వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంగళ చండికా స్తోత్రం అంటే ఏంటీ ? ప్రయోజనాలేంటీ ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

కుజదోష నివారణకు 'మంగళ చండీదేవి" ని పూజించాలి అని 'బ్రహ్మవైవర్త పురాణం' చెబుతోంది.

జాతకంలో కుజదోష నివారణకు?

కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు. అందుకు కారణం కుజ దోషం నుంచి బయటపడటం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే.

what is Mangala Chandika Devi stotram and they benefits

పెళ్లి కావలసిన వారికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకు గాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే 'మంగళచండీ దేవి' ని పూజించాలని 'బ్రహ్మవైవర్త పురాణం'చెబుతోంది.

ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానా అవస్థలు పడుతున్నారో ... ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా నానాప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే 'మంగళచండీ దేవి'.

కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు.

ఇక మంగళుడే కాదు ... సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి.

కాబట్టి కుజదోషం వున్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు.

కుటుంబ క్షేమానికి మంగళచండీ స్తోత్రం
త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.

మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.

శత్రు పీడలు, ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.

శ్రీ మంగళ చండికా స్తోత్రం.

ధ్యానం :.
దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్
బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్ శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్
జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే
దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.

శ్రీ మహాదేవ ఉవాచ:-
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే పూజ్యే
మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.

English summary
The Brahmavaivarta Purana says, "Mangala Chandi Devi" should be worshiped for the prevention of Kujadosha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X