతుంది. 'జీవాత్మ' దేహత్యాగం చేస్తే, 'ఆత్మ'గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం. భూమిలోను., అగ్నితత్వం.. అగ్నిలోను., జలతత్వం., జలములోను., వాయుతత్వం....

వాయువులోను., శబ్దతత్వం.. ఆకాశంలోను., లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది!

What is life and what is death?

అసలు పుట్టటం గురించి తెలుసుకుందాం! సాధారణంగా మానవుల దృష్టిలో పుట్టడం అంటే ఇంతకుముందు లేనిది ఏదో రావడం . గిట్టడం అంటే ఇప్పటి వరకు ఉన్నది పోవడం. క్రియలో రెండు వేరు వేరుగా కనపడుతున్నా కానీ పుట్టడం అన్నా గిట్టడం అన్నా రెండూ ఒకటే ! ఎలా అంటే ఏదైనా ఒక

వస్తువు తన పూర్వావస్థ(అంటే ఇంతకు ముందున్న స్థితి)ని వదిలి ఉత్తరావస్థ(అంటే ఇప్పటి స్థితిని వదిలి తరువాత స్థితి)ని పొందడాన్నే పుట్టడం అంటారు. గిట్టడం అంటే కూడా అదే అర్ధం వస్తుంది ! ఇప్పటి వరకు ఉన్నస్థితిని వదిలి దాని తరువాత స్థితికి వెళ్ళడాన్ని గిట్టడం అంటారు. ఉదాహరణకి ఒక విత్తనం తన బీజావస్థని వదిలి వృక్షావస్థకి వస్తే దానినే మనం చెట్టు మొలిచింది అంటున్నాము. అంటే .. దాని పూర్వావస్థ అయిన విత్తనస్థితి నుంచి అది చెట్టు రూపంలోకి వచ్చింది. అంటే విత్తనం "పోయింది" చెట్టు "పుట్టింది". మనం ఆ చెట్టుని కట్టెల రూపంలోకి మార్చాము అనుకోండి, ఆ ఉన్నచెట్టు కాస్తా పోయింది దాని నుంచి "కట్టెలు" పుట్టాయి ! ఆ కట్టెలనే మనం కాల్చాము అనుకోండి, కట్టెలు పోతాయి దాని నుంచి బొగ్గులు పుడతాయి ! ఆ బొగ్గులనే మళ్ళీ కాల్చాము అనుకోండి, ఆ బొగ్గులు పోతాయి అందులోంచి బూడిద పుడుతుంది. అలా,భూమిలో నుంచి పుట్టిన చెట్టు బూడిదగా మారి చివరకి మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది... ఇలా ఈ భూమి మీద ఏదైనా సరే మట్టిలోనుంచి వచ్చి చివరికి మళ్ళీ మట్టిలో కలవాల్సిందే ! విత్తనంపోయి చెట్టుపుట్టింది!

చెట్టుపోయి కట్టెలు పుట్టాయి కట్టెలు పోయి బొగ్గులు పుట్టాయి

బొగ్గులు పోయి బూడిద పుట్టింది

బూడిద తిరిగి మట్టిలోనే కలిసింది ..!

ఈ రకంగా పుట్టడం అంటే ఒక వస్తువు తన పూర్వావస్థని వదిలి ఉత్తరావస్థని (అంటే తరువాత స్థితిని) పొందడం. ఇక్కడ అవస్థ అంటే అర్ధం స్థితి అని.

అంటే వస్తువు (మెటీరియల్ ) అదే, కాని దాని రూపం మారింది.

'గతం' అనేది ఒక సెకండ్ క్రితం వెళ్ళిపోయింది.

దాన్ని తిరిగి తీసుకోనిరావటం అంబానీ,బిల్ గేట్స్ ల వల్ల కూడా కాదు. 'గతం'అనేది ఒక మృత వస్తువు!దానికి ప్రాణంపోసి,సజీవు

రాలిని చేయటం అసంభవం!ఇంతవరకూ జరగలేదు,ఇక ముందర కూడా జరగదు!

మరణాన్ని గురించి నిదానంగా ప్రశాంతంగా తెలుసుకోవాలి.

దీన్ని గురించి తెలుసుకుందామనే తొందరపాటు ఉండకూడదు.

మృత్యువును అతి సహజంగా,హుందాగా ,అంతరంగ గౌరవ మర్యాదలతో చేరుకోవాలి. జననం మాదిరిగానే మృత్యువు కూడా అద్భుతమైనవిషయం. మృత్యువులో కూడా సృష్టి ఉంది. సృష్టి ఆది,అంతం లేకుండా నిరంతరం జరుగుతుండే ప్రక్రియే !మృత్యువు సృష్టికి ఒక అర్ధాన్నిస్తుంది,

మళ్ళీ జన్మ ఎత్తటం,కావలసిన

వన్నీ పొందటం దానికేమి

సంబంధం లేదు. ఆది,మధ్య,అంతం అనే స్థితులు లేని ఒక మహత్తర సృష్టి మృత్యువు అంటే! మృత్యువు అంటే ఇంకా సులభంగా చెప్పాలంటే,అది మనల్ని సమీపించిన వేళ ,మన దగ్గర ఉన్నవన్నీ తొలగించ బడుతాయి! అనుబంధాలు, డబ్బు, భార్య,

పిల్లలు, దేశం, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, గురువులు, శిష్యులు, దేవుళ్ళు -నిజానికి వీటన్నిటినీ గురించిన భావాలను మనతో వస్తాయనుకుంటాం!కానీ ,అది అసాధ్యం!అవన్నీ మృత్యువు తెంచేస్తుంది!

ఒక్క వాక్యంలో చెప్పాలంటే

గతం నుండి విముక్తే(Freedom from the Known) మృత్యువు అంటే! అయితే,ఇంత సహజమైన మృత్యువుని చూసి భయమెందుకంటే, గతాన్ని మరచి పోవటానికి మనం సిద్ధంగా ఉండం.ఇంత చెబుతున్నా ,ఎవరైనా తమ మత విశ్వాసాలను మార్చుకుంటారా?గతం నుండి విముక్తి చెందారా?అంటే సమాధానం లేదనే చెప్పాలి! గతం

నుండి విముక్తి చెందటమంటే, వర్తమానంలో జీవించటం! అట్టివారికి మృత్యు భయం ఉండదు.

మృత్యువును, జననం అంత సహజంగా చూస్తారు! భూమి పుట్టిన తర్వాత ఇన్ని మృత్యువులు సంభవించాయి కదా, మరి అది మిగిల్చిన సందేశం ఏమిటంటే-పూర్తిగా నిరాసక్తతగా ఉండండి,Be Totally Detached. ఎందుకంటే,

మృత్యువు సమీపించినప్పుడు జరిగేది అదే!

చనిపోవటమంటే,

అన్నిటినీ వదులుకోవటం!

To give up everything!మృత్యువు అన్నిటినుంచి మనల్ని తోసివేస్తుంది. ఇవన్నీ క్రోడీకరిస్తే, మృత్యువు అంటే స్వేచ్ఛగా ఉండటమే!

అనుక్షణం మనం శ్వాస,నిశ్వాసాల ద్వారా మరణిస్తూనే ఉన్నాం,కొందరు అనుకున్నట్లు పుడుతూ కూడా ఉన్నాం ! పునర్జన్మ అంటే ఇదే! So, Living is Dying! ఇలా అనుక్షణం మరణించే మనం మృత్యువుని చూసి భయపడటం అర్ధరహితం! దీన్ని గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు!'

నాకు అన్నీ తెలుసు అన్న మనిషికి,అసలు ఏమీ తెలియదు !'అనే ఒక నానుడిని మీరు కూడా వినే

ఉంటారు !నేను భగవదనుభూతిని పొందాను,ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటో నాకు తెలుసు -అని ఎవరైనా అంటే,

దానర్ధం 'స్టేషన్ కు వెళ్ళటానికి నాకు దారి తెలుసు సుమా'అని ! స్టేషన్ ఒక స్థిర ప్రదేశం ! దీన్ని చేరుకోవటానికి అనేక మార్గాలున్నాయి. ఈ రోజుల్లో ఒక్కక్క మార్గానికి ఒక్కక్క గురువు ఉన్నాడు. నిజానికి వాళ్ళు చెబుతున్న'నాకు తెలుసు ,నేను చూసాను' అంటే వాళ్ళు ఏదో చూసారు!ఆ చూచినదానికి కట్టుబడి ఉన్నారు.

వాళ్ళంతా గతంలోనే ఉన్నారు!'గతం' కాలంలో కరిగి పోతుంది!అది సజీవమైంది! స్టేషన్ లాగా అది స్థిరమైన ప్రదేశం కాదు !మృత వస్తువు అంతకన్నా కాదు !

విశ్వాసం నిజం కాకపోవచ్చు, అదే సత్యం కాదు కూడానేమో!

కొంతమంది భగవంతుని విశ్వసించవచ్చు, కొంతమంది విశ్వసించక పోవచ్చు! ఎవరి విశ్వాసంలో వారికి ప్రామాణికత లుంటాయి. మన ఆలోచనలకు అనుగుణంగా మనం విశ్వాసాలను ఏర్పరుచుకున్నాం! మరి ,ఇంతకూ నిజం ఏమిటో ఎలా తెలుస్తుంది?నిజం తెలుసుకోవాలంటే,

మనసు స్వేచ్ఛగా ఉండాలి.విశ్వాసం ,

అవిశ్వాసం -ఈ రెండింటిలోను దానికి తావులేదు! నిరంతరమూ అన్వేషించటమే సత్యాన్ని తెలుసుకోవటానికి మార్గం!ఏదో ఒక మార్గంలో అన్వేషించాలి!ఆ మార్గం తప్పైతే ,

మరో మార్గం! మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహబాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Death have many meaning it depends what is your perspective towards death for most commonly death is known as the end of your mortal life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more