• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రగ్రహణం అంటే ఏమిటి? ఈ సమయంలో ఆచరించాల్సింది ఏమిటి?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా ఇవాళ అర్ధరాత్రి గల చంద్ర గ్రహణము.కేతు గ్రస్తంగా ,ఉత్తరాషాడ నక్షత్ర మొదటి పాదం మరియు రెండవ పాదంలో అనగా ధనస్సు,మకరరాశులు,వృషభ ,మిధున లగ్నాలలో చంద్ర గ్రహణం సంభవించనున్నది.ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.

గ్రహణసమయ వివరాలు :-

గ్రహణ_స్పర్శకాలము - రాత్రి 1. 34 ని॥లకు

గ్రహణ_మధ్యకాలము - రాత్రి 03:03 ని ॥లు

గ్రహణ_మోక్ష కాలము - రాత్రి 04:27 ని॥లకు

అంటే చంద్రగ్రహణము రాత్రి 1 గం. 34 ని॥లకు ప్రారంభమయ్యి , రాత్రి 04 : 27 ని॥లకు ముగుస్తుంది. ఈ చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం సుమారు 4 గంటల పాటు ఉంటుంది.

ఏయే దేశాల్లో ఈ గ్రహణం ఉంది :- మన దేశంతో బాటు, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చంద్ర గ్రహణం కన్పిస్తుంది.

what is Lunar eclipse ..?

వ్యక్తిగత జాతకంలో తమ దశ విదశల గ్రహల స్థితిని బట్టి మాత్రమే జాతక ఫలితాలు ఉంటాయి. కానీ ఇలా గ్రహణం కారణంగా ఎలాంటి కీడు జరుగదు.అలాగే రాశి ఫలాలు కూడా ! కావున అన్ని రాశుల వారు ఎలాంటి భయానికి గురికావొద్దు.గ్రహణం సమయంలో అన్ని రాశులవారు తమకు గురు ఉపదేశం ఉన్న మంత్ర జపం చేయడం మంచిది.ఉపదేశం లేని వారు అష్టాక్షరి "ఓం నమో నారాయణాయ" లేదా శివ పంచాక్షరి "ఓం "నమశ్శివాయ" అని జపం చేసుకోవడం విశేషం,తద్వారా దైవ అనుగ్రహం లభిస్తుంది.అనవసర అపోహలతో సమయము డబ్బు వృధా చేసుకోరాదు.పంచాంగంలో చెప్పిన ప్రకారం ఏ ఏ రాశి వారికీ బాగాలేదో ఆయా రాశివారు గ్రహణ సూచిత సమయంలో ఎక్కువ జపం చేసుకున్నా సరిపోతుంది.

గర్భిణీలు అస్సలు భయపడవద్దు :- గ్రహణం అనగానే అధికంగా కంగారు పడేది గర్భిణీలు వారి తల్లిదండ్రులు.గ్రహణ సమయంలో ఎటూ కదల రాదు అని ఒకే దిశలో పడుకొని ఉండాలి అని, కదిలితే గ్రహణ మొర్రితో పిల్లలు పుడతారు అనే వదంతులు చాలా ఉన్నాయి.నిజమే గ్రహణంలోని అతినీలలోహిత కిరణాల( UVR ) ద్వారా సున్నితమైన శిశువు పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని మన మహర్షులు చెప్పారు.ఆ దుష్ప్రభావం అత్యధికంగా సూర్య గ్రహణంలోనే ఉంటుంది కానీ చంద్ర గ్రహణం వలన అంతటి హాని కలుగదు కావున గర్భిణీలు ఎలాంటి భయమునకు లోను కాకుండా యధావిధిగానే ఉండవచ్చు.

గ్రహణ సమయంలో కిరణాలు పడకుండా బయటకు రాకుండా ఉండి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది.

గ్రహణానికి ముందు ఏమీ తినరాదా ? గ్రహణానికి ముందు తింటే దోషం అని అరిష్టం అని చెబుతుంటారు. మన మహర్షులు చెప్పిన పరిశోధనాత్మక విషయమే అది. సూర్య గ్రహణం వలన సంభవించే Ultra Violated Rays నిజంగానే అంతటి శక్తివంతమైనవి. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో కొన్నిసెకన్లు కనుక సూర్యుడిని చూస్తే మరో సెకన్ లో కంటి చూపు పోతుంది. వారి పరిశోధన శక్తికి మనం గర్వపడాలి. అయితే ఆ సూత్రాలన్నీ మన మహర్షులు చెప్పిన కాలానికి సంబంధించినవే . గ్రహణం విషయంలో అతి నీల లోహిత కిరణాలు (UVR ) వెనుకటి నివాసాలు అయిన గుడిసెలు పెంకుటిళ్ళ లోకి సులభంగా చేరేవి, ఆ కాలంలో విద్యుత్తు లేదు కనుక వెలుతురు ఇంట్లోకి రావడం కోసం ఇంటి చూరు కి అద్దాలు పెట్టేవారు.

అలాగే ఇంటి నాభిస్థానంలో గచ్చు ఏర్పాటు చేసేవారు.తద్వారా సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఇంట్లోకి ప్రవేశించేవి.కనుక వారు వండిన పదార్థాల గురించి కానీ లేదా నిలువ ఉంచిన పదార్థాల గురించి గానీ జాగ్రత్త పడేవారు.నేడు కరెంటు ఉండి ,RCC తో కట్టుకుంటున్న ఇల్లు వచ్చినప్పటికీ అదే ఆచారం నేటికీ అలాగే కొనసాగుతుంది.పంచాంగంలో గ్రహణము రోజున కొన్ని గంటల ముందు ఎలాంటి పదార్థాలు తినరాదు అని చెబుతారు. అక్కడే రోగులు, చిన్న పిల్లలు, వృద్ధులు మినహా అని కూడా చెబుతారు. ఇక్కడే మీరు కొద్దిగా లోతుగా ఆలోచించాలి. గ్రహణ వేద వలన ఆహారానికి ఏదైనా దుష్ప్రభావం కలిగితే త్వరగా తొందరగా ఎఫెక్ట్ అయ్యేది కేవలం రోగులకి, చిన్న పిల్లలకి వృద్ధులకి మాత్రమే.గ్రహణం సమయం ఉపాసనకి చాలా విశేషం.

గమనిక :- మంగళవారం16 / 17-07-2019 గ్రహణం రోజున ఆబ్దీకం వచ్చినయడల మధ్యాహ్నం నిత్యభోజన ప్రత్యాబ్ధీకాదులు నిరభ్యంతరంగా పూర్తి చేసుకోవచ్చు.

గర్భిని స్త్రీలు నుదుట విభూధి ధరిస్తే మంచిది.ఇంట్లో నిలువ ఉన్న ఉంచుకునే ఆహార పదార్ధాలు అనగా పచ్చళ్ళు మొదలగునవి వాటిపై " గరిక " వేస్తె ఎలాంటి దోషం వర్తించదు.

ముఖ్యంగా గ్రహణానికి ముందు వండిన వంటలను గ్రహణం తర్వాత మరుసటి రోజు తినకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది.గ్రహణం మరుసటి రోజు అనగా తేది 17 బుధవారం రోజు ఉదయం ఇల్లును శుద్ధి చేసుకుని తలస్నానం చేసి దేవిని పూజా గది శుభ్రం చేసుకుని విగ్రహాలను ,యంత్రాలకు"పులికాపి " చేసి పుష్ప ,నైవేధ్యలాతో పూజించాలి. గాయత్రి "జంధ్యం " వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు మార్చుకుని,ఇంట్లో నరద్రిష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు,కొబ్బరికాయలు తీసివేసి కొత్తవి కట్టుకోవాలి.చేతి కంకణాలు కూడా పాతవి తీసి కొత్తవి కట్టుకోవాలి ఆ తర్వాతే కొత్తగా వంట చేసుకుని భుజిస్తే చాలా మంచిది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lunar eclipse of Ashara at full moon, today night. A lunar eclipse will occur in Ketu Grstanga, Uttarashada stellar first quarter and Jupiter in Capricorn, Taurus and Gemini in the second quarter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more