• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్షయ తృతీయ అంటే ఏంటీ ? పండితులు ఏం చెప్తున్నారు ?

|

అక్షయ తృతీయ అనగా ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం,హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుందని చెపుతాడు. అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. దానం చేయమని పురాణాలు చెపుతుండగా బంగారం కొనడం అనేటువంటివి తప్పు.

వైశాఖ శుద్ధ తదియ నాడు....

1.పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి "మహా భారతము"ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు "అక్షయ పాత్ర" ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు "కనకధారాస్తవం" ను చెప్పిన దినం

9. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అంత పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోగలరు

what is meaning of Akshaya Tirthiya

గత జన్మ శాపాలు ఈ జన్మలో కూడా వెంటాడతాయి. పితృశాపం, మాతృశాపం, స్త్రీ శాపం, పుత్రిక శాపం, సోదరీ శాపము, దైవ శాపము, అపరిచిత శాపము, సంబంధిత శాపము ఇటువంటి శాపాలు ఒక వ్యక్తి జాతక చక్రంలో లగ్నం మరియు నవాంశ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు. గత జన్మ శాపాలు ప్రస్తుత జన్మ పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయి. అనేది కూడా పరీక్షించుకోవచ్చు జాతక చక్రంలో ఆయా గ్రహాల స్థానాలను అనుసరించి ఫలితాలు నిర్ధారించవచ్చును.

జాతక చక్రాన్ని లోతైన విశ్లేషణ ద్వారా ఈ ఫలితాలను రాబట్టవచ్చు. డబ్బుని అనారోగ్యం నిమిత్తం ఎక్కువగా ఖర్చు పెట్టడం విద్యకు ఆటంకాలు జరగడం. ముప్పై సంవత్సరాలు వయస్సు నిండినప్పటికీ వివాహం కాకుండా పోవుట. పరిశోధనలో పూర్వజన్మ శాపము కారణంగా వివాహాలు ఆలస్యము కావడమో లేదా వివాహం అయిన తరువాత విడిపోవడం అనేది తొంభై అయిదు శాతం జాతక చక్రాలలో గమనించడం జరిగింది.

భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు దంతక్షయానికి సంబంధించిన సమస్యలు సంభోగ శక్తి సన్నగిల్లడం జుట్టు త్వరగా రాలిపోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం మన ఇంటి పరిసరాలలో కుక్క పిల్లి లేదా పాడి పశువు చనిపోవడం లేదా దొంగతనం జరగడం జాతకుడు నిర్దోషి అయినప్పటికీ పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కడ౦. శరీరంలో రక్త హీనత తీవ్రమైన కాళ్ల నొప్పులు తరచూ కోపంతో ఇతరులతో గొడవ పడడం ఇటువంటి లక్షణాలలో రెండు లేదా మూడు లక్షణాలు ఒక జాతకుడు పై ప్రభావం చూపిస్తుంటే ఆ వ్యక్తికి పూర్వజన్మ శాపం ఈ జన్మ పై ప్రభావం చూపిస్తున్నది అని తెలుసుకోవాలి.

కేవలం ఇవి సమస్యకు లక్షణాలు మాత్రమే. వీటి వలన ఆర్థికంగా పతనం కావడం అకాల మరణాలు భార్యా వియోగం, జైలుకు వెళ్లడం, డబ్బు వారసులు ఉన్నప్పటికీ తన చివరి కాలంలో ఎవరి సహకారం లేకుండా ఒంటరిగా వెలి వేయబడడం. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం వారసత్వ ఆస్తి ని పోగొట్టుకోవడం ఇటువంటి దుష్ఫలితాలు మరెన్నో జాతకుడు ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది.

జ్యోతిష్యుడు ఈ సమస్యను గుర్తించినప్పుడు 2 లేదా 3 ప్రశ్నలను జాతకుడుని ప్రశ్నించి దోష నిర్ధారణ చేయవచ్చు. చాలా చిన్న పరిహారాలు ద్వారా వీటి నుంచి బయటపడవచ్చు. కొంతమంది జాతకులు మేము గ్రహాలకు జపం క్షీర తర్పణం హోమాలు చేయించాము కానీ సరైన ఫలితం దక్కలేదు అంటూ ఉంటారు. వారు మొదట పూర్వజన్మ శాపం ఉన్నట్లు అయితే దానికి పరిహారం మొదట చేసుకోవాలి.

మనకు మన మహర్షులు అందించిన గొప్ప వరంగా దీనిని భావించాలి. నా అనుభవంలో ఎంతో మంది జాతకాలకు ఈ సమస్యను గుర్తించడం పరిహారాలు చెప్పడం వారు మంచి ఫలితాలను పొందడం జరిగినది. ఇటువంటి విద్య పుస్తకాలలో లభించదు గురు పరంపర గా మాత్రమే లభిస్తున్నది. మా గురుదేవులు నాకు ప్రసాదించిన ఒక వరంగా దీనిని భావిస్తాను. జాతకులు సరియైన జ్యోతిష్యుని సంప్రదించినప్పుడు జాతకుడు యొక్క భవిష్యత్తు సంతోషకరంగా ఉండడం లో అతిశయోక్తి లేదు.

గతజన్మలో చేసిన పాప ఫలం, ప్రస్తుత జన్మలో తెలిసి తెలియక జరిగిన తప్పిదములకు దోష నివారణార్ధం ఈ అక్షయ తృతీయ రోజు చేతనైన ధన ,వస్తు రూపేణ పేద వారికి దానం చేస్తే తిరిగి అంతకు రెట్టింపు లాభాలు తిరిగి ఎదో రూపంలో దానం చేసిన వారికి వస్తుంది. ఈ దాన కార్యక్రమం కంటే ముందు ఇంట్లో లక్ష్మి అమ్మవారిని పూజించి ఆ తరవాత దాన ధర్మాలు చేయాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Akshaya Tirthiya is the name of the goddess Parvati who is described in the name of Sarakakama Akshaya Thirdiya. Vaishakha refers to the pure tantri, japa, homam, danavativaniyil or virtuous function that says that the result will be corrected. Akshaya Thirdiya Natasana are good results. Lakshmi, the chief of wealth in particular, is blessed with the blessings of Lakshmi and good deeds. Myths about donating to buy gold are wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more